బీహార్ తరహా ప్లాన్ అట…వర్క్ అవుట్ అవుతుందా?
మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుమారుడు ఆళగిరి కొత్తపార్టీ పెట్టే అవకాశాలు కన్పించడం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త పార్టీ పెట్టి నెగ్గుకు రాలేమని ఆళగిరి భావిస్తున్నారు. బీహార్ [more]
మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుమారుడు ఆళగిరి కొత్తపార్టీ పెట్టే అవకాశాలు కన్పించడం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త పార్టీ పెట్టి నెగ్గుకు రాలేమని ఆళగిరి భావిస్తున్నారు. బీహార్ [more]
మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుమారుడు ఆళగిరి కొత్తపార్టీ పెట్టే అవకాశాలు కన్పించడం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త పార్టీ పెట్టి నెగ్గుకు రాలేమని ఆళగిరి భావిస్తున్నారు. బీహార్ లో చిరాగ్ పాశ్వాన్ తరహాలో పోటీకి దిగాలని యోచిస్తున్నారు. పార్టీ పెట్టకపోయినా ఆళగిరి మద్దతుదారులు కేవలం డీఎంకే బరిలో ఉన్న స్థానాల్లో పోటీ చేసే అవకాశముందని చెబుతున్నారు. దీంతోనే డీఎంకే ను అధికారంలోకి రాకుండా అడ్డుకోవచ్చన్నది ఆళగిరి ఆలోచనగా ఉందని అంటున్నారు.
డీఎంకేలో చేరాలన్నా…..
ఆళగిరి డీఎంకే నుంచి బహిష్కరించి ఆరేళ్లు గడుస్తుంది. కరుణానిధి మరణం తర్వాత ఆళగిరి డీఎంకేలోకి రావాలనుకున్నా స్టాలిన్ అంగీకరించలేదు. పార్టీలో ఏ పదవి ఇచ్చేందుకు సుముఖత చూపలేదు. కుటుంబ సభ్యులు స్టాలిన్ పై వత్తిడి తెచ్చినప్పటికీ ఆయన అంగీకరించలేదు. ఆళగిరిని నమ్మి చేర్చుకోవడం వృధా అని స్టాలిన్ భావించారు. అందుకే సీనియర్ నేతలు, కుటుంబ సభ్యుల స్టాలిన్ పై వత్తిడి తెచ్చినా ఆళగిరి విషయంలో గట్టిగానే ఉన్నారు.
పట్టున్న ప్రాంతంలో…..
తమిళనాడు దక్షిణ ప్రాంతంలో ఆళగిరికి పట్టుంది. ముఖ్యంగా మధురై ప్రాంతంలో ఆయన గెలుపుపై ప్రభావం చూపుతారు. సొంతంగా పార్టీ పెట్టాలని భావించినా ఇంత తక్కువ సమయంలో సాధ్యం కాదని ఆళగిరి భావిస్తున్నారు. రజనీకాంత్ పార్టీ పెడితే అందులో తన పార్టీని భాగస్వామి చేయాలనుకున్నారు. మరోవైపు బీజేపీ నుంచి వత్తిడి వస్తుంది. అన్నాడీఎంకే కూటమికి మద్దతివ్వాల్సిందిగా ఆళగిరిని పదే పదే కోరుతున్నారు.
డీఎంకే పోటీ చేసే చోటనే….
ఈ నేపథ్యంలో ఆళగిరి సొంత పార్టీ పెట్టి కేవలం డీఎంకే అభ్యర్థులు బరిలో ఉన్న చోటే పోటీ చేయాలని భావిస్తున్నారు. డీఎంకే కొన్ని స్థానాల్లోనే పోట ీచేస్తుంది. అక్కడ మాత్రమే ఆళగిరి పార్టీ అభ్యర్థులను బరిలోకి దించేలా ప్లాన్ చేస్తున్నారు. దీని వెనక బీజేపీ వ్యూహం ఉందంటున్నారు. బీహార్ లో చిరాగ్ పాశ్వాన్ ద్వారా ఆర్జేడీ కి చెక్ పెట్టగలిగినట్లే ఇక్కడ కూడా అదే తరహా వ్యూహాలను అమలు చేయాలని నిర్ణయించారని తెలిసింది. మరి ఆళగిరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది.