ఇంతకీ ఈమెను ఏ కోటాలో వేయాలి… ?
విశాఖలో అత్యంత ప్రతిష్టాత్మకమైన వీఎమ్మార్డీయే చైర్ పర్సన్ పదవి ఉంది. ఇది ఏకంగా అయిదు జిల్లాలకు విస్తరించిన పదవి. క్యాబినేట్ ర్యాంక్ హోదా కలిగిన ఈ పదవిని [more]
విశాఖలో అత్యంత ప్రతిష్టాత్మకమైన వీఎమ్మార్డీయే చైర్ పర్సన్ పదవి ఉంది. ఇది ఏకంగా అయిదు జిల్లాలకు విస్తరించిన పదవి. క్యాబినేట్ ర్యాంక్ హోదా కలిగిన ఈ పదవిని [more]
విశాఖలో అత్యంత ప్రతిష్టాత్మకమైన వీఎమ్మార్డీయే చైర్ పర్సన్ పదవి ఉంది. ఇది ఏకంగా అయిదు జిల్లాలకు విస్తరించిన పదవి. క్యాబినేట్ ర్యాంక్ హోదా కలిగిన ఈ పదవిని జగన్ విశాఖ తూర్పు నియోజకవర్గం ఇంచార్జిగా ఉన్న అక్రమాని విజయనిర్మలకు ఇచ్చారు. ఆమెకు ఈ పదవి దక్కడం అంటే జాక్ పాట్ కిందనే లెక్క. విశాఖ ఏపీలోనే మెగా సిటీ. అటువంటి సిటీ మాస్టర్ ప్లాన్ డిజైన్ చేయడంతో కీలకమైన పాత్ర పోషించే వీఎమ్మార్డీయే చైర్ పర్సన్ అంటే ఆషామాషీ పదవి కాదని కూడా చెబుతున్నారు. చిత్రమేంటి అంటే ఎందరో మహామహులు ఈ పదవి కోసం గట్టిగానే ప్రయత్నాలు చేశారు కానీ చివరికి జగన్ అక్రమాని విజయనిర్మలకు ఈ కీలకమైన పదవిని అప్పగించారు.
రెండు కులాలకు…?
బీసీలకు ఈ పదవిని ఇచ్చామని వైసీపీ ఆర్భాటంగా చెప్పుకుంటోంది. విశాఖలో ఉన్న యాదవ సామాజికవర్గం కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో బ్రాహ్మణ సామాజికవర్గం నేతలు కూడా జగన్ తమ కులానికి సముచితమైన న్యాయం చేశారని అంటున్నారు. గతంలో ఈ పదవిని బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన ద్రోణంరాజు శ్రీనివాస్ కి ఇచ్చారు. ఇపుడు కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ జగన్ అక్రమాని విజయనిర్మలకు ఇచ్చారని వారు కొనియాడుతున్నారు. మరి ఒకే మహిళ రెండు సామాజిక వర్గాలకు ఎలా ప్రాతినిధ్యం వహిస్తుంది అంటే ఇక్కడే ఉంది కిటుకు అంటున్నారు.
బ్రాహ్మణ కోటాలో…?
అక్రమాని విజయనిర్మల బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారు. ఆమె యాదవ సామాజిక వర్గానికి చెందిన అక్రమాని వారి ఇంటి కోడలు అయ్యారు. అలా ఆమె యాదవ సామాజిక వర్గానికి చెందిన ఇంటి కోడలిగా ఉన్నారు. అయితే రెండేళ్ల క్రితం విశాఖ తూర్పు ఎమ్మెల్యే సీటుని అక్రమాని విజయనిర్మలకు ఇచ్చినపుడు ఆమెను బ్రాహ్మణ కోటాలోనే ఎంపిక చేశామని అధినాయకత్వం చెప్పుకుంది. అలాగే బ్రాహ్మణ నాయకులు కూడా ప్రచారం కూడా చేశారు. ఏపీలో బ్రాహ్మణులకు నాలుగు సీట్లు జగన్ ఇచ్చారూ అంటూ అక్రమాని విజయనిర్మల టికెట్ ని కూడా అందులో కలిపేశారు. ఇపుడు నామినేటెడ్ పోస్టు దగ్గరకు వచ్చేసరికి బీసీలకు న్యాయం చేశామని వైసీపీ పెద్ద నాయకులు అంటున్నారు.
ప్లస్సా… మైనస్సా?
మరి ఈ విషయంలో నిజంగా చూస్తే కనుక అక్రమాని విజయనిర్మల బ్రాహ్మిన్ అనే అంటున్నారు. బీసీల కోటాలో ఈ సమున్నత పదవిని ఇవ్వలేదని కూడా సొంత పార్టీలోనూ బయటా కూడా విమర్శలు ఉన్నాయి. మొత్తానికి చూసుకుంటే అక్రమాని విజయనిర్మల రెండు సామాజికవర్గాలకు ప్రాతినిధ్యం వహించడం వల్ల పార్టీకి ప్లస్ నా మైనస్ నా అన్నదే నేతలకు అర్ధం కావడం లేదుట. ప్లస్ కనుక అయి ఉంటే బ్రాహ్మణులు, యాదవులు ఎక్కువగా ఉన్న విశాఖ తూర్పులో అక్రమాని విజయనిర్మల తప్పకుండా ఎమ్మెల్యేగా నాడే గెలిచేవారు కదా అన్న మాట కూడా ఉంది. మొత్తానికి ఒకందుకు జగన్ ఈ పదవి ఇస్తే మరొకందుకు అన్నట్లుగా ఆయా సామాజిక వర్గ నేతలు ఎవరికి తోచిన రీతిన వారు ప్రచారాన్ని చేస్తున్నారు అంటున్నారు.