ఆళగిరి ఊరుకునేట్లు లేడే
పెద్ద కొడుకుకు సహజంగా వారసత్వం లభిస్తుంది. కానీ ఆళగిరి విషయంలో అలా జరగలేదు. రాజకీయ వారసత్వం కరుణానిధి చిన్న కుమారుడు అందిపుచ్చుకున్నారు. తండ్రి కరుణానిధి తమిళనాట విస్తృతం [more]
పెద్ద కొడుకుకు సహజంగా వారసత్వం లభిస్తుంది. కానీ ఆళగిరి విషయంలో అలా జరగలేదు. రాజకీయ వారసత్వం కరుణానిధి చిన్న కుమారుడు అందిపుచ్చుకున్నారు. తండ్రి కరుణానిధి తమిళనాట విస్తృతం [more]
పెద్ద కొడుకుకు సహజంగా వారసత్వం లభిస్తుంది. కానీ ఆళగిరి విషయంలో అలా జరగలేదు. రాజకీయ వారసత్వం కరుణానిధి చిన్న కుమారుడు అందిపుచ్చుకున్నారు. తండ్రి కరుణానిధి తమిళనాట విస్తృతం చేసిన డీఎంకేను సయితం స్టాలిన్ చేజిక్కించుకున్నారు. తండ్రి కరుణానిధి బతికి ఉన్నప్పుడే ఆళగిరి డీఎంకేకు దూరమయ్యారు. కరుణానిధి స్వయంగా పార్టీ నుంచి ఆళగిరిని సస్పెండ్ చేయడంతో ఏమీ చేయలేకపోయారు. అయితే కరుణానిధి మరణం తర్వాత కూడా ఆళగిరికి డీఎంకే లోకి వచ్చేందుకు స్టాలిన్ ద్వారాలు మూసివేశారు.
కొంతకాలంగా మౌనంగా….
అయితే ఆళగిరి గత కొంతకాలంగా రాజకీయంగా మౌనంగా ఉంటున్నారు. ఆయన రజనీకాంత్ పార్టీలో చేరతారని, కమలం పార్టీ కండువా కప్పుకుంటారని ఇప్పటి వరకూ పుకార్లు షికార్లు చేశాయి. అయితే ఆళగిరి ఆలోచన వేరే విధంగా ఉందంటున్నారు. తన సోదరుడు స్టాలిన్ పై కసితో రగిలిపోతున్న ఆళగిరి ప్రతీకారాన్ని తీర్చుకోవాలనుకుంటున్నట్లే కనపడుతుంది. బంధుమిత్రులతో తాను డీఎంకేలో తిరిగి చేరడానికి చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆళగిరి సొంత పార్టీ పెట్టేందుకు మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
సొంత పార్టీ…..
2021లో తమిళనాడు శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవల జరిగిన లోక్ సభ, ఉప ఎన్నికల్లో విజయంతో స్టాలిన్ మంచి ఊపు మీద ఉన్నారు. ప్రశాంత్ కిషోర్ ను కూడా వ్యూహకర్తగా నియమించుకుని విజయం సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు. అయితే స్టాలిన్ విజయాన్ని దెబ్బతీసేందుకు ఆళగిరి సొంత పార్టీ పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు ఆళగిరి పుట్టిన రోజు సందర్భంగా పార్టీ పేరుతో కూడా వాల్ పోస్టర్లు వెలిశాయి.
డీఎంకేను దెబ్బకొట్టడానికే…..
వచ్చే శాసనసభ ఎన్నికల్లో డీఎంకే ను దెబ్బతీసి తానేంటో రుజువు చేసుకోవాలంటే సొంతంగా పార్టీ పెట్టాలని ఆళగిరి డిసైడ్ అయ్యారు. కలైజ్ఞర్ డీఎంకే పేరుతో వెలిసిన పోస్టర్లు ఇప్పుడు తమిళనాట సంచలనం సృష్టిస్తున్నాయి. సొంత పార్టీ పెట్టి డీఎంకేను, స్టాలిన్ ను అధికారంలోకి రాకుండా చూడటమే ఆళగిరి లక్ష్యంగా కన్పిస్తుంది. మధురై ప్రాంతంలో మంచి పట్టున్న ఆళగిరి కొత్త పార్టీ పెడితే అది ఖచ్చితంగా డీఎంకే విజయావకాశాలను దెబ్బతీస్తుందన్నది విశ్లేషకుల అంచనా. అయితే ఆళగిరిపై కదలికలపై దృష్టి సారించిన స్టాలిన్ సోదరుడిని తిరిగి అక్కున చేర్చుకుంటారా? అన్న చర్చ కూడా జరుగుతోంది.