తెలివిడి కొరవడిందా?
అమరావతిని ఒక నగరంగా గుర్తించకుండా, ఆ ప్రాంతాన్ని ఒక నగర పాలనలోకి తేకుండా రాజధాని నగరంగా ఎలా ప్రకటించడం? ఓవైపు రాజధానిగా అమరావతి కొనసాగాలని “పోరాటం” చేస్తూనే [more]
అమరావతిని ఒక నగరంగా గుర్తించకుండా, ఆ ప్రాంతాన్ని ఒక నగర పాలనలోకి తేకుండా రాజధాని నగరంగా ఎలా ప్రకటించడం? ఓవైపు రాజధానిగా అమరావతి కొనసాగాలని “పోరాటం” చేస్తూనే [more]
అమరావతిని ఒక నగరంగా గుర్తించకుండా, ఆ ప్రాంతాన్ని ఒక నగర పాలనలోకి తేకుండా రాజధాని నగరంగా ఎలా ప్రకటించడం? ఓవైపు రాజధానిగా అమరావతి కొనసాగాలని “పోరాటం” చేస్తూనే మరోవైపు “అమరావతి నగర పాలక సంస్థ” ఏర్పాటు ప్రయత్నాలను ఇలా ప్రశ్నించడం ఏమి రాజకీయమో తెలియడం లేదు. అలాగే గ్రామసభలపై వ్యతిరేక వార్తలు కూడా ఏకపక్షంగా ఉన్నాయి.
అధికారులు వారి పని….
గతంలో రాజధాని గ్రామాలుగా ఈ 29 గ్రామాలను ఎంపిక చేసే సందర్భంలోనూ, సీఆర్డీఏ ఏర్పాటు సందర్భంలోనూ గ్రామసభలు ఎలా జరిగాయో గుర్తులేదా? అధికారులు తాము అనుకున్నదే చేసుకుంటూ పోతుంటారు. గ్రామసభలు తూతూ మంత్రంగానే నిర్వహిస్తారు. ప్రభుత్వంలో ఎవరున్నారు, ఏపార్టీ అధికారంలో ఉన్నది అన్న విషయాలు అధికారులకు అనవసరం. వారికి అప్పగించిన పని ఎవరు ఎలా అనుకున్నా ఈ పద్దతిలోనే పూర్తిచేస్తారు.
గ్రామ సభలను…
సీఆర్డీఏ ఏర్పాటు సమయంలో గ్రామసభలు ఎలా జరిగాయో ఇప్పుడు అమరావతి నగరపాలక సంస్థ లేదా అమరావతి పట్టణాభివృద్ధి సంస్థ ఏర్పాటుకు గ్రామసభలు కూడా అలాగే జరుగుతున్నాయి. ఈ విధానంలో తేడా ఏమిలేదు. వచ్చిన తేడా అల్లా అధికారంలో ఉన్న పార్టీ. అధికార మార్పిడి. సీఆర్డీఏ గ్రామసభల సమయంలో అనుకూల పార్టీ అధికారంలో ఉంది. ఇప్పుడు ఆ పార్టీ లేదు. వేరే పార్టీ అధికారంలో ఉంది. అందుకే గ్రామసభలు ఇలా ప్రజా వ్యతిరేకంగానూ, ప్రజాస్వామ్యాన్ని తూట్లు పొడిచే విధంగానూ, ప్రజలు లేని సభలుగానూ, తూతూమంత్రం కార్యక్రమాలుగానూ కనిపిస్తాయి.
పంచాయతీలతో…
చూసే కళ్ళు (మీడియా) అవే. చేసే చేతులు (అధికారులు) అవే. చేసే పనులు (గ్రామసభలు) అవే. చేయించే వారే (అధికారపార్టీ) వేరు. అందుకే చూసే కళ్ళకు ఇప్పుడు ప్రజాస్వామ్యం, నిబంధనలు, ఇంకా అనేకం గుర్తు వస్తున్నాయి. అంత మాత్రాన ఈ తూతూమంత్రం సభలను సమర్ధించడం లేదు.అయితే, అమరావతి 29 గ్రామాల స్థాయినుండి నగర స్థాయికి చేరాలంటే ప్రస్తుత తంతు జరగాల్సిందే. అమరావతి గ్రామీణాభివృద్ధి శాఖ, పంచాయితీరాజ్ శాఖల పరిధిలోనుండి పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ పరిధిలోకి మారాల్సిందే. ఈ మార్పు స్వాగతించకపోతే అమరావతిని నగరంగా చూడలేం. గ్రామపంచాయితీలతో ఒక నగరం ఏర్పడదు. పంచాయితీలు రద్దయి విలీనం అవ్వాల్సిందే. కనీసం ఈ పరిజ్ఞానం అయినా ఉండాలి.
-గోపి దారా, సీనియర్ జర్నలిస్ట్ ఫేస్ బుక్ పోస్ట్ నుంచి