ఈ వైసీపీ నేత వివాదం రోజురోజుకూ ముదురుతోందే?
రాజమండ్రి వైసిపి లో కో ఆర్డినేటర్ ల మార్పు తో అంతా సర్దుబాటు అవుతుందనే అధిష్టానం భావించింది. గ్రూప్ ల గోలతో మోతెక్కిపోతున్న పార్టీలో అంతా ఒకే [more]
రాజమండ్రి వైసిపి లో కో ఆర్డినేటర్ ల మార్పు తో అంతా సర్దుబాటు అవుతుందనే అధిష్టానం భావించింది. గ్రూప్ ల గోలతో మోతెక్కిపోతున్న పార్టీలో అంతా ఒకే [more]
రాజమండ్రి వైసిపి లో కో ఆర్డినేటర్ ల మార్పు తో అంతా సర్దుబాటు అవుతుందనే అధిష్టానం భావించింది. గ్రూప్ ల గోలతో మోతెక్కిపోతున్న పార్టీలో అంతా ఒకే గ్రూప్ గా ఉండాలన్న సంకేతాలు ఇవ్వడం కోసం ఎంపి భరత్ రామ్ ఎంపిక చేసిన వారికే టిక్ పెట్టారు. ఉభయగోదావరి జిల్లాల పార్టీ ఇన్ ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి. అయితే దీంతో వ్యవహారం సెట్ అవుతుందన్న నేపథ్యంలో రాజమండ్రి అర్బన్ ఇన్ ఛార్జ్ డా ఆకుల సత్యనారాయణ నిర్ణయాలు కొత్త తలనొప్పులకు తెరతీస్తున్నాయన్న విమర్శలు మొదలు అయ్యాయి.
మహిళా నేతల కట్టు బొట్టు తో మొదలై …
పార్టీ లో ఉండే మహిళా నేతల కట్టు బొట్టు ఎలా ఉండాలో మొదట్లో డా . ఆకుల సత్యనారాయణ కొందరికి క్లాస్ పీకారు. ఆ తరువాత దీనిపై వివాదం తలెత్తడం ఫేస్ బుక్ లో ఒక మహిళా నేత డా. ఆకుల పై ఘాటుగా స్పందించారు. వెంటనే ఆకుల సత్యనారాయణ ఆగ్రహం తో క్రమశిక్షణ తప్పితే ఉపేక్షించనంటూ సదరు నేతను ఆయన పార్టీ నుంచి బహిష్కరించడం చక చకా జరిగిపోయాయి. కట్ చేస్తే అధిష్టానం దృష్టికి ఈ వ్యవహారం వెళ్ళడం వారి సూచనలతో తిరిగి ఆ మహిళను పార్టీలోకి చేర్చుకోవాలిసి వచ్చింది డా ఆకుల సత్యనారాయణ.
మీడియా పై విరుచుకుపడి …
ఆకుల సత్యనారాయణ భార్య పద్మావతి వైసిపి తరపున మేయర్ అభ్యర్థి కాబోతున్నారంటూ స్థానిక పత్రికల్లో కొన్ని వార్తలు వచ్చాయి. దీనిపై సదరు పత్రికలతో మాట్లాడాలిసిన ఆయన మీడియా సమావేశం పెట్టి పాత్రికేయులకు కుటుంబాలు ఉన్నాయంటూ జాగ్రత్త అంటూ, కొన్ని ఛానెల్స్ యాజమాన్యాలను లెక్క చేయనంటూ విరుచుకుపడ్డారు. వ్యాఖ్యానించి సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ట్రోల్స్ కి గురయ్యారు. ఆ తరువాత ఆకుల సత్యనారాయణ పోలీస్ అధికారులను పిలిపించుకుని పార్టీ ఆఫీస్ లో చర్చించడం కూడా విమర్శలకు తెరతీసింది.
కాపు హ్యాపీ క్రెడిట్ మరో వివాదం …
కులానికో కార్పొరేషన్ పెట్టి ముఖ్యమంత్రి జగన్ ఆయా కులాల్లో పేదలకు సాయం అందించే స్కీమ్స్ తెచ్చారు. అయితే డా. ఆకుల సత్యనారాయణ కాపు హ్యాపీ క్రెడిట్ పేరుతో ఒక సంస్థను నెలకొల్పి పేద కాపులకు తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వడానికి సంకల్పించారు. ఈ కార్యక్రమంలో పక్క నియోజకవర్గంలో ఉన్న రాజానగరం ఎమ్యెల్యే రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా ను ఆహ్వానించకపోవడం చర్చనీయం అయ్యింది. అదీగాక కాపు జర్నలిస్ట్ లనే ప్రత్యేకంగా ఆహ్వానించారన్న విమర్శలను ఆకుల సత్యనారాయణ మూటగట్టుకున్నారు. జగన్ ఏర్పాటు చేసిన కాపు కార్పొరేషన్ క్రీయాశీలకం గా లేకపోవడం వల్లే డా. ఆకుల తన సొంత కార్యక్రమం చేపట్టారా అన్న వివాదాన్ని కొందరు లేవనెత్తుతున్నారు. పార్టీ కార్యక్రమాలు ప్రచారం చేయడం వదిలి సొంత జండా అజెండాలను తెరపైకి తెస్తే ఆకుల సత్యనారాయణకు మరిన్ని చిక్కులు తప్పవని ఫ్యాన్ పార్టీలో జోరుగా వినవస్తుంది.