జగన్‌కు అంత నచ్చేశాడా?
ఏపీ కేబినెట్లో ఎస్సీ వర్గానికి చెందిన ఐదుగురికి జగన్ అవకాశం కల్పించారు. ఈ క్రమంలోనే చాలా మంది మంత్రులుగా చక్రాలు తిప్పుతున్నారు. వీరిలో ఇద్దరు మహిళా నేతలు [more]
ఏపీ కేబినెట్లో ఎస్సీ వర్గానికి చెందిన ఐదుగురికి జగన్ అవకాశం కల్పించారు. ఈ క్రమంలోనే చాలా మంది మంత్రులుగా చక్రాలు తిప్పుతున్నారు. వీరిలో ఇద్దరు మహిళా నేతలు [more]
ఏపీ కేబినెట్లో ఎస్సీ వర్గానికి చెందిన ఐదుగురికి జగన్ అవకాశం కల్పించారు. ఈ క్రమంలోనే చాలా మంది మంత్రులుగా చక్రాలు తిప్పుతున్నారు. వీరిలో ఇద్దరు మహిళా నేతలు కూడా ఉన్నారు. మేక తోటి సుచరిత, తానేటి వనిత, కె. నారాయణ స్వామి, పినిపే విశ్వరూప్, ఆదిమూలపు సురేష్‌లకు జగన్ మంత్రులుగా అవకాశం కల్పించారు. అయితే, వీరిలో మహిళల విషయాన్ని పక్కన పెడితే ఎస్సీ మంత్రుల్లో ఆదిమూలపు సురేష్ దూకుడు ఎక్కువగా ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సీఎం జగన్ కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అన్నింటా మంచి మార్కులే…
విద్యాశాఖ మంత్రిగా ఉన్న ఆదిమూలపు సురేష్ తనదైన శైలిలో సైలెంట్‌గా దూకుడు చూపిస్తున్నారు. జగన్ ఆశయాలకు అనుగుణంగా ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన అమ్మ ఒడి కార్యక్రమాన్ని ఎక్కడా ఎలాంటి అవాంతరాలు లేకుండా అమలు చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథకం కింద నిధులు అందేలా చేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఈ పథకం ద్వారా మంచి పేరు వచ్చిందనడంలో సందేహం లేదు. ఇక, నాడు – నేడు కార్యక్రమంద్వారా పాఠశాలల రూపు రేఖలు మార్చేందుకు మంత్రి చేస్తున్న ప్రయత్నానికి కూడా మంచి మార్కులే పడుతున్నాయి.
వాటికి దూరంగా…..
అదే సమయంలో మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయడంతోపాటు.. మెనూను కూడా మార్చి విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను ప్రవేశ పెట్టడం కోసం శ్రమిస్తున్నారు. ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకు వెళ్లడంలో మంత్రి పూర్తిగా విజయవంతం అయ్యారనే చెప్పాలి. ఇక, కేబినెట్లోని ఒకరిద్దరు మంత్రుల మాదిరిగా తనకు సంబందం లేని విషయాల్లో వేలు పెట్టడం, తన శాఖలో అవినీతిని ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలకు మంత్రి కడు దూరంలో ఉంటున్నారు.
తన పని తాను సైలెంట్ గా….
ఇక, ప్రతిపక్ష నేతలకు సరైన కౌంటర్లు ఇవ్వడంలో ఆదిమూలపు సురేష్ ముందు ఉంటున్నారు. అయితే ఈ విషయంలో సురేష్‌కు కొడాలి నాని, పేర్ని నాని, బొత్స సత్యనారాయణ తరహాలో ఎక్కువ మార్కులు రాకపోయినా సురేష్ మాత్రం తనదైన స్టయిల్లో తన పని తాను సైలెంట్‌గా చేసుకుపోతున్నారు. ఇక జిల్లాలోనూ సీనియర్ నేతలు అయిన బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, టీటీడీ ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి ఉన్నా వారితో ఎలాంటి వివాదాలు లేకుండా సురేష్ ముందుకు వెళుతూ జగన్‌కు మరింత ప్రీతిపాత్రం అవుతున్నట్టే కనిపిస్తోంది.