ఇక కష్టమేనా? చేయిదాటి పోయినట్లేనా?
కరోనా నుంచి అమెరికా ఇప్పట్లో కోలుకునేలా లేదు. రోజుకు వెయ్యి మరణాలు సంభవిస్తుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ఆలస్యంగానైనా చర్యలు తీసుకున్నా ఫలితం మాత్రం కన్పించడం లేదు. [more]
కరోనా నుంచి అమెరికా ఇప్పట్లో కోలుకునేలా లేదు. రోజుకు వెయ్యి మరణాలు సంభవిస్తుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ఆలస్యంగానైనా చర్యలు తీసుకున్నా ఫలితం మాత్రం కన్పించడం లేదు. [more]
కరోనా నుంచి అమెరికా ఇప్పట్లో కోలుకునేలా లేదు. రోజుకు వెయ్యి మరణాలు సంభవిస్తుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ఆలస్యంగానైనా చర్యలు తీసుకున్నా ఫలితం మాత్రం కన్పించడం లేదు. ఇప్పటికే అమెరికాలో రోజుకు రెండు వేల మంది చనిపోతుండటంతో అగ్రరాజ్యం చేతులెత్తేసే పరిస్థిితి కొనితెచ్చుకున్నట్లయింది. ఏ దేశంలో లేని విధంగా అమెరికాలో కరోనా విలయ తాండవం చేస్తుంది. ఒక్క న్యూయార్క్ నగరంలోనే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్షలకు చేరుకుంది.
మరణాలు ఎక్కువగా…..
ఇప్పటికే అమెరికాలో కరోనా వైరస్ తో మరణాలు 17వేలకు చేరుకున్నాయి. దాదాపు నాలుగు లక్షలకు పైగానే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అమెరికాలో ఉంది. దీని సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. వైద్య నిపుణులు ఊహించినట్లుగానే అమెరికాలో కరోనా బారిన పడి మరణించే వారి సంఖ్య లక్షలకు చేరుకుంటుందన్నది నిజమవుతుందేమోనన్న భయం నెలకొని ఉంది. ఇళ్లల్లో ఉండి చనిపోయే వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉందంటున్నారు.
ఆసుపత్రులన్నీ…..
అమెరికాలో ఆసుపత్రులన్నీ కరోనా పేషెంట్లతో నిండిపోయి ఉన్నాయి. కేవలం కరోనా పేషెంట్లను మాత్రమే ఆసుపత్రుల్లో చేర్చుకుంటున్నారు. మిగిలిన వారికి ఇంటి వద్దనే వైద్య సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించారు. ఇప్పటికీ అమెరికాలో కొన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలు చేయకపోవడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అయితే జరుగుతున్న పరిణామాలను చూసిన ప్రజలు తమంతట తాము స్వీయ నిర్భంధాన్ని పాటిస్తున్నారు. భౌతిక దూరాన్ని కూడా పాటిస్తున్నారు. ఇది కొంతలో కొంత నయం అని చెబుతున్నారు వైద్యులు.
ట్రంప్ కోపం ఎవరిపైన?
అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం తప్పును ప్రపంచ ఆరోగ్య సంస్థపైకి నెట్టేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనాపై ఆలస్యంగా హెచ్చరికలు జారీ చేయడం వల్లనే తాము ఇంతగా నష్టపోయామని ఆయన డబ్ల్యూ హెచ్ఓపై ధ్వజమెత్తారు. చైనాను వెనకేసుకు వస్తుందన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ సమయంలో రాజకీయాలు చేయవద్దని, ప్రపంచ దేశాలన్నీ ఏకమైతేనే కరో్నాను కట్టడి చేయగలమని సున్నితంగా చెప్పడం విశేషం. మొత్తం మీద అమెరికాలో మరణాల సంఖ్య ఆగడం లేదు. పాజిటివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతుండటం ఆందోళన కల్గించే విషయమే.