ఆమంచికి ఇక ఎదురులేదన్నదే బర్నింగ్ టాపిక్
రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో చెప్పడం కష్టం. అలాగే.. ఇప్పుడు వైసీపీలోనూ ఇదే తరహా రాజకీయాలు సాగుతున్నాయి. ప్రస్తుతం పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో నాయకులు పెరిగిపోతున్నారు. [more]
రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో చెప్పడం కష్టం. అలాగే.. ఇప్పుడు వైసీపీలోనూ ఇదే తరహా రాజకీయాలు సాగుతున్నాయి. ప్రస్తుతం పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో నాయకులు పెరిగిపోతున్నారు. [more]
రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో చెప్పడం కష్టం. అలాగే.. ఇప్పుడు వైసీపీలోనూ ఇదే తరహా రాజకీయాలు సాగుతున్నాయి. ప్రస్తుతం పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో నాయకులు పెరిగిపోతున్నారు. ఓ పది మాసాల కిందటి వరకు అంటే ఎన్నికలు జరగక ముందు వరకు కత్తులు నూరుకున్న నాయకులు ఇప్పుడు ఒకే గూటి పక్షుల్లాగా మారిపోయారు. ప్రకాశం జిల్లా చీరాలలో 2014 ఎన్నికల్లో ఆమంచి కృష్ణమోహన్ వర్సెస్ టీడీపీ రాజకీయాలు జోరందుకున్నాయి. ఆమంచి కృష్ణమోహన్.. స్వతంత్రంగా నవోదయం పార్టీ తరఫున పోటీ చేయగా.. టీడీపీ నుంచి పోతుల సునీత పోటీ చేశారు. అంతకు ముందు మాజీ ముఖ్యమంత్రి రోశయ్య శిష్యుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ఆమంచి కృష్ణమోహన్ 2009లో కాంగ్రెస్ నుంచి విజయం సాధించారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి 10 వేల ఓట్ల మెజార్టీతో సంచలన విజయం సాధించారు.
టీడీపీలో చేరినా…..
ఆ ఎన్నికల్లో ఆమంచి కృష్ణమోహన్‌పై పోటీ చేసిన సునీత ఓడినా పార్టీ అధికారంలోకి రావడంతో ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో పోరు సాగింది. ఎన్నికల కౌంటింగ్‌లో తేడా వచ్చిందని పెద్ద ఎత్తున ఇరు వర్గా లు కూడా కోట్లాడుకున్నాయి. మొత్తానికి ఆమంచి కృష్ణమోహన్ విజయం సాధించారు. ఆ తర్వాత టీడీపీ ఎమ్మెల్సీగా సునీతకు చంద్రబాబు అవకాశం ఇచ్చారు. ఇక, ఎమ్మెల్యేగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ దూకుడు పెంచారు. తర్వాత టీడీపీలోకి చేరినా కూడా సునీత వర్గానికి ఆమంచి వర్గానికి పచ్చగడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితి కొనసాగింది. పేరుకే ఆమంచి టీడీపీలో ఉన్నా ఆయన చీరాలలో తనకు పార్టీలతో సంబంధం లేదని.. తాను చెప్పిందే వేదం అన్నట్టుగా వ్యవహరించారు.
మూడు వర్గాలు…
ఇక, గత ఏడాది ఎన్నికలకు ముందు ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలో చేరారు. ఇక, అప్పటి ఎన్నికల్లో వైసీపీ తరఫున ఆమంచి, టీడీపీ తరఫున కరణం బలరాం పోటీ చేశారు. తీవ్ర ఉత్కంఠ రేపిన ఈ ఎన్నికల్లో కరణం గెలుపుగుర్రం ఎక్కారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఇప్పుడు ఈ మూడు పక్షాలు అంటే.. ఆమంచి, సునీత, కరణం వర్గాలు మొత్తం వచ్చి వైసీపీలో చేరిపోయాయి. ఇటీవల సీఆర్ డీఏ రద్దు బిల్లుకు సంబంధించి మండలిలో జరిగిన ఓ టింగ్ సమయంలో సునీత వ్యతిరేక ఓటు వేయడం ద్వారా వైసీపీలోకి వచ్చేందుకు రెడీ అనే సంకేతాలు ఇచ్చారు. ఇక, కొన్ని రోజుల కిందట కరణం బలరాం.. నేరుగా వచ్చి తన కుమారుడు కరణం వెంకటేష్‌కు వైసీపీ కండువా కప్పించారు. ఇలా ఇప్పుడు మూడు పక్షాలు కూడా వైసీపీలోనే ఉన్నట్టయింది. దీంతో ఇక్కడ ఆసక్తికర రాజకీయాలు సాగుతున్నాయి. మొత్తానికి ఈ ముగ్గురు శత్రువుల స్నేహం ఎన్నాళ్లు కొనసాగుతుందో ? చూడాలి.
యెడం అప్పుడూ ఇప్పుడూ ఒంటరేనా…?
విచిత్రం ఏంటంటే 2014 ఎన్నికల్లో చీరాలలో వైసీపీ నుంచి పోటీ చేసిన యెడం బాలాజీ ఆ తర్వాత ఐదేళ్ల పాటు నియోజకవర్గంలో పార్టీని బతికించుకుని ఒంటరి పోరాటం చేశారు. ఆ తర్వాత ఇటు ఆమంచి కృష్ణమోహన్ తో పాటు అటు సునీతతోనూ ఆయన ఫైట్ చేసి మరీ పార్టీని కాపాడుకున్నారు. ఆ తర్వాత ఆమంచి కృష్ణమోహన్ కి వైసీపీ సీటు ఇవ్వడంతో ఆయన టీడీపీలో చేరి ఆమంచిని ఓడించేందుకు ప్రయత్నించారు. అప్పుడు యొడం బాలాజీ, పోతుల సునీత, కరణం బలరాం కలిసి ఫైట్ చేసి ఆమంచి కృష్ణమోహన్ ని ఓడించారు. ఇప్పుడు ఆ ముగ్గురు ఒక్కటి అవ్వగా బాలాజీ మళ్లీ ఒంటరయ్యారు. ప్రస్తుతం ఆయనకు చంద్రబాబు చీరాల టీడీపీ ఇన్చార్జ్ పగ్గాలు ఇచ్చారు.