ఎవరూ తగ్గరు…హైకమాండ్ పట్టించు కోదు
ప్రకాశం జిల్లా చీరాల వైసీపీలో విభేదాలు రోజురోజుకూ తీవ్రమయ్యేలా కన్పిస్తున్నాయి. ఎవరూ తగ్గకపోవడం, అధిష్టానం మాటలు పెడ చెవిన పెట్టడమే ఇందుకు కారణం. ఇద్దరూ బలమైన నేతలు [more]
ప్రకాశం జిల్లా చీరాల వైసీపీలో విభేదాలు రోజురోజుకూ తీవ్రమయ్యేలా కన్పిస్తున్నాయి. ఎవరూ తగ్గకపోవడం, అధిష్టానం మాటలు పెడ చెవిన పెట్టడమే ఇందుకు కారణం. ఇద్దరూ బలమైన నేతలు [more]
ప్రకాశం జిల్లా చీరాల వైసీపీలో విభేదాలు రోజురోజుకూ తీవ్రమయ్యేలా కన్పిస్తున్నాయి. ఎవరూ తగ్గకపోవడం, అధిష్టానం మాటలు పెడ చెవిన పెట్టడమే ఇందుకు కారణం. ఇద్దరూ బలమైన నేతలు కావడంతో ఎవరి వైపు మొగ్గు చూపే ధైర్యం వైసీపీ హైకమాండ్ చేయడం లేదు. తాత్కాలిక సర్దుబాట్లు మాత్రమే చేస్తుంది తప్ప చీరాల వైసీపీ విభేదాలకు శాశ్వత పరిష్కారం అధిష్టానం చూపడం లేదు. ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ల మధ్య ఇక రాజీ కుదిరే ప్రసక్తి లేదన్నది పార్టీ వర్గాలే అంగీకరిస్తున్నాయి.
వైఎస్ వర్థంతి సందర్భంగా…..
వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా విభేదాలు మరింత ముదిరాయి. కరణం బలరాం తనయుడు వెంకటేష్ ఆమంచి వర్గానికి పరోక్షంగా ఇచ్చిన వార్నింగ్ ఆమంచికి మంటపుట్టించింది. దీనిపై ఎమ్మెల్సీ పోతుల సునీతతో సహా కరణం వర్గంపై ఆమంచి హైకమాండ్ కు ఫిర్యాదు చేశారు. ఇకపై చీరాల ప్రజలు స్వేచ్ఛగా బతుకుతారని, తాము చీరాలను అభివృద్ధి చేసేందుకే వైసీపీలోకి వచ్చామని, ఎవరి బెదిరింపులు ఇక ఉండవని కరణం వెంకటేష్ మరో నేత ఆమంచి కృష్ణమోహన్ పై చేసిన వ్యాఖ్యలు సంచలనమే పుట్టించాయి.
కరణం చేరిన నాటి నుంచే….
దీంతో ఆమంచి కృష్ణమోహన్ ఆఘమేఘాల మీద కరణం వర్గంపై ఫిర్యాదు చేశారు. నిజానికి ఆమంచి కృష్ణమోహన్ చీరాల వైసీపీ ఇన్ ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన కరణం బలరాం వైసీపీలో చేరారు. దీంతో ఇద్దరి మధ్య వార్ కరణం చేరికతోనే స్టార్టయింది. అధికారుల బదిలీల దగ్గర నుంచి లబ్ది దారుల ఎంపిక ప్రక్రియ వరకూ ఆమంచి, కరణం గ్రూపులు చీరాలలో కొట్టుకు ఛస్తున్నాయి. వీధినపడి వీరవిహారం చేస్తున్నాయి. అయినా అధిష్టానం చూసీ చూడనట్లు వ్యవహరిస్తుంది.
రాజీ కుదరకుంటే…..?
ఆమంచి కృష్ణమోహన్ ను పర్చూరు నియోజకవర్గ ఇన్ ఛార్జిగా వెళ్లాలని మధ్యే మార్గం సూచించిన ప్రతిపాదనను కూడా ఆయన తిరస్కరించారు. దీంతో చీరాలలో మరో నాలుగేళ్లు ఈ రగడ తప్పదులా ఉంది. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన వాళ్లంతా ఇప్పుడు కరణం బలరాంకు మద్దతు గా నిలుస్తున్నారు. ఆమంచి కృష్ణమోహన్ ఒక్కరే ఒంటరిగా మిగిలారు. ఇప్పటికైనా ఈ రెండు వర్గాల మధ్య ఏదో ఒక విధంగా రాజీ కుదర్చకుంటే వైసీపీకి చీరాలలో మనుగడ ఉండదన్నది వాస్తవం.