ఈయనకు మంత్రి పదవి లేదు… ఇది పక్కా ?
జగన్ మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చిన నేతలకే ఇప్పుడు దిక్కూ దివాణం లేని పరిస్థితి. గత ఎన్నికలకు ముందు ప్రచారంలో ఒక్క గుంటూరు జిల్లా నుంచే [more]
జగన్ మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చిన నేతలకే ఇప్పుడు దిక్కూ దివాణం లేని పరిస్థితి. గత ఎన్నికలకు ముందు ప్రచారంలో ఒక్క గుంటూరు జిల్లా నుంచే [more]
జగన్ మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చిన నేతలకే ఇప్పుడు దిక్కూ దివాణం లేని పరిస్థితి. గత ఎన్నికలకు ముందు ప్రచారంలో ఒక్క గుంటూరు జిల్లా నుంచే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డితో పాటు చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ ను మంత్రులను చేసి కేబినెట్లో తన పక్కన కూర్చోపెట్టుకుంటానని చెప్పారు. ఆళ్ల రామకృష్ణా రెడ్డి వరుసగా రెండు సార్లు మంగళగిరి ఎమ్మెల్యేగా గెలిచారు. మర్రి రాజశేఖర్‌కు గత ఎన్నికల్లో సీటు ఇవ్వలేదు. ఇక ఇప్పుడు ఈ ఇద్దరిని మంత్రులను చేయాలంటే మర్రి రాజశేఖర్‌కు ముందుగా ఎమ్మెల్సీ ఇవ్వాలి. ఆ తర్వాత మంత్రి పదవి ఇవ్వాలి… ఇక ఆళ్ల ఎలాగూ ఎమ్మెల్యే కాబట్టి ఆయన్ను తీసుకోవాలనుకుంటే నేరుగా మంత్రిని చేసేయొచ్చు. సీటు త్యాగం చేసినందుకు మర్రికి, లోకేష్‌ను ఓడిస్తే ఆళ్లకు మంత్రి పదవులు ఇస్తానని జగన్ చెప్పారు.
మర్రిని కాదని…..
అయితే ఇప్పుడు మర్రికి మంత్రి పదవి విషయంలో వాతావరణం అంతా సైలెంట్‌గా ఉంది. మర్రిని కాదని రెడ్డి వర్గానికే చెందిన ఆళ్ల రామకృష్ణా రెడ్డిని కేబినెట్ లోకి తీసుకుంటే అది తీవ్ర వ్యతిరేకతకు కారణమవుతుంది. లోకేష్‌ను ఓడిస్తే ఆళ్లను ఖచ్చితంగా మంత్రిని చేస్తానని జగన్ చెప్పారు. జగన్ ఎన్నికలకు ముందు ఆళ్లను మంత్రిని చేస్తానని చెప్పారే కాని.. ఎన్నికలు అయిన వెంటనే ఆయనకు ఏదో డౌట్ వచ్చినట్లు ఉంది. అందుకే ఆయన్ను సీఆర్డీయే చైర్మన్‌గా నియమించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఆయన్ను ఏదోలా ముప్పుతిప్పలు పెడుతూ వచ్చారు. నాటి ప్రభుత్వ లోపాలపై కేసులు వేశారు. అన్నింటికి మించి ఇక్కడ పోటీ చేసిన బాబు తనయుడు లోకేష్‌నే ఓడించారు.
ఆళ్లకు ఇస్తే…
అయితే ఇప్పుడు జగన్ మాత్రం ఆళ్ల రామకృష్ణా రెడ్డికి ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వరనే అంటున్నారు. కేబినెట్లో నలుగురు రెడ్డి మంత్రులు ఉన్నారు. వీరిని మారిస్తే మళ్లీ సీమ, ప్రకాశం ,నెల్లూరు జిల్లాల నుంచే పలువురు రెడ్డి నేతలు రేసులో ఉన్నారు. ఒకవేళ గుంటూరు జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలనుకున్నా నాలుగు సార్లు గెలిచిన పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఉన్నారు. నరసారావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కూడా వరుసగా రెండు సార్లు ఘనవిజయం సాధించారు. ఇక రాజధాని ఎఫెక్ట్‌తో ఇప్పుడు ఆళ్లపై సొంత పార్టీ కేడర్లోనే కాకుండా.. నియోజకవర్గ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది.
సమీకరణాలే…?
ఏదోలా మంత్రి పదవి దక్కించుకుని … ఈ రెండేళ్లు కొన్ని అభివృద్ధి పనులు అయినా చేయాలని ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆశతో ఉన్నారు. అయితే జగన్ మాత్రం జిల్లాలో ఉన్న సమీకరణల నేపథ్యంలో ఆళ్లకు మంత్రి పదవి మాత్రం ఇవ్వరనే పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. అందుకే జగన్ ఆయనకు ముందుగానే సీఆర్డీయే చైర్మన్ పదవి కట్టబెట్టేశారని టాక్ ?