చీరాల వైసీపీలో ఆమంచి ఖుషీ.. ఏం జరిగిందంటే?
చీరాల వైసీపీలో కీలక నాయకుడిగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ ఇప్పుడు ఖుషీగా ఉన్నారు. నిన్న మొన్నటి వరకు చాలా గుంభనంగా.. చాలా ఆవేదనగా ఉన్న ఆయనలో ఇప్పుడు [more]
చీరాల వైసీపీలో కీలక నాయకుడిగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ ఇప్పుడు ఖుషీగా ఉన్నారు. నిన్న మొన్నటి వరకు చాలా గుంభనంగా.. చాలా ఆవేదనగా ఉన్న ఆయనలో ఇప్పుడు [more]
చీరాల వైసీపీలో కీలక నాయకుడిగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ ఇప్పుడు ఖుషీగా ఉన్నారు. నిన్న మొన్నటి వరకు చాలా గుంభనంగా.. చాలా ఆవేదనగా ఉన్న ఆయనలో ఇప్పుడు ఒకేసారి హుషారు రేకెత్తిస్తున్నారు. దీంతో అసలు ఏం జరిగిందని ఆరా తీస్తే.. కీలక విషయం ఒకటి బయటకు వచ్చింది. విషయం ఏంటంటే.. ఎన్నో ఆశలతో ఆమంచి కృష్ణమోహన్ అండ్ ఫ్యామిలీ గుండుగుత్తుగా వైసీపీలోకి చేరారు. 2014లో స్వతంత్రంగా చీరాల నుంచి విజయం సాధించిన ఆమంచి.. తర్వాత చంద్రబాబు పిలుపుతో టీడీపీలోకి వచ్చిన విషయం తెలిసిందే. తర్వాత ఆయన టీడీపీలోనూ కొనసాగలేక పోయారు. అనుకున్నదేదో ఆయనకుద క్కక గత ఎన్నికలకు ముందు పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఈ క్రమంలోనే ఎన్నికలకు ముందు గత ఏడాది ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.
వ్యూహం ఫలించక…..
వైసీపీ టికెట్పైనే గత ఏడాది ఎన్నికల్లో ఆమంచి కృష్ణమోహన్ పోటీ చేశారు. అయితే, ఇక్కడే వ్యూహం ఫలించలేదు. టీడీపీ నుంచి ఎవరూ బలమైన అభ్యర్థి లేరని అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా బాబు ఇక్కడ నుంచి కరణం బలరాంను రంగంలోకి దింపారు. అయినప్పటికీ ఆమంచి కృష్ణమోహన్ ఆయనను తక్కువగా అంచనా వేశారు. తనకు తిరుగులేదని అనుకున్నారు. కానీ,రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పెను గాలులు వీచినా.. ఇక్కడ మాత్రం ఆమంచి హవా పనిచేయలేదు. కరణం ఏకంగా 17 వేల ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. అక్కడ ఎన్నికలకు ముందు ఆమంచి శత్రువుల అందరూ ఏకమై ఆయన్ను ఓడించారు. దీంతో పార్టీ బంపర్ మెజార్టీతో అధికారంలోకి రావడం… ఇటు తాను ఓడిపోవడంతో ఆమంచికి పెద్ద ఇబ్బంది వచ్చినట్టయింది.
తొలుత కలవరపడినా….?
ఇదిలావుంటే, పట్టుమని ఆరు మాసాలు కూడా గడవకముందుగానే టీడీపీ నుంచి ఇద్దరు కీలక నాయకులు, అందునా తనతో వైరం ఉన్న నాయకులు వచ్చి వైసీపీ తీర్థం పుచ్చుకునే సరికి ఆమంచి కృష్ణమోహన్ బిత్తర పోయారు. ఎమ్మెల్యే కరణం బలరాం సహా ఎమ్మెల్సీ పోతుల సునీతలు వచ్చి వైసీపీకి మద్దతు చెప్పారు. దీంతో ఇక, వైసీపీలో తన హవా ఉండదని ఆమంచి కృష్ణమోహన్ అనుకున్నారు. అంతేకాదు, స్థానిక ఎన్నికల్లోనూ తన హవాకు బ్రేక్ పడుతుందని భావించారు. అయితే, తర్వాత జరిగిన పరిణామాలతో ఆయన ఒకింత ఊపిరి పీల్చుకున్నారు. జగన్ ఇచ్చిన మాట ప్రకారం వచ్చే ఎన్నికల్లో కరణం పోటీలో ఉండరు. అంటే.. మళ్లీ చీరాల నియోజకవర్గం ఆమంచి కృష్ణమోహన్ కే ఉంటుందన్న మాట.
మున్సిపల్ ఎన్నికల్లోనూ….
వాస్తవానికి కరణం రాకతో ఇక, వైసీపీ టికెట్ ఆయనకే వెళ్లిపోతుందని అనుకున్న అనుచరులు.. ఇప్పుడు జగన్ చెప్పిన మాట వారికి అమృతంగా ఉంది. వచ్చే ఎన్నికల నాటికి కరణం పార్టీలోనే ఉన్నా.. ఆయన కుమారుడికి మాత్రం అద్దంకి టికెట్ ఇస్తారు. అంటే చీరాల టికెట్ ఆమంచి కృష్ణమోహన్ కేనన్న మాట. ఇక, సునీతకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేది లేదు. సో.. మొత్తానికి ఈవిషయం తెలిసిన తర్వాత ఆమంచి వర్గం ఖుషీగా ఉన్నారన్నమాట. ఇక ఇటీవల మునిసిపల్ ఎన్నికల్లో సైతం కౌన్సెలర్లు సీట్లు సైతం కరణం, ఆమంచి వర్గాలు పంచుకున్నాయి.