ట్రంప్ ఏం పొడిచి పోయాడు?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు భారత్ లో బ్రహ్మాడమైన ఆతిధ్యం లభించింది. యావత్ దేశం ఆయన రెండురోజుల పర్యటనపై దృష్టి సారించింది. ట్రంప్ ప్రతి కదలికను [more]
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు భారత్ లో బ్రహ్మాడమైన ఆతిధ్యం లభించింది. యావత్ దేశం ఆయన రెండురోజుల పర్యటనపై దృష్టి సారించింది. ట్రంప్ ప్రతి కదలికను [more]
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు భారత్ లో బ్రహ్మాడమైన ఆతిధ్యం లభించింది. యావత్ దేశం ఆయన రెండురోజుల పర్యటనపై దృష్టి సారించింది. ట్రంప్ ప్రతి కదలికను నిశితంగా పరీశీలించింది. ఆయన ప్రతి మాటను ప్రత్యేక శ్రద్ధతో ఆలకించింది. సంప్రదాయ వామపక్ష పార్టీలు ఎప్పటిలాగానే అమెరికా అధినేత రాకను నిరసించినప్పటికీ మిగిలిన అన్ని పార్టీలు హర్షించాయి. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యాధిపతి తమకు మేలుచేసే విధంగా వ్యవహరిస్తారని భారత్ ఆశించింది. అమెరికా ప్రయెాజనాలను పరిరక్షించుకుంటునే భారత్ కు మేలు చేస్తారని భావించింది. కానీ ఆచరణలో అలాంటిదేమీ కనపడలేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ట్రంప్ ఫక్తు వ్యాపారవేత్తగా వ్యవహరించారన్నది విమర్శకుల వాదన. దీనిని తోసిపూచ్చడం కష్టమే. ఒక్కసారి వాస్తవాల్టోకి వెళితే ఇది నిజమేనని అనిపించక మానదు.
దాయాది దేశం పట్ల….
ముఖ్యంగా దాయాది దేశమైన పాకిస్తాన్ పట్ల ట్రంప్ అనుసరించిన వైఖరి భారత్ కు ఏమాత్రం మింగుడు పడలేదు. ఉగ్రవాదం పట్ల పాక్ వైకరిని మాటవరసకే ట్రంప్ ఖండించారు తప్ప గట్టి హెచ్చరికలు చేయలేదు. ఇస్లామాబాద్ ఒంటెద్దుపోకడను ఎండగట్టడంలో విఫలమయ్యారన్న అభిప్రాయం దౌత్యవర్గాల్లో ఉంది. ప్రతివిషయానికి రెండుకోణాలు ఉన్నట్లే కశ్మీర్ సమస్యకుా రెండు కోణాలున్నాయని ట్రంప్ పేర్కొనడం ద్వారా భారత్-పాక్ లను ఒకే గాటిన కట్టడం భారత విధాననేతలను దిగ్భ్రాంతి పరిచింది. కశ్మీర్ పై మద్యవర్తిత్వానికి సిద్ధమేనని ప్రకటించడం ద్యారా లేనిపోని పెద్దరికాన్ని తెచ్చిపెట్టుకున్నారు. మద్యవర్తిత్వాన్ని అంగీకరించే ప్రసక్తి లేదని గతంలో భారత్ చేప్పినా మళ్లీ ఈ విషయాన్ని పేర్కొనడం భారత్ కు పుండుమీద కారం రాయడమే అవుతుంది. కశ్మీర్ సమస్యకాదని పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK) ను తిరిగి స్వాధీనం చేసుకోవడమే అసలు లక్షమని భారత్ పదే పదే ప్రకటించినా ‘తగుదునమ్మా’ అంటూ మళ్లీ పాత విషయాన్ని ప్రస్తావించడం అగ్రరాజ్యాధినేత ట్రంప్ అహంకారానికి నిదర్శనం.
ఇస్లామాబాద్ తో…..
ఇక పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో సత్సంభాధాలు ఉన్నాయని చెప్పడం ద్వారా తాను పుార్తిగా మిత్రుడు కాదని భారత్ కు విస్పస్టంగా చెప్పారు. సీమాంతర ఉగ్రవాదాన్ని నిరోదించడానికి ఇస్లామాబాద్ కృషి చేస్తుందనడం ద్వారా ఉగ్రవాదాన్ని వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేశారు. భారత్ గొప్పదనాన్ని, మెాదీ వ్యక్తిత్వాన్ని ఎన్నిసార్లు ప్రశంసించినప్పటికి పాక్ ను, ఇమ్రాన్ ఖాన్ ను పల్లెత్తిమాట అనకపోవడం ద్వారా పాక్ కుాడా తమకు ముఖ్యమైన దేశమేనని, భారత్ కోసం పాకిస్తాన్ ను దుారం చేసుకునే ప్రసక్తి లేదని చెప్పకనే చెప్పారు. భారత్ లో మత స్వేచ్చ, ముస్లింల భద్రత గురించి ఆచితుాచి మాట్లాడారు తప్ప ఎలాంటి సానుకుాల వ్యాఖ్యలు చేయకపోవడం గమనార్హం. పౌరసత్వసవరణ చట్టం (సీఏఏ) భారత్ అంతర్గత విషయమని చెప్పడం ద్వారా దానికి తమ మద్దతు లేదని తేల్చిచెప్పారు. ఈ నేపధ్యంలో ట్రంప్ భారత్ పర్యటనపై పాకిస్థాన్ లో హర్షం వ్యక్తమైంది. ప్రధాని ఇమ్రాన్ తో సహా ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు సైతం మెాదీకి అగ్రరాజ్యాధినేత షాక్ ఇచ్చారని తలంటారని వ్యాఖ్యానించడం విశేషం.
అమెరికా పత్రికలన్నీ…..
భిన్నత్వ, బహుళ విలువలపై మెాదీకి ట్రంప్ చురకలు వేశారని అక్కడి పత్రికలు పేర్కొన్నాయి. ఇస్లామాబాద్ లో స్నేహాన్పి కొనసాగిసామన్న ట్రంప్ వ్యాఖ్యలను పతాకశీర్షికలో ప్రచురించాయి. దేశంలో అతిపెద్ద ఆంగ్ల పత్రిక ‘డాన్’ భారత్ గడ్డపై నిలబడి పాక్ పొగిడిన ట్రంప్ అని హెడ్ లైన్స్ పెట్టింది. అంతేకాక లౌకిక వాదుల విషయంలో భారత్ ప్రధానికి గట్టి హెచ్చరికలు చేశారని పేర్కొంది. పాక్ తో స్నేహం కొనసాగిస్తామన్న ప్రకటనలో ‘ మెతెరా ‘ స్టేడియంలోని లక్షమంది ప్రజలకు మెాదీ షాక్ ఇచ్చారని మరో ఆంగ్ల పత్రిక ‘ దినసెఫ్ ఇంటర్నేషనల్ ‘ వ్యాఖ్యానించింది. ఆర్థిక మాంద్యం రాజకీయ ఇబ్బందులతో సతమతమవుతున్న ఇటీవల ట్రంప్ పర్యటన ‘ జోష్ ‘ కల్పించిందని ఇతర పత్రికలు విశ్లేషించాయి. ట్రంప్ పర్యటన అనంతరం ఇటీవల కార్యాలయంలో బీజేపీ ఉత్సవం చేసుకున్నట్లు కుాడా వార్తలు వచ్చాయి. కేవలం మెాదీ వల్ల రెండు దేశాల సంబంధాలు దెబ్బతిన్నాయని పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిదీ ధ్వజమెత్తారు. బీజేపీ అధికారంలో ఉన్నంతకాలం పరిస్దితి మారదని ఓ మీడియా సంస్దకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వ్యాఖ్యానించారు. భారత్ క్రికెట్ జట్టు చివరిసారిగా 2006 లో పాక్ తో పర్యటించింది. పాక్ జట్టు 2012-13 లో భారత్ లో పర్యటించింది. ఆ తర్వాత ఉభయ జట్ల పర్యటనలు ఆగిపోయాయి. అంతర్జాతీయ వేదికలపై ఆడటం తప్ప ముఖాముఖి పోటీలు లేవు ఇరు దేశాధినేతలు, ప్రజల పరిస్దితి అలానే ఉంది. తటస్ద వేదికలపై తప్ప ఆ యా దేశాల్లో కలుసుకునే పరిస్థితిలేదు. మెుత్తానికి ట్రంప్ పర్యటన పాక్ కు నిరాశ మిగల్చలేదు.
-ఎడిటోరియల్ డెస్క్