ఆళగిరిని ప్రయోగిస్తున్నారుగా?
తమిళనాడు ఎన్నికలు సమీపించే కొద్దీ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికలకు ముందే కొత్త పార్టీలు పుట్టుకొచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. రజనీకాంత్ పార్టీ కోసం అందరూ ఉత్కంఠగా వెయిట్ [more]
తమిళనాడు ఎన్నికలు సమీపించే కొద్దీ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికలకు ముందే కొత్త పార్టీలు పుట్టుకొచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. రజనీకాంత్ పార్టీ కోసం అందరూ ఉత్కంఠగా వెయిట్ [more]
తమిళనాడు ఎన్నికలు సమీపించే కొద్దీ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికలకు ముందే కొత్త పార్టీలు పుట్టుకొచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. రజనీకాంత్ పార్టీ కోసం అందరూ ఉత్కంఠగా వెయిట్ చేస్తున్నారు. అదే సమయంలో కరుణానిధి కుమారుడు ఆళగిరి పార్టీ పెడతానని ప్రకటించడం సంచలనంగా మారింది. త్వరలోనే తాను కొత్త పార్టీ ప్రకటిస్తానని ఆళగిరి స్వయంగా ప్రకటించడంతో సందిగ్దత వీడింది.
ఎవరి చెంతకు చేరకుండా…..
ఇప్పటి వరకూ ఆళగిరి బీజేపీ కూటమిలో చేరతారని ప్రచారం జరిగింది. అమిత్ షా చెన్నై వచ్చినప్పుడు ఆయనతో సమావేశం అవుతారని భావించారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. అలాగే రజనీకాంత్ పార్టీ పెడితే ఆళగిరి అందులోకి వెళతారన్న ప్రచారం కూడా బాగానే జరిగింది. కానీ ఆళగిరి మాత్రం తాను సొంతంగా పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. ఆళగిరి వల్ల ఎవరికి నష్టమన్న చర్చ తమిళనాడు వ్యాప్తంగా జరుగుతోంది.
కొత్త పార్టీ వెనక?
అయితే ఆళగిరి కొత్త పార్టీ వెనక అమిత్ షా ఉన్నారన్న ప్రచారం జరుగుతుంది. ఆళగిరి బీజేపీతో కలవడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని, విడిగా పార్టీ పెడితేనే తమకు లాభమని అమిత్ షా అంచనా వేశారు. ఆయన ఇటీవల చెన్నై వచ్చినప్పుడు కూడా ఆళగిరి గురించి పార్టీ నేతలతో చర్చించినట్లు తెలుస్తోంది. అందుకే అమిత్ షా ఆళగిరికి వర్తమానం పంపారని చెబుతున్నారు. ఆళగిరి కొత్త పార్టీతో అధికారంలోకి రావాలనుకుంటున్న డీఎంకే నష్టమన్న అంచనాలో బీజేపీ ఉంది.
డీఎంకే పై అసంతృప్తి నేతలు…..
ఆళగిరి వల్ల నిజానికి డీఎంకే కే నష్టం. కరుణానిధి కుమారుడిగా మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఇమేజ్ ఉన్న నేత. అంతేకాదు డీఎంకేలో స్టాలిన్ ను వ్యతిరేకించే వారంతా ఆళగిరి పార్టీలో చేరే అవకాశముంది. దీంతోపాటు టిక్కెట్ దక్కని నేతలతో పాటు ముఖ్యమైన నేతలు కూడా ఆళగిరి చెంతకు చేరే అవకాశముంది. మొత్తం మీద అమిత్ షా సూచన మేరకే ఆళగిరి కొత్త పార్టీ పెడుతున్నారని మాత్రం టాక్ బలంగా విన్పిస్తుంది. డీఎంకేను నిలువరించడానికే ఆళగిరిని రంగంలోకి అమిత్ షాయే స్వయంగా దించారని చెబుతున్నారు.