ఇద్దరూ ఇద్దరే…? ఎందుకు మీ ప్రయాస?
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పుడు ఒకే డిమాండ్ ను ఎదుర్కొంటున్నారు. కరోనా వైరస్ రెండు రాష్ట్రాల్లో విజృంభిస్తుంది. ఇద్దరు ముఖ్యమంత్రులు గత ఇరవై రోజులుగా అదే [more]
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పుడు ఒకే డిమాండ్ ను ఎదుర్కొంటున్నారు. కరోనా వైరస్ రెండు రాష్ట్రాల్లో విజృంభిస్తుంది. ఇద్దరు ముఖ్యమంత్రులు గత ఇరవై రోజులుగా అదే [more]
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పుడు ఒకే డిమాండ్ ను ఎదుర్కొంటున్నారు. కరోనా వైరస్ రెండు రాష్ట్రాల్లో విజృంభిస్తుంది. ఇద్దరు ముఖ్యమంత్రులు గత ఇరవై రోజులుగా అదే పని మీద ఉన్నారు. రాష్ట్రయంత్రాంగంతో ఎప్పటికిప్పుడు సమీక్షలు చేస్తూ వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. కరోనా వైరస్ కట్టడికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ లు కరోనా కట్డడికి ఎంత ప్రయత్నిస్తున్నా సాధ్యం కావడం లేదు.
జగన్ రాష్ట్ర సమస్యలపై…..
ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు, మార్గదర్శకాలతో పాటు సొంతంగా తమ రాష్ట్రంలో తీసుకోవాల్సిన చర్యలపై వారు ప్రధానంగా దృష్టి సారించారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలో పంటల కొనుగోళ్లతో పాటు ఆక్వా రైతులను ఆదుకోవడం వంటి వాటిపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. ఇక పేదలకు రేషన్ పంపిణీని కూడా ప్రధమ ప్రాధాన్యతగా తీసుకున్నారు. కరోనాను అరికట్టేందుకు టెస్టింగ్ సంఖ్య పెంచడంపైనే దృష్టి పెట్టారు.
కరోనాతో పాటు కర్షకుల….
ఇక ఆర్థికంగా బలంగా ఉన్న తెలంగాణ కూడా కరోనాతో ఇబ్బంది పడుతోంది. ఇప్పటి వరకూ నాలుగువేల కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా కేవలం వందకోట్ల ఆదాయం మాత్రమే ప్రభుత్వానికి వచ్చింది. కేసీఆర్ కూడా ప్రధానంగా పంటల కొనుగోళ్లపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. తొలిసారి తెలంగాణలో నలభై లక్షల ఎకరాల్లో పంట దిగుబడి రావడంతో ఆయన ఏ రైతుకు నష్టం జరగకూడదని గ్రామాలకు వెళ్లి మరీ పంట కొనుగోలు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో కరోనా తీవ్రత ఎక్కవుగా ఉండటంతో కేంద్రప్రభుత్వం కంటే ముందుగానే ఆయన ఏప్రిల్ 30 వరకూ లాక్ డౌన్ ను పొడిగించారు.
అఖిలపక్ష సమావేశానికి…?
కాని రెండు రాష్ట్రాల్లో విపక్షాలు అఖిలపక్ష సమావేశాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఏపీలో అయితే చంద్రబాబు ఇటీవల తరచూ విపక్షాలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అఖిలపక్షం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. కరోనా కట్టడిలో తమ సలహాలు కూడా తీసుకోవాలంటున్నారు. ఇక తెలంగాణలో సయితం విపక్షాలన్నీ ఒక్కటై అఖిలపక్షం కోసం డిమాండ్ చేశాయి. కానీ ఇద్దరు ముఖ్యమంత్రులు అఖిలపక్ష సమావేశం నిర్వహించడానికి విముఖంగా ఉన్నారు. విపక్షాలు సూచనలకంటే విమర్శలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, వారి సలహాలు అవసరంలేదన్నది ఇద్దరి ముఖ్యమంత్రుల ధోరణిగా ఉంది.