వదలనంటే వదలనంటున్నారే
ఆళ్ల రామకృష్ణారెడ్డి.. మంగళగిరి ఎమ్మెల్యే. వైసీపీ అభ్యర్థిగా రెండు సార్లు మంగళగిరి నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి తాను పట్టిన పట్టు వదలరన్న పేరుంది. [more]
ఆళ్ల రామకృష్ణారెడ్డి.. మంగళగిరి ఎమ్మెల్యే. వైసీపీ అభ్యర్థిగా రెండు సార్లు మంగళగిరి నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి తాను పట్టిన పట్టు వదలరన్న పేరుంది. [more]
ఆళ్ల రామకృష్ణారెడ్డి.. మంగళగిరి ఎమ్మెల్యే. వైసీపీ అభ్యర్థిగా రెండు సార్లు మంగళగిరి నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి తాను పట్టిన పట్టు వదలరన్న పేరుంది. ఆయన తెలుగుదేశం పార్టీని, ముఖ్యంగా చంద్రబాబునాయుడిని టార్గెట్ చేసుకుంటారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి విపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నప్పటికీ ఆయన చంద్రబాబును మాత్రం నిద్రపోనివ్వడం లేదు. కరకట్ట మీద చంద్రబాబు నివాసాన్ని తొలగించడంపైనే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన దృష్టంతా పెట్టారు. చంద్రబాబు నివాసం అక్రమ కట్టడమని తేల్చే ఆధారాలతో సహా ఆయన టీడీపీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు.
లోకేష్ నేరుగా వచ్చినా….
2014లో ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. అయితే అప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. రాజధానికి సమీపంలోనే ఉన్న నియోజకవర్గం కావడంతో టీడీపీ అగ్రనేతల కళ్లన్నీ మంగళగిరిపైనే ఉండేవి. ముఖ్యంగా చంద్రబాబు తనయుడు నారా లోకేష్ మంగళగిరిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. అభివృద్ధితో పాటు మంగళగిరిని ఐటీ హబ్ గా చేసేందుకు కొంత ప్రయత్నించారు. లోకేష్ వచ్చి మంగళగిరిలో తిష్ట వేసినా ఆళ్ల రామకృష్ణారెడ్డి బెదరలేదు. ఆర్థికంగా చితికిపోయినప్పటికీ ఆయన టీడీపీని టార్గెట్ చేయడం వదలలేదు.
వందకు పైగా కేసులతో…..
గతంలో ఆయన ప్రభుత్వంపైనా, చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలపైనా హైకోర్టును ఆశ్రయించారు. దాదాపు వందకు పైగా కేసులు వేశారు. రాజధాని అమరావతి నిర్మాణం కసం చంద్రబాబు ప్రభుత్వం భూసమీకరణ చేస్తే వెంటనే రైతులతో కలసి న్యాయస్థానంలో పోరాడారు. సదవార్తి భూముల విషయంలోనూ ఆళ్ల రామకృష్ణారెడ్డి వదలలేదు. తన అనుయాయులకు తక్కువ ధరకు సదావర్తి భూములను చంద్రబాబు కేటాయించారని ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించడంతో ప్రభుత్వానికి కోర్టులో ఎదురుదెబ్బ తగలింది. చంద్రబాబుకు సంబంధించి ఓటుకు నోటు కేసులోనూ ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లారు. టీడీపీ ఎమ్మెల్యేలపై 132 క్రిమినల్ కేసులను ఎత్తివేయడంపై కూడా కోర్టు గడప తొక్కారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఇలా ఆయన ఎక్కువ సమయాన్ని కోర్టుల్లో కేసులు వేస్తూనే గత ఐదేళ్లు గడిపారు.
ఇప్పుడు బాబు ఇంటిపైన…..
ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉండటంతో చంద్రబాబు నివాసం అక్రమమంటూ ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇప్పుడు మరోసారి యుద్ధానికి దిగారు. అసలు చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని ఎస్టేట్స్ ఆయనదే కాదని అది ప్రభుత్వ భూమి అని డాక్యుమెంట్లు బయటపెట్టారు. ఇంటి నిర్మాణం కోసం లింగమనేని రమేష్ పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని చెబుతున్నారు. కనీసం ఉడా అనుమతి కూడా ఆ కట్టడానికి లేవని చెబుతున్నారు. ఇక చంద్రబాబు, లోకేష్ ఆ నివాసంలో ఉంటూ అద్దె కింద ఐదేళ్ల 1.2 కోట్లు తీసుకున్నారని ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఇలా అధికారంలోకి వచ్చినా ఆళ్ల రామకృష్ణారెడ్డి చంద్రబాబును వదలనంటే వదలనంటున్నారు.