అసలు విషయం అర్థమయిందా?
ప్రకాష్ రాజ్ సహజ నటుడు. సినిమాల్లో ఆయనకు మంచి పేరుంది. ఆయన కన్నడ, తమిళ, తెలుగు సినీ అభిమానులకు సుపరిచితులు. ప్రకాష్ రాజ్ కు సినిమాలతో పాటు [more]
ప్రకాష్ రాజ్ సహజ నటుడు. సినిమాల్లో ఆయనకు మంచి పేరుంది. ఆయన కన్నడ, తమిళ, తెలుగు సినీ అభిమానులకు సుపరిచితులు. ప్రకాష్ రాజ్ కు సినిమాలతో పాటు [more]
ప్రకాష్ రాజ్ సహజ నటుడు. సినిమాల్లో ఆయనకు మంచి పేరుంది. ఆయన కన్నడ, తమిళ, తెలుగు సినీ అభిమానులకు సుపరిచితులు. ప్రకాష్ రాజ్ కు సినిమాలతో పాటు సామాజిక సమస్యల పట్ల అవగాహన ఎక్కువ. అన్ని విషయాల్లోనూ ఆయన బాధ్యతతో స్పందిస్తుంటారు. ప్రధానంగా బీజేపీ అంటేనే ఆయనకు పడదు. హిందుత్వ నినాదంతో బీజేపీ ప్రజల్లో చీలిక తెస్తుందని ఆయన విశ్వాసం.
మోదీ ప్రభుత్వంపై…..
అందుకే గత కొన్నేళ్లుగా ప్రకాష్ రాజ్ బీజేపీ ప్రభుత్వంపై దండయాత్ర చేస్తున్నారు. అనేక వేదికలపై మోదీ నిర్ణయాలను, ప్రభుత్వ విధానాలను సూటిగా ప్రకాష్ రాజ్ విమర్శించేవారు. ఇక ట్విట్టర్ వేదికగా కూడా ప్రకాష్ రాజ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు చేయడంలో ముందుంటారు. కానీ అలాంటి ప్రకాష్ రాజ్ గత కొన్ని నెలలుగా మౌనం పాటిస్తున్నారు. ఆయన గత ఎన్నికల్లో పోటీ చేసి దారుణ ఓటమి కావడమే ఇందుకు కారణమని చెప్పాలి.
ఎన్నికలకు ముందు వరకూ….
2019 ఎన్నికలకు ముందు వరకూ ప్రకాష్ రాజ్ సినిమాలతో పాటు రాజీకీయాల్లోనూ యాక్టివ్ గా ఉండేవారు. మోదీకి వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయడానికి ముందుకు రావాలని ఆయన ఆకాంక్షించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో నూ ప్రకాష్ రాజ్ భేటీ అయి దేశ పరిస్థితులపై చర్చించారు. కేసీఆర్ కర్ణాటక వచ్చి దేవెగౌడను కలుసుకున్నప్పుడు కూడా ప్రకాష్ రాజ్ ఆయన వెంటే ఉన్నారు. దీంతో ప్రకాష్ రాజ్ కన్నడ రాజకీయాల్లో యాక్టివ్ అవుతారని అందరూ భావించారు.
ఇప్పుడు తన పని తానే….
పార్లమెంటు ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయిన తర్వాత ప్రకాష్ రాజ్ లో చాలా మార్పు కన్పిస్తుందంటున్నారు. అప్పటి నుంచి ఆయన కేంద్ర ప్రభుత్వ విధానాలపై పెద్దగా స్పందించింది లేదు. తన సినిమాలకే ప్రకాష్ రాజ్ పరిమితమయ్యారు. ప్రధానంగా జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్య జరిగినప్పుడు ఆయన జాతీయ ఛానల్స్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. కానీ రాజకీయాలు తనకు అచ్చిరావని ఆయన గుర్తించినట్లుంది. అందుకే వాటికి దూరంగా ఉంటున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మోదీకి వ్యతిరేకంగా బలంగా విన్పించే ఒక వాయిస్ ఇప్పుడు మూగబోవడం కన్నడనాట చర్చనీయాంశమైంది.