వైసిపి లోకే ఆయన ఎందుకంటే …?
రాజమహేంద్రవరం మాజీ ఎమ్యెల్యే ఆకుల సత్యనారాయణ జనసేన కు గుడ్ బై కొట్టిన తరువాత ఎటు వెళతారన్న చర్చ ఆసక్తి రేకెత్తించింది. బిజెపి ఎమ్యెల్యే గా గెలిచిన [more]
రాజమహేంద్రవరం మాజీ ఎమ్యెల్యే ఆకుల సత్యనారాయణ జనసేన కు గుడ్ బై కొట్టిన తరువాత ఎటు వెళతారన్న చర్చ ఆసక్తి రేకెత్తించింది. బిజెపి ఎమ్యెల్యే గా గెలిచిన [more]
రాజమహేంద్రవరం మాజీ ఎమ్యెల్యే ఆకుల సత్యనారాయణ జనసేన కు గుడ్ బై కొట్టిన తరువాత ఎటు వెళతారన్న చర్చ ఆసక్తి రేకెత్తించింది. బిజెపి ఎమ్యెల్యే గా గెలిచిన తరువాత ఆయన సకుటుంబ సమేతంగా ఎన్నికల ముందు జనసేన తీర్ధం పుచ్చుకున్నారు. రాజమండ్రి పార్లమెంట్ స్థానానికి పవన్ పార్టీ నుంచి ఆకుల సత్యనారాయణ పోటీ చేశారు. జనసేన టికెట్ల పంపిణీ అయిన వెంటనే ఆయన అంతర్గతంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్ధికంగా బలమైన ఆకుల సత్యనారాయణ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల అభ్యర్థులకు సరైన సహకారం అందించలేదని ఆరోపణలు వినిపించాయి. ఆ తరువాత ఎక్కువగా ఆయన ఏక్ నిరంజన్ గానే ఎన్నికల ప్రచారం సాగింది. అప్పుడే ఆయన పార్టీ నుంచి త్వరలోనే బయటకు రావడం ఖాయమనే అంతా భావించారు.
బిజెపి లోకి వెళదామని అనుకున్నా….
ఆకుల సత్యనారాయణకు ఇప్పుడు రెండే అవకాశాలు వున్నాయి. ఒకటి కేంద్రంలోని బిజెపి రెండు రాష్ట్రం లో అధికారంలో వున్న వైసిపి. వీటిలో ఆయన వైసిపి నే ఫైనల్ గా ఎంచుకున్నారు. ఆపరేషన్ ఆకర్ష్ లో ఇప్పటికే బిజెపి ఏపిలో దూసుకుపోతుంది. పార్టీ నుంచి వెళ్లిపోయిన వారిని ఇతర పార్టీల నేతలకు మంచి ఆఫర్ లతో వెల్కమ్ చెబుతుంది. ప్రస్తుత ఎపి బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తో ఆయనకు మంచి సంబంధాలే వున్నాయి. అయితే పార్టీ ఎన్నికల కన్వీనర్ ఎమ్యెల్సీ సోము వీర్రాజు ఆకుల సత్యనారాయణ రాజకీయ ఎదుగుదలకు అడ్డుగోడగా వున్నారు. ఎమ్యెల్యే గా వున్నప్పుడు కూడా ఇద్దరిమధ్య నిప్పు ఉప్పులా ఉండేది పరిస్థితి. ఇద్దరిది ఒకే సామాజిక వర్గం నేపథ్యం తో ఆకుల సత్యనారాయణ, సోము వీర్రాజుల నడుమ పొలిటికల్ వార్ కొనసాగేది. ఈ నేపథ్యంలో బిజెపి లో చేరాలన్న విషయంలో డాక్టర్ ఆకుల సత్యనారాయణ ఆచితూచి నిర్ణయం తీసుకున్నారు.
వైసిపి లోకి …
రాజకీయాల్లో పెద్దగా అనుభవం లేకపోయినా తక్కువ టైం లో ఎమ్యెల్యే టికెట్ తెచ్చుకోవడం గెలవడం కూడా పూర్తి చేసిన డాక్టర్ ఆకుల సత్యనారాయణ వైసిపి లోకి అడుగుపెట్టడమే బెటర్ గా భావించారు. దీనికి సంబంధించి తన నిర్ణయం సస్పెన్స్ లోనే పెట్టారు. చివరికి శుభదినం కావడంతో విజయదశమి ని ముహూర్తంగా పెట్టుకుని జగన్ సమక్షంలో చేరేందుకు డిసైడ్ అయిపోయారు. రాజమండ్రి లో ప్రస్తుతం మొన్నటి ఎన్నికల్లో వైసిపి బలహీనంగా వుంది. ఇక్కడ ఆదిరెడ్డి కుటుంబం, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గన్ని కృష్ణ వంటివారు స్ట్రాంగ్ గా పార్టీ అభివృద్ధిలో భాగమయ్యారు. దాంతో వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లోగా వైసిపి ని పూర్తిగా బలోపేతం చేసే వ్యూహాలు అమల్లో పెట్టారు అధినేత జగన్. అందుకే జనసేన మాజీ నేతకు వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని తెలుస్తుంది.