నాడు కాదనుకున్న ఆలపాటి ఇప్పుడు దిక్కయ్యారా?
ఆయనను చంద్రబాబు ఒకప్పుడు పక్కన పెట్టారు. ఇప్పుడు ఆయనే పార్టీకి దిక్కయ్యారు. ఆయనే గుంటూరు జిల్లాకు చెందిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర [more]
ఆయనను చంద్రబాబు ఒకప్పుడు పక్కన పెట్టారు. ఇప్పుడు ఆయనే పార్టీకి దిక్కయ్యారు. ఆయనే గుంటూరు జిల్లాకు చెందిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర [more]
ఆయనను చంద్రబాబు ఒకప్పుడు పక్కన పెట్టారు. ఇప్పుడు ఆయనే పార్టీకి దిక్కయ్యారు. ఆయనే గుంటూరు జిల్లాకు చెందిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఇప్పుడు గుంటూరు తెలుగుదేశం పార్టీకి పెద్దదిక్కయ్యారు. గుంటూరు జిల్లాలో హేమాహేమీ నేతలున్నా వైసీపీ మీద విమర్శలు చేయకుండా మౌనం వహిస్తున్నారు. ఒక్క ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాత్రమే పార్టీ వాయిస్ ను బలంగా విన్పిస్తున్నారు.
పార్టీ అధ్యక్షుడున్నా…..
గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా జీవీ ఆంజనేయులు ఉన్నారు. కోడెల శివప్రసాద్ ఆశీస్సులతో జీవీ ఆంజనేయులు టీడీపీ అధ్యక్ష్య పదవిని దక్కించుకున్నారు. ఆయన ఐదేళ్లకు పైగానే అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. కోడెల మరణం తర్వాత గాడ్ ఫాదర్ పోవడంతో జీవీ ఒంటరి అయ్యారు. గత కొద్దిరోజులుగా ఆయన పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా లేరు. మరో నేత ప్రత్తిపాటి పుల్లారావు కూడా అనేక కారణాలతో మౌనంగానే ఉన్నారు.
కీలకంగా మారడంతో….
అయితే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాత్రం పార్టీలో కీలకంగా మారారు. క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. రాజధాని అంశం మొదలు అన్ని విషయాల్లోనూ ఆలపాటి అధికార పార్టీకి గట్టి కౌంటర్ ఇస్తున్నారు. దీంతో జిల్లాలోనూ చంద్రబాబు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కే ప్రాధాన్యత ఇస్తున్నారు. 1999లో చంద్రబాబు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు తన మంత్రివర్గంలో చోటు కల్పించారు. రెండున్నరేళ్లు కొనసాగించి తర్వాత కోడెలకు అవకాశమిచ్చారు. అప్పటి నుంచి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను చంద్రబాబు దూరం పెడుతూ వచ్చారు.
బాబు ఇస్తున్న ప్రాధాన్యతతో….
ఒకానొకదశలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు టిక్కెట్ ఇచ్చేందుకు కూడా చంద్రబాబు సుముఖత చూపలేదంటారు. ఇక సీనియర్ నేతలందరూ మౌనంగా ఉండటంతో చంద్రబాబు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక దూళిపాళ్ల నరేంద్ర, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ల మధ్య విభేదాలున్నాయి. ఆలపాటికి పార్టీ ఇస్తున్న ప్రాధాన్యతపై దూళిపాళ్ల కూడా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద గుంటూరు జిల్లాలో హేమాహేమీల వంటి నేతలున్నా నాడు తాను కాదనుకున్న ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఇప్పుడు చంద్రబాబుకు దిక్కయ్యారు. ఆలపాటి ఇప్పడు గుంటూరు జిల్లా టీడీపీికి పెద్దదిక్కుగా మారారనే చెప్పాలి.