ఆమంచి పైనా పర్చూరు ఫార్ములానేనా?
రాజకీయంగా ఆయనకు మంచి ప్రజాబలం ఉంది. అయినా ఏం లాభం దూకుడు పాలిటిక్స్ ముందు ప్రజలు కూడా నిలవలేక పోతున్నారు. నోరు విప్పితే.. తంటా.. చేతి ఆడింపు [more]
రాజకీయంగా ఆయనకు మంచి ప్రజాబలం ఉంది. అయినా ఏం లాభం దూకుడు పాలిటిక్స్ ముందు ప్రజలు కూడా నిలవలేక పోతున్నారు. నోరు విప్పితే.. తంటా.. చేతి ఆడింపు [more]
రాజకీయంగా ఆయనకు మంచి ప్రజాబలం ఉంది. అయినా ఏం లాభం దూకుడు పాలిటిక్స్ ముందు ప్రజలు కూడా నిలవలేక పోతున్నారు. నోరు విప్పితే.. తంటా.. చేతి ఆడింపు మంట! అన్నట్టుగా ఉంది ఆ నాయకుడి పరిస్థితి. దీంతో ప్రకాశం జిల్లా చీరాల రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. ఈ నియోజకవర్గంలో వైసీపీ నాయకుడు ఆమంచి కృష్ణమోహన్ రాజకీయంగా తన దూకుడు ఏ మాత్రం తగ్గించడం లేదనే వార్తలు హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ ఏడాది ఎన్నికల్లో ఆమంచి కృష్ణమోహన్ ఓటమి పాలయ్యారు. దీంతో కొంత మేరకు దూకుడు తగ్గిస్తారని అందరూ అనుకున్నారు.
ఎన్నిసార్లు చెప్పి చూసినా….
కానీ, కింద పడ్డా పైచేయినాదే అనే సామెత మాదిరిగా ఆమంచి వ్యవహరించారు. ఓడిపోయినా.. వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి.. అంతా నామాటే చెల్లాలనే ధోరణిని పాటిస్తున్నారు. దీంతో రాజకీయాలు ఇక్కడ నిత్య ఘర్షణగా మారాయి. ఈ పరిణామాలతో జగన్ ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాల్సి వస్తోందనేది వాస్తవం. దీంతో ఇప్పటికే ఒకటి రెండు సార్లు ఆమంచి కృష్ణమోహన్ కి చెప్పి చూశారు. పద్ధతి మార్చుకోవాలన్నారు. కానీ, నేటికీ పరిస్థితి మారలేదు. ఈ నేపథ్యంలో ఇటీవల ఆమంచి కృష్ణమోహన్ తనకు నామినేటెడ్ పోస్ట్ ఇవ్వడంతో పాటు తన వారికి గుర్తింపు ఇచ్చేలా చూడాలంటూ జగన్‌ను నేరుగా అభ్యర్థించాలని చూశారు.
చింతమనేని తరహాలోనే…
కానీ, జగన్ ఆమంచి కృష్ణమోహన్ కి అప్పాయింట్ మెంట్ ఇచ్చేందుకు కూడా వెనుకాడారు. ఏదైనా మాట్లాడు కోవాలంటే జిల్లా ఇన్చార్జ్ మంత్రితో మాట్లాడుకోవాలని ఆయనకు ఖరాఖండీగా చెప్పేశారు. దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ టీడీపీకి ఎంత మైనస్ అయ్యారో.. ఇప్పుడు ఆమంచి కృష్ణమోహన్ దూకుడుగా ముందుకు వెళుతుండడంతో టీడీపీ కూడా ఇప్పుడే అదే అస్త్రాన్ని వాడుకుని ఆమంచి కృష్ణమోహన్ దూకుడు వైసీపీకి అంటకట్టేయాలని ప్లాన్ చేస్తోంది.
జగన్ సీరియస్ గా….
ఈ పరిణామాల నేపథ్యంలో అసలు ఆమంచి కృష్ణమోహన్ వల్ల పార్టీకి ఏదైనా ఉపయోగం ఉందా? అనే చర్చ కూడా సాగుతోంది. దీంతో ఆయనను సాగనంపాలని పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక, ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆమంచి కృష్ణమోహన్ పార్టీలో కొనసాగాలంటే.. దూకుడు తగ్గించుకోవాలి. లేదా.. పార్టీ వీడాలి. ఈ విషయం ఆమంచి కృష్ణమోహన్ కోర్టులోనే ఉండడం గమనార్హం. జగన్ సైతం ఆమంచి కృష్ణమోహన్ విషయంలో ఉంటే ఉంటాడు.. లేకపోతే లేదన్నట్టుగా లైట్ తీస్కొన్నట్టు తెలుస్తోంది. ఇదిలావుంటే, ఎన్నికలకు ముందు చీరాల వైసీపీ ఇంచార్జ్ గా ఉన్న ఎడం బాలాజీని వైసీపీ లోకి తీసుకోవాలనే సూచనలు కనిపిస్తున్నాయి.
బాలాజీని మళ్లీ తీసుకుని…..
ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడం ఆయన నేరుగా వెళ్లి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే, అక్కడా గుర్తింపు లభించలేదు. అయితే ఎన్నికల్లో ఆమంచి కృష్ణమోహన్ ని ఓడించేందుకు బలరాంకు బాగా సపోర్ట్ చేశారు. అయితే నాన్ కాంట్రవర్సియల్ పర్సన్‌గా ఆయనకు మంచి పేరుంది. ఈ క్రమంలో బాలాజీకి వైసీపీలోకి అవకాశం వస్తే.. జగన్‌కు మరోసారి జై కొట్టాలని నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో వైసీపీఆమంచి కృష్ణమోహన్ ను వదిలించుకునేందుకు, బాలాజీకి ఛాన్స్ ఇచ్చేందుకు వడి వడిగా అడుగులు వేస్తోందని అంటున్నారు పరిశీలకులు. సేమ్ టు సేమ్ పర్చూరులో దగ్గుబాటిని వదిలించుకునేందుకు ఎన్నికలకు ముందు వరకు పార్టీలో ఉన్న రావి రామనాథం బాబును తిరిగి ఎలా పార్టీలో చేర్చుకున్నారో ఇప్పుడు చీరాలలో ఆమంచి కృష్ణమోహన్ కి బ్రేక్ వేసేందుకు ఇక్కడ కూడా అదే ఫార్ములా ఫాలో అవుతున్నట్టే కనిపిస్తోంది.