ట్రంప్ భయం అదేనా? అందుకేనా తాటతీస్తానంటున్నారా?
చైనాను మాత్రం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వదిలిపెట్టడం లేదు. దాని తాట తీస్తానని రోజుకో హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కరోనా వైరస్ వూహాన్ ల్యాబ్ నుంచే [more]
చైనాను మాత్రం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వదిలిపెట్టడం లేదు. దాని తాట తీస్తానని రోజుకో హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కరోనా వైరస్ వూహాన్ ల్యాబ్ నుంచే [more]
చైనాను మాత్రం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వదిలిపెట్టడం లేదు. దాని తాట తీస్తానని రోజుకో హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కరోనా వైరస్ వూహాన్ ల్యాబ్ నుంచే వచ్చిందని ట్రంప్ వాదిస్తున్నారు. వూహాన్ లోని వైరాలజీ ల్యాబ్ లో కరోనా సృష్టించారని ట్రంప్ ఢంకా భజాయించి చెబుతున్నారు. తన వద్ద ఖచ్చితమైన సమాచారం ఉందని కూడా ట్రంప్ చెబుతున్నారు. అవసరమైన సమయంలో దీనిని బయటపెడతామంటున్నారు ట్రంప్.
అమెరికాకు నష్టం……
కరోనా మహమ్మారి కారణంగా అమెరికా చాలా నష్టపోయింది. దాదాపు 65 వేల మంది మృత్యువాత పడ్డారు. లక్షల సంఖ్యలో కరోనా బాధితులు ఉన్నారు. ఎన్నికల సమయంలో కరనా మహమ్మారి విజృంభించడంతోనే ట్రంప్ అసలు కోపానికి కారణమని చెప్పక తప్పదు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నిక కావడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు. లోకల్ నినాదంతో ముందుకు వెళుతున్నారు. నవంబరు నెలలో అమెరికా అధ్యక్ష్య ఎన్నికలు జరగాల్సి ఉంది.
ఎన్నికల్లో విజయావకాశాలను…..
అయితే కరోనా తన విజయావకాశాలను దెబ్బతీస్తుందేమోనన్న కంగారు ట్రంప్ లో అడుగడుగునా కన్పిస్తుంది. వైరస్ కు చైనా కారణమని ఆయన తొలి నుంచి గట్టిగా చెబుతున్నారు. చైనా కరోనా వైరస్ దాచిపెట్టడం వల్లనే అమెరికాకు ఈగతి పట్టిందని ట్రంప్ గట్టిగా విశ్వసిస్తున్నారు. చైనా మీద కోపాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థపై కూడా ట్రంప్ చూపెడుతున్నారు. నిధులను కూడా దానికి నిలిపివేసి తన అక్కసును తీర్చుకున్నారు.
అమెరికా ఇంటలిజెన్స్ మాత్రం…..
అయితే అమెరికా ఇంటలిజెన్స్ మాత్రం ట్రంప్ వ్యాఖ్యలకు భిన్నంగా స్పందించింది. కరోనా వైరస్ సహజ సిద్ధంగా ఏర్పడిందేనని అమెరికా ఇంటలిజెన్స్ చెప్పింది. అయితే ఈ వైైరస్ జంతువుల నుంచి పుట్టిందా? వూహాన్ ల్యాబ్ లో ప్రయోగం వికటించి వైరస్ ఉద్భవించిందా? అన్న దానిపై తమ విచారణ కొనసాగుతుందని ఇంటలిజెన్స్ పేర్కొంది. ట్రంప్ కు పూర్తి వ్యతిరేకంగా అమెరికా ఇంటలిజెన్స్ ప్రకటించడంతో చైనాపై ఆయన చేస్తున్న విమర్శలు ఎన్నికల నాటికి ఎంతవరకూ నిలుస్తాయన్నది చూడాల్సి ఉంది.