ఆదియే పుంజుకుంటున్నారా? ఆ రెడ్డి తప్పు చేశారా?
జమ్మలమడుగు రాజకీయాలంటే అందరికీ తెలిసిందే. అక్కడ మొన్నటి వరకూ రెండు గ్రూపులున్నాయి. ఒకటి రామసుబ్బారెడ్డి గ్రూపు. మరొకటి ఆదినారాయణరెడ్డి గ్రూపు. ఇప్పుడు జమ్మలమడుగులో రామసుబ్బారెడ్డి గ్రూపు దాదాపుగా [more]
జమ్మలమడుగు రాజకీయాలంటే అందరికీ తెలిసిందే. అక్కడ మొన్నటి వరకూ రెండు గ్రూపులున్నాయి. ఒకటి రామసుబ్బారెడ్డి గ్రూపు. మరొకటి ఆదినారాయణరెడ్డి గ్రూపు. ఇప్పుడు జమ్మలమడుగులో రామసుబ్బారెడ్డి గ్రూపు దాదాపుగా [more]
జమ్మలమడుగు రాజకీయాలంటే అందరికీ తెలిసిందే. అక్కడ మొన్నటి వరకూ రెండు గ్రూపులున్నాయి. ఒకటి రామసుబ్బారెడ్డి గ్రూపు. మరొకటి ఆదినారాయణరెడ్డి గ్రూపు. ఇప్పుడు జమ్మలమడుగులో రామసుబ్బారెడ్డి గ్రూపు దాదాపుగా కనుమరుగైందంటున్నారు. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. మరో నేత ఆదినారాయణరెడ్డి మాత్రం బీజేపీలో చేరి తన వర్గాన్ని పటిష్టం చేసుకుంటున్నారు.
ఇద్దరూ ఏకమయినా…..
2014 ఎన్నికలకు ముందు రామసుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డిలు ఏకమయ్యారు. ఇద్దరి మధ్య చంద్రబాబు సయోధ్య కుదర్చడంతో రామసుబ్బారెడ్డికి జమ్మలమడుగు నియోజకవర్గం టిక్కెట్, ఆదినారాయణరెడ్డికి కడప ఎంపీ టిక్కెట్ లు దక్కాయి. అయితే ఇద్దరూ 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. దీంతో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఆదినారాయణరెడ్డి మరో మార్గం లేక బీజేపీలో చేరిపోయారు. రామసుబ్బారెడ్డి మాత్రం టీడీపీని వీడి వైసీపీలో చేరిపోయారు. ఇప్పుడు ప్రస్తుతం జమ్మలమడుగులో టీడీపీకి నేత అంటూ ఎవరూ లేకుండా పోయారు.
ఆదినారాయణరెడ్డి మాత్రం…..
అయితే స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా బీజేపీలో ఉన్న ఆదినారాయణరెడ్డి తన వర్గాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేశారు. అప్పటి వరకూ టీడీపీ, వైసీపీల నుంచి తనను అనుసరించిన నేతలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో టిక్కెట్లు ఇచ్చేశారు. చాలా చోట్ల ఆయన తన అభ్యర్థులను బరిలోకి దించారు. దీంతో ఆదినారాయణరెడ్డి వర్గం పూర్తి స్థాయి సంతృప్తిలో ఉంది. ఇక్కడ గెలుపోటములు ముఖ్యం కాదని, నాయకుడు తమను గుర్తించారా? లేదా? అన్నదే ముఖ్యమని చెబుతున్నారు.
రామసుబ్బారెడ్డి మాత్రం…..
మరోవైపు రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరడంతో ఇక అక్కడ వైసీపీకి అంతా తిరుగులేదనుకున్నారు. కానీ రామసుబ్బారెడ్డికి ప్రస్తుత ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి మధ్య పొసగడం లేదు. అయినా సర్దుకుపోవాల్సిన పరిస్థితి రామసుబ్బారెడ్డిది. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఎక్కువగా సుధీర్ రెడ్డి తన వర్గం వారికే టిక్కెట్లు ఇప్పించుకున్నారు. టీడీపీ ఇక్కడ పోటీ చేయలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో రామసుబ్బారెడ్డి వర్గంలో అసంతృప్తి తలెత్తిందంటున్నారు. ఆదినారాయణరెడ్డి జమ్మలమడుగులో కొంత స్ట్రాంగ్ అయినట్లు కనపడుతుంది.