తిరుమలకు మరింతగా తాకిడి పెరగనుందా …?
ప్రపంచంలో హిందువుల ఆరాధ్యదేవుడు తిరుమల శ్రీనివాసుడు. నిత్యం ఆయన దర్శనానికి వచ్చేభక్తుల సంఖ్య లక్షలు వేలల్లోనే ఉంటుంది. కరోనా కొనసాగుతున్నా, సామాన్య భక్తులను నియంత్రించి పరిమిత టికెట్లు [more]
ప్రపంచంలో హిందువుల ఆరాధ్యదేవుడు తిరుమల శ్రీనివాసుడు. నిత్యం ఆయన దర్శనానికి వచ్చేభక్తుల సంఖ్య లక్షలు వేలల్లోనే ఉంటుంది. కరోనా కొనసాగుతున్నా, సామాన్య భక్తులను నియంత్రించి పరిమిత టికెట్లు [more]
ప్రపంచంలో హిందువుల ఆరాధ్యదేవుడు తిరుమల శ్రీనివాసుడు. నిత్యం ఆయన దర్శనానికి వచ్చేభక్తుల సంఖ్య లక్షలు వేలల్లోనే ఉంటుంది. కరోనా కొనసాగుతున్నా, సామాన్య భక్తులను నియంత్రించి పరిమిత టికెట్లు జారీ చేస్తున్నా వేల సంఖ్యలోనే భక్తులు శ్రీవారి దర్శనానికి వచ్చేస్తున్నారు. అలాంటి స్వామి వారికి తోడు ఇప్పుడు హనుమంతుడి జన్మస్థలం చేరనుంది. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారికంగా ఆంజనేయుడి జన్మస్థలం అంజనాద్రి వద్దే అన్నది తేల్చేసింది.
మరో కీలక తీర్థస్థలం గా తిరుమల …
శ్రీరామ దూత, చిరంజీవి ఆంజనేయుడి జన్మస్థలం పై అనేక వివాదాలు, సంవాదాలు సాగాయి. టిటిడి ఈ అంశంపై విస్తృతమైన చర్చలు, శాస్త్ర పరిశోధనలు చేసింది. చివరికి ఆంజనేయుడు జన్మస్థలం అంజనాద్రి అని ఆకాశగంగా దగ్గర ఉన్న ప్రాంతంలోనే హనుమాన్ స్వస్థలం అనే ప్రకటించడంతో ఈ ప్రాంతానికి తిరుమలేశుని తో సమానంగా భక్త జనం పోటెత్తనున్నారు. వెంకటేశ్వరస్వామితో పాటు అంజనాద్రిని కూడా దర్శించుకోనున్నారు.
ఆ ఆలయానికి….
రామభక్త హనుమాన్ కి చెందిన ఇక్కడి ఆలయానికి కూడా మహర్దశ పట్టనుంది. టీటీడీ మాత్రం హనుమంతుడి జన్మస్థలం అంజనాద్రి మాత్రమేనని ఖచ్చితంగా చెబుతుంది. పురాణాలు, వేదాలపై అవగాహన ఉన్న వారితో ఎవరితోనైనా తాము చర్చలకు సిద్ధమని టీటీడీ అధికారులు చెబుతున్నాు. అదే విధంగా హనుమ పుట్టుక తిరుమల లో కాదన్న యుద్ధం మాత్రం ఇప్పట్లో పూర్తి స్థాయిలో తేలకపోవొచ్చు అంటున్నారు.