ఆళగిరి సరైన సమయంలో?
ఎన్నికలు దగ్గరపడే కొద్దీ తమిళనాడు రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఎవరు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థిితి. కుటుంబ బంధాలు సయితం తెంచేసుకుని అధికారం వైపు పరుగులు [more]
ఎన్నికలు దగ్గరపడే కొద్దీ తమిళనాడు రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఎవరు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థిితి. కుటుంబ బంధాలు సయితం తెంచేసుకుని అధికారం వైపు పరుగులు [more]
ఎన్నికలు దగ్గరపడే కొద్దీ తమిళనాడు రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఎవరు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థిితి. కుటుంబ బంధాలు సయితం తెంచేసుకుని అధికారం వైపు పరుగులు తీయడం రాజకీయ నేతల్లో చూస్తూనే ఉంటా. ఇప్పుడు తమిళనాడులో కూడా జంపింగ్ జపాంగ్ లకు కొదవలేదు. డీఎంకే అధినేత కరుణానిధి మరణంతో ఆయన చిన్న కుమారుడు స్టాలిన్ పార్టీ పగ్గాలు అందుకున్నారు. పెద్దాయన మరణం తర్వాత జరిగిన ఎన్నికల్లో డీఎంకేను స్టాలిన్ విజయపథాన నిలిపారు.
వచ్చే ఏడాది జరగనున్న…..
అయితే 2021లో జరిగే శాసనసభ ఎన్నికలు స్టాలిన్ కు సవాల్ గా మారనున్నాయి. డీఎంకే బలంగా ఉన్నప్పటికీ రజనీకాంత్ కొత్త పార్టీ వస్తుండటంతో రిజల్ట్ ఎలా వస్తుందో చెప్పలేని పరిస్థితి. ఇందుకోసమే స్టాలిన్ సక్సెస్ ఫుల్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను నియమించుకున్నారు. ప్రశాంత్ కిషోర్ వ్యూహంతో సుదీర్ఘకాలం తర్వాత పార్టీని అధికారంలోకి తేవాలని స్టాలిన్ భావిస్తున్నారు. అయితే ఆయన కుటుంబ సభ్యుల నుంచే ఎన్నికల ముందు వ్యతిరేకత వచ్చే అవకాశముంది.
మౌనంగా ఉంటూ….
కరుణానిధి పెద్ద కుమారుడు ఆళగిరి గత కొంతకాలంగా మౌనంగా ఉంటున్నారు. కరుణానిధి మరణం తర్వాత పార్టీలోకి రావాలని ప్రయత్నించిన ఆళగిరికి స్టాలిన్ రెడ్ సిగ్నల్ వేశారు. కుటుంబ సభ్యులు నచ్చచెప్పినా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని స్టాలిన్ ఆళగిరిని పార్టీలోకి తీసుకోలేదు. దీంతో ఆళగిరి కూడా ఏ పార్టీలో చేరకుండా కొంతకాలంగా మౌనంగా ఉంటున్నారు. పార్లమెంటు ఎన్నికలకు ముందు ఆళగిరి బీజేపీలో చేరతారన్న ప్రచారం జరిగినా ఆయన ఇంటికే పరిమితమయ్యారు. రాజకీయాల వైపు చూడలేదు.
రజనీ పార్టీ వైపు….
కాని ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఆళగిరి సయితం తాను, తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం యాక్టివ్ కావాలని చూస్తున్నారు. తండ్రి కరుణానిధి పార్టీ డీఎంకేలో చేరే ఛాన్స్ లేకపోవడంతో ఆయన ఇప్పుడు రజనీకాంత్ వైపు చూస్తున్నారు. రజనీకాంత్ త్వరలోనే పార్టీ పెట్టబోతున్నారు. ఆయన తొలి సభ మధురై ప్రాంతంలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సభ ఏర్పాట్లు మొత్తం ఆళగిరి చూస్తారని తెలుస్తోంది. మధురై ప్రాంతంలో పట్టున్న ఆళగిరి మద్దతును రజనీకాంత్ కూడా ఆశిస్తుండటంతో ఆళగిరి రజనీ పార్టీలోకి వెళతారన్నది ఖాయంగా కన్పిస్తుంది. మరోవైపు డీఎంకే లోని కొందరు ముఖ్యనేతలు కూడా ఆళగిరితో టచ్ లోకి వెళ్లారని చెబుతున్నారు. మొత్తం మీద తమిళనాట మళ్లీ ఆళగిరి అలజడి మొదలయిందనే చెప్పాలి.