ఎన్టీయర్ లెగసీని ఎందుకలా వదిలేశారు…?
తెలుగు రాజకీయాల్లో చూసుకుంటే వర్తమాన కాలంలో ప్రజాకర్షణ కలిగిన మహా నాయకులుగా ఒక ఎన్టీఆర్, ఒక వైఎస్సార్లను చెప్పుకోవాలి. అంతకు ముందు టంగుటూరి ప్రకాశం పంతులు గారు [more]
తెలుగు రాజకీయాల్లో చూసుకుంటే వర్తమాన కాలంలో ప్రజాకర్షణ కలిగిన మహా నాయకులుగా ఒక ఎన్టీఆర్, ఒక వైఎస్సార్లను చెప్పుకోవాలి. అంతకు ముందు టంగుటూరి ప్రకాశం పంతులు గారు [more]
తెలుగు రాజకీయాల్లో చూసుకుంటే వర్తమాన కాలంలో ప్రజాకర్షణ కలిగిన మహా నాయకులుగా ఒక ఎన్టీఆర్, ఒక వైఎస్సార్లను చెప్పుకోవాలి. అంతకు ముందు టంగుటూరి ప్రకాశం పంతులు గారు లాంటి వారు ఉన్నారు కానీ ఈ ఇద్దరు నేతలూ ఈనాటి జనాలు బాగా కనెక్ట్ అయి ఉన్నారు. దాంతో అది వారి వారసులకు లాభిస్తోంది. వైఎస్సార్ ట్యాగ్ తోనే జగన్ రాజకీయ అరంగ్రేట్రం చేసి పదేళ్లలో తాను అనుకున్న టార్గెట్ కి ఏపీలో రీచ్ కాగలిగారు. ఇపుడు ఆయన సోదరి షర్మిల కూడా తెలంగాణాలో అదే పనిలో ఉన్నారు.
సంఘటపరచడమే..
వైఎస్సార్ అంటే అభిమానించే వారు తెలంగాణాలో ఎక్కువగా ఉన్నారు. ఆయన చనిపోయారు అని తెలియగానే ఎక్కువగా తెలంగాణాలోనే అభిమానుల గుండెలు ఆగాయి. దీన్ని బట్టి చూస్తే వైఎస్సార్ చరిష్మా తెలంగాణా నేల మీద ఎంతలా ప్రతిఫలిస్తోందో అర్ధమవుతోంది. ఇపుడు అలాంటి వారిని అందరికీ ఒక వైపుగా జమ చేసుకుని తన రాజకీయ భూమికు గట్టి పునాది వేసుకోవాలని షర్మిల భావిస్తున్నారు. ఆమె సీఎం సీటును సాధిస్తారో లేదో తెలియదు కానీ ఆమె మాత్రం గట్టి నాయకురాలు కావడానికి తండ్రి వైఎస్సార్ ఇమేజ్ బాగానే ఉపయోపడుతుంది అన్నది తధ్యం.
అన్నగారి ఊసేదీ..?
ఇక తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కి కూడా తెలంగాణా గడ్డ మీద ఎంతగానే ఆదరణ ఉంది. అసలు టీడీపీని ఆయన ప్రకటించినదే తెలంగాణా గడ్డ మీద. అలాగే, ప్రతీ ఎన్నికలోనూ ఆయనకు ఎక్కువ సీట్లు ఇచ్చి ఆదరించిన ఘనత కూడా ఆ ప్రాంత వాసులదే. ఇక ఆయన చనిపోయిన తరువాత అంతిమ యాత్రకు రికార్డు స్థాయిలో జనాలు తరలి వచ్చారు. ఎన్టీఆర్ అంటే పడి చచ్చే అభిమానులు తెలంగాణా మాగాణంలో ఎటు చూసినా కనిపిస్తారు. అటువంటి తెలంగాణాను అల్లుడు చంద్రబాబు రాష్ట్ర విభజన తరువాత నిర్లక్ష్యం చేశారు. ఇపుడు తెలంగాణా మీద రాజకీయ ఆశలను కూడా దాదాపుగా వదిలేసుకున్నారు. మరి జగన్ కూడా అదే పని చేస్తే చెల్లెలు తండ్రి వైఎస్సార్ కి తానే అచ్చమైన వారసురాలిని అని తెలంగాణాలో సత్తా చూపిస్తున్నారు. మరి అదే పని నందమూరి కుటుంబం ఎందుకు చేయదు అన్నదే ఇక్కడ ప్రశ్న.
తొడగొట్టలేరా…?
అన్నగారి వారసులు చాలా అంది సినిమాల్లో ఉన్నారు. వారంతా వెండి తెర మీద భారీ డైలాగులు చెబుతూ తొడగొడతారు. కానీ నిజ జీవితంలో మాత్రం సైలెంట్ గా ఉంటారు. ఎన్టీయార్ వారసులు అంతా కూడా హైదరాబాద్ లోనే దశాబ్దాల కాలం క్రితమే సెటిల్ అయిపోయారు. ఒక విధంగా వారు తెలంగాణా పౌరులు కిందకే లెక్క. మరి ఎన్టీఆర్ పెట్టిన పార్టీ తెలంగాణాలో అవసాన దశలో ఉంటే ఆ వైపు తొంగి చూడరు వంగి వాలరు. పోనీ వారి రాకకు బాబు నుంచి ఏమైనా అభ్యంతరాలు వ్యక్తం అవుతాయి అనుకుటే షర్మిల మాదిరిగా డేరింగ్ గా ఎందుకు కొత్త పార్టీ పెట్టి ఆ మహానుభావుడి వారసత్వాన్ని కొనసాగించరు అన్నదే సిసలైన ఎన్టీఆర్ భక్తుల ఆవేదన. ఎన్టీఆర్ మీద అభిమానం ఉన్న వారు ఎవరికీ ఓటు కూడా వేయరు. ఏ పార్టీలో చేరరు. మరి వారిని చేరదీసి సత్తా చాటితే తెలంగాణాలో కూడా ఎన్టీఆర్ పేరిట జెండా ఎగురుతుంది కదా అన్నది వారి ఆలోచన. కానీ వైఎస్సార్ ఫ్యామిలీ మాదిరిగా రాజకీయ దూకుడు చేసే విషయంలో నందమూరి ఫ్యామిలీ ఎందుకో వెనకబడింది అన్న కామెంట్స్ వస్తున్నాయి.