ఇక్కడ అందరూ కలిశారు
జార్ఖండ్ ఎన్నికల్లో రాష్ట్రీయ జనతా దళ్ తన సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. బీహార్ లో జరిగిన ఉప ఎన్నికల్లో సత్తా చాటిన ఆర్జేడీ పొరుగు రాష్ట్రంలోనూ తమ [more]
జార్ఖండ్ ఎన్నికల్లో రాష్ట్రీయ జనతా దళ్ తన సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. బీహార్ లో జరిగిన ఉప ఎన్నికల్లో సత్తా చాటిన ఆర్జేడీ పొరుగు రాష్ట్రంలోనూ తమ [more]
జార్ఖండ్ ఎన్నికల్లో రాష్ట్రీయ జనతా దళ్ తన సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. బీహార్ లో జరిగిన ఉప ఎన్నికల్లో సత్తా చాటిన ఆర్జేడీ పొరుగు రాష్ట్రంలోనూ తమ పట్టు నిరూపించుకోవాలని భావిస్తుంది. బీహార్ నుంచి విడిపోయి రాష్ట్రంగా ఏర్పడిన జార్ఖండ్ లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ ప్రాంతీయ పార్టీ జేఎంఎం బలంగా ఉంది. అధికారంలో భారతీయ జనతా పార్టీ ఉంది. ఈ సారి ఎన్నికల్లో బీజేపీని ఎలాగైనా ఓడించాలని విపక్షాలన్నీ కలసి కూటమిగా ఏర్పడ్డాయి.
ఆర్జేడీతో కలుపుకుని….
బీహార్ కు ఆనుకునే ఉన్న జార్ఖంఢ్ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఇప్పటి వరకూ అక్కడ బలంగా ఉన్న జార్ఖండ్ ముక్తి మోర్చా ఈ సారి అవకాశాలను వదులుకోదలచుకోలేదు. అందుకే బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలూ కలసి పోటీ చేయాలని నిర్ణయించాయి. ఇప్పటికే జేఎంఎం ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా ప్రకటించడం విశేషం. జేఎంఎం ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆపార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హేమంత్ సోరెన్ ఎన్నికయ్యారు.
సంఖ్య కూడా తేలింది…..
జార్ఖండ్ రాష్ట్రంలో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలున్నాయి. భారతీయ జనతా పార్టీ దూకుడుకు అడ్డుకట్ట వేయాలంటే కాంగ్రెస్, ఆర్జేడీలను కలుపుకుని వెళ్లాలని జేఎంఎం డిసైడ్ అయింది. ఈ మేరకు ఆ రెండు పార్టీలతో చర్చలు జరిపింది. చర్చలు ఫలవంతమయ్యాయి. అధికారంలోకి రావాలంటే 41 స్థానాలు దక్కాల్సి ఉంటుంది. ఈ పార్టీల ఒప్పందం ప్రకారం జేఎంఎ: 43 స్థానాల్లో పోటీ చేయనుంది.
బీజేపీని అడ్డుకోవాలనే….
కాంగ్రెస్ పార్టీ 31 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ. ఆర్జేడీ ఏడు నియోజకవర్గాల్లోనూ బరిలోకి దిగుతాయని ఆ పార్టీ నేతలు ప్రకటించారు. అయితే ఏ ఏ సీట్లలో ఎవరు పోటీ చేయాలన్నది ఇంకా స్పష్టత రాలేదు. ఎవరికి ఎక్కడ బలముందో అక్కడే పోటీ చేయాలని, స్నేహపూర్వక పోటీకి కూడా అవకాశమివ్వమని జేఎంఎం నేతలు స్పష్టం చేస్తున్నారు. త్వరలోనే ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ నుకలసి సీట్ల సర్దుబాటు పై చర్చించనున్నారు. మొత్తం మీద జార్ఖండ్ లో ఈసారి గట్టి పోటీ నెలకొందనే చెప్పాలి.