రాజధాని రైతులు మరో ఆర్టీసీ కార్మికులా?
రాజధాని రైతులు మరో తెలంగాణ ఆర్టీసీ కార్మికులు అయ్యే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా కన్పిస్తుంది. గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు, [more]
రాజధాని రైతులు మరో తెలంగాణ ఆర్టీసీ కార్మికులు అయ్యే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా కన్పిస్తుంది. గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు, [more]
రాజధాని రైతులు మరో తెలంగాణ ఆర్టీసీ కార్మికులు అయ్యే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా కన్పిస్తుంది. గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు, రాజధాని రైతులకు మధ్య పెద్దగా తేడా లేనట్లుగానే చూసే వారికి స్పష్టంగా తెలుస్తుంది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మనస్తత్వం, పోకడలు తెలిసిన వారు దీనిని కాదనలేరు. ఎందుకంటే గత రెండు రోజులుగా రాజధాని రైతులు అసభ్యకరంగా దూషించడం ఇందుకు కారణమని చెప్పక తప్పదు.
కేసీఆర్ పై వ్యక్తిగతంగా…
తెలంగాణాలో ఇటీవలే ఆర్టీసీ కార్మికుల సమ్మె దాదాపు యాభై రోజులకు పైగానే సాగింది. ఈ సమ్మె సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు టీఆర్ఎస్ ను కార్మికులు తూలనాడారు. యూనియన్ నేతలయితే మరింత ముందడుగు వేసి రాజ్యాంగ సక్షోభం వస్తుందని ప్రకటనలు చేశారు. దీంతో ఆర్టీసీ కార్మికులతో చర్చలకు కేసీఆర్ ససేమిరా అన్నారు. అందరి ఉద్యోగాలు ఊడిపోయినట్లేనని హెచ్చరించారు కూడా. యాభై రోజుల పాటు ఇబ్బందులకు గురి చేసి చివరకు యూనియన్ నేతలతో సంబంధం లేకుండా ఆర్టీసీ సాధారణ కార్మికులతో సమావేశమై కేసీఆర్ వారిపై వరాల జల్లు కురిపించారు.
రైతులు కూడా…..
ఇప్పుడు అమరావతిరైతుల పరిస్థితి కూడా అందుకు భిన్నంగా ఉండబోదన్న కామెంట్స్ వినపడుతున్నాయి. జగన్ ప్రభుత్వాన్ని బర్త్ రఫ్ చేయాలని, తుగ్లక్ పాలన అంటూ, జగన్ కు రాజధానిని తరలించే అధికారం ఎక్కడ ఉందని రాజధాని రైతులు రెండు రోజులుగా ప్రశ్నిస్తున్నారు. పార్టీలకు అతీతంగానే వారు ఆందోళన చేస్తున్నప్పటికీ మహిళల నుంచి వృద్ధులు వరకూ చేస్తున్న వ్యాఖ్యలు వైసీపీ నేతలను గాయపర్చే విధంగా ఉన్నాయి. అంతేకాకుండా అక్కడ ఆర్టీసీ కార్మికుల లాగానే రాజధాని రైతులు కూడా హైకోర్టును ఆశ్రయంచారు.
పట్టుదలకు పోతే…?
దీంతోనే జగన్ మరింత పట్టుదలకు పోతారని అంటున్నారు. రాజధాని రైతుల వెనక టీడీపీ నేతలున్నారని ఇప్పటికే వైసీపీ నేతలు ప్రచారం చేయడం మొదలెట్టారు. వారంతా పెయిడ్ ఆర్టిస్టులంటూ మండిపడుతున్నారు. వైసీపీ నేత అంబటి రాంబాబు అయితే ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇలా రాజధాని రైతులు ముఖ్యమంత్రి మనస్తత్వం తెలిసి కూడా వ్యాఖ్యానిస్తే తెలంగాణ ఆర్టీసీ కార్మికుల మాదిరి బాధపడతారని ఒక సీనియర్ నేత అభిప్రాయపడ్డారు.