ఆళ్ల నానికి అవస్థలే.. వారిద్దరూ ఒకటయ్యారట
నిన్నటి వరకు ఎలాంటి టెన్షన్లు లేకుండా రిలాక్స్‌గా ఉన్న ఏపీ వైద్య శాఖా మంత్రి, డిప్యూటీ సీఎం ఆళ్ల నానికి ఒక్కసారిగా టెన్షన్ మొదలైంది. పుర పోరు [more]
నిన్నటి వరకు ఎలాంటి టెన్షన్లు లేకుండా రిలాక్స్‌గా ఉన్న ఏపీ వైద్య శాఖా మంత్రి, డిప్యూటీ సీఎం ఆళ్ల నానికి ఒక్కసారిగా టెన్షన్ మొదలైంది. పుర పోరు [more]
నిన్నటి వరకు ఎలాంటి టెన్షన్లు లేకుండా రిలాక్స్‌గా ఉన్న ఏపీ వైద్య శాఖా మంత్రి, డిప్యూటీ సీఎం ఆళ్ల నానికి ఒక్కసారిగా టెన్షన్ మొదలైంది. పుర పోరు నోటిఫికేషన్ రాకముందు కూడా నానిలో ఉన్న ధీమా ఎవ్వరిలోనూ ఉండేదే కాదు. కేబినెట్ ప్రక్షాళన జరిగినా జగన్ తనను తప్పించరన్న ధీమాతో పాటు ఇటు ఏలూరు మేయర్‌ను తన ఆధ్వర్యంలో తిరుగులేకుండా వైసీపీ గెలుస్తుందన్న విశ్వాసం ఆళ్ల నానిలో ఎక్కువుగా ఉండేది. అయితే వారం రోజుల్లోనే ఆయనలో ఆందోళన మొదలైంది. ఏలూరు కార్పొరేషన్ వైసీపీ గెలుస్తుందా ? అంటే చెప్పలేని పరిస్థితి ఉంది. ఎలాగైనా డిప్యూటీ సీఎంకు ఆయన ఇలాకాలోనే చెక్ పెట్టాలని డిసైడ్ అయిన టీడీపీ అక్కడ స్థానికంగా జనసేనతో సర్దుబాట్లు చేసుకునేందుకు రెడీ అవుతోంది.
జనసేనతో కలసి….
మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి మృతి చెందడంతో చంద్రబాబు వెంటనే స్పందించి ఆయన సోదరుడు బడేటి చంటికి ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. చంటికి ముందే అక్కడ సీన్ అర్థమైపోయింది. ఒంటరి పోరుతో వెళితే కార్పొరేషన్‌ను చేజేతులా వైసీపీకి పువ్వుల్లో పెట్టి అప్పగించేసినట్టే అవుతుందని డిసైడ్ అయిన ఆయన వ్యూహాత్మకంగా జనసేనతో స్థానిక సర్దుబాట్లుకు రెడీ అవుతున్నారు. నియోజకవర్గంలో కాపుల ప్రాబల్యం ఎక్కువ. గతంలో ప్రజారాజ్యం పోటీ చేసినప్పుడు ఇక్కడ ఆ పార్టీ రెండో స్థానంలో ఉంది. మొన్న జనసేన అభ్యర్థికి సైతం ఇక్కడ 16 వేల పై చిలుకు ఓట్లు పడ్డాయి.
ప్రభావం చూపే అవకాశాలు…
ఈ క్రమంలోనే బడేటి చంటి ఆళ్ల నానిని ఢీకొట్టేందుకు వేసిన ఎత్తుతో ఇప్పుడు నాని చిక్కుల్లో పడ్డారు. నిన్నటి వరకు అటు కార్పొరేషన్లో వార్ వన్‌సైడే అని ఫుల్ రిలాక్స్ అయిపోయిన నాని ఇప్పుడు చెమటలు కక్కుతున్నారు. ఓ వైపు గత గత టీడీపీ ప్రభుత్వంలో మేయర్‌గా ఉన్న షేక్ నూర్జహాన్నే ఎన్నికలకు ముందు పార్టీలోకి ఆహ్వానించగా… ఇప్పుడు తిరిగి ఆమెనే మేయర్ అభ్యర్థిగా ప్రకటించారు. నియోజకవర్గ పార్టీ కీలక నేతలు మంచెం మైబాబు, ఎంఆర్డీ బలరాం కాళ్లరిగేలా తిరుగుతున్నారు. టీడీపీ + జనసేన కలయిక కార్పొరేషన్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి.
టఫ్ లిస్ట్ లోకి వెళ్లిన….
ఎన్నికలు జరుగుతోన్న 12 కార్పొరేషన్లలో ఏలూరును గెలిచే లిస్టులో ఏ 1 పెట్టుకున్న వైసీపీ అధిష్టానం సైతం ఇప్పుడు టఫ్ లిస్టులో పెట్టుకుంది. ఇక్కడ రిజల్ట్ ఏ మాత్రం తేడా కొట్టినా జగన్ ఆళ్ల నాని విషయంలో ఎలాంటి కనికరాలు పెట్టుకోరు. ఆయన్ను మంత్రి పదవి నుంచి తప్పించేస్తారనే అంటున్నారు. అందుకే నాని ఇప్పుడు కార్పొరేషన్లో టీడీపీ + జనసేన ఉమ్మడి వ్యూహం చేధించేందుకు చెమటోడ్చక తప్పదు.