అఖిల ప్రియ వ్యూహంతో ఆ యువనేత ఉక్కిరి బిక్కిరి
రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. నిన్న మన అనుకున్నవారే రేపు విభేదాలు పెట్టుకుని దూరం కావొచ్చు. నిన్నటి వరకు నువ్వు ఇంద్రుడువి.. చంద్రుడివి.. అన్న నోళ్లే రేపు [more]
రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. నిన్న మన అనుకున్నవారే రేపు విభేదాలు పెట్టుకుని దూరం కావొచ్చు. నిన్నటి వరకు నువ్వు ఇంద్రుడువి.. చంద్రుడివి.. అన్న నోళ్లే రేపు [more]
రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. నిన్న మన అనుకున్నవారే రేపు విభేదాలు పెట్టుకుని దూరం కావొచ్చు. నిన్నటి వరకు నువ్వు ఇంద్రుడువి.. చంద్రుడివి.. అన్న నోళ్లే రేపు విమర్శల బాణాలు సంధించొచ్చు. పాలిటిక్స్ అంటేనే అంత! ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే.. భూమా కుటుంబంలో వెల్లువెత్తుతున్నాయని భావిస్తున్న విభేదాల జడిలో ఓ యువ నేత తీవ్ర ఇరకాటంలో చిక్కుకుపోవడమే!విషయంలోకి వెళ్తే.. కర్నూలు జిల్లాలోని నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో భూమా కుటుంబం జోరు పెరిగింది.
కరోనా సమయంలో….
నిజానికి గత ఎన్నికల్లో ఈ కుటుంబం భారీగా ఓడిపోయినా.. ఇప్పుడు మాత్రం మళ్లీ పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ఈ కుటుంబంలో భూమా అఖిల ప్రియారెడ్డి చక్రం తిప్పారు. చంద్రబాబు హయాంలో ఆమె మంత్రిగా కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే 2017లో నాగిరెడ్డి మరణంతో జరిగిన నంద్యాల ఉప పోరులో తన అన్న కుమారుడు భూమా బ్రహ్మానందరెడ్డిని రంగంలోకి దింపారు. ఈ క్రమంలో భూమా అఖిల ప్రియ పట్టుబట్టి బ్రహ్మానందరెడ్డికి టికెట్ ఇప్పించుకున్నారు. ఆయన గెలుపు కోసం చేయని ప్రయత్నం లేదు.
ఓడిన నాటి నుంచి….
ఉప పోరు గెలిచారు. గత ఏడాది ఎన్నికల్లోనూ పట్టుబట్టి బ్రహ్మానందరెడ్డి టికెట్ సంపాయించుకున్నారు. అయితే వైసీపీ తుఫాన్లో ఆయన ఓడిపోయారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఇటీవల కాలంలో మాత్రం బ్రహ్మానందరెడ్డి ఎక్కడా కనిపించడం లేదు. ఏమిటా అని ఆరాతీస్తే.. దీనివెనుక అఖిల ప్లానింగ్ వేరే ఉందని అంటున్నారు కర్నూలు పొలిటికల్ పండితులు. అప్పట్లో వయసు చాలకపోవడంతోతన సోదరుడు జగద్విఖ్యాత్‌రెడ్డిని ఉప పోరుకు దూరం పెట్టిన అఖిల ప్రియ.. వచ్చే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచే జగ్గీని తయారు చేస్తున్నారట.
నైస్ గా తప్పించేసి….
ఈ క్రమంలో తమకు అడ్డుగా వస్తారని భావిస్తున్న సోదరుడు భూమా బ్రహ్మానందరెడ్డిని నైస్‌గా తప్పించేశారట. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో తాను, నంద్యాలలో జగ్గీలు రాజకీయం చేస్తున్నారు. టీడీపీ తరఫున ఏ ప్రకటన చేయాలన్నా కూడా నంద్యాలలో జగ్గీనే బయటకు వస్తున్నారు. మీడియా మీటింగ్ పెట్టాలన్నా.. వైసీపీ నేతలను విమర్శించాలన్నా కూడా జగ్గీనే వాలిపోతున్నారు. బ్రహ్మానంద రెడ్డి చుట్టూ నిన్న మొన్నటి వరకు తిరిగిన అనుచరులు కూడా ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. మొత్తానికి వాడుకుని వదిలేశారంటూ.. ఆయన తన కున్న కొద్దిపాటి అనుచరుల వద్ద వాపోతున్నారట. సో.. ఇదీ ఇప్పుడు అఖిల ప్రియ తిప్పుతున్న రాజకీయ చక్రం..!