ఏపీకి బాబు ఇచ్చిన గిఫ్ట్ ఇదేనట..!
ఆంధ్రప్రదేశ్ లో పట్టు కోసం బిజెపి తిప్పలు పడుతుంది. ఏపీకి ప్రత్యేక హోదాకు మొండి చెయ్యి చూపడంతో రాజకీయ రేసులో కమలం బాగా వెనుకబడింది. ఈ నేపథ్యంలో [more]
ఆంధ్రప్రదేశ్ లో పట్టు కోసం బిజెపి తిప్పలు పడుతుంది. ఏపీకి ప్రత్యేక హోదాకు మొండి చెయ్యి చూపడంతో రాజకీయ రేసులో కమలం బాగా వెనుకబడింది. ఈ నేపథ్యంలో [more]
ఆంధ్రప్రదేశ్ లో పట్టు కోసం బిజెపి తిప్పలు పడుతుంది. ఏపీకి ప్రత్యేక హోదాకు మొండి చెయ్యి చూపడంతో రాజకీయ రేసులో కమలం బాగా వెనుకబడింది. ఈ నేపథ్యంలో తిరిగి ప్రజల్లో తమ పట్ల విశ్వసనీయత కోసం కాషాయ పార్టీ అధిష్టానం నడుం కట్టింది. అందులో భాగంగానే అమిత్ షా ఏపీపై సీరియస్ గా దృష్టి పెట్టారు. ప్రజా చైతన్య బస్సు యాత్రల పేరిట ఆంధ్రప్రదేశ్ కి కేంద్రం చేసిన సాయం చెప్పుకునే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది కమలం. ఈ యాత్రను వాస్తు చూసుకుని శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి మొదలు పెట్టారు బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. ఆయన యాత్ర ప్రారంభాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది టిడిపి క్యాడర్. బిజెపి నేతలు వెనక్కి వెళ్లాలంటూ వారు చేసిన ఆందోళనను అడ్డుకుని పోలీసులు అక్కడి నుంచి వారిని తరలించారు.
మాటల తూటాలు పేల్చిన షా …
ఏపీకి ఏమి చేయలేదని టిడిపి ఆరోపిస్తుంది. కానీ మెం చేసిన పనులు ఇవిగో అంటూ చిట్టా విప్పేశారు అమిత్ షా. కేంద్ర విద్య సంస్థల నుంచి, సాగునీటి ప్రాజెక్ట్ లు, గ్రామీణ అభివృద్ధికి ఇచ్చిన నిధులు ఇలా వరుసగా అన్ని చెప్పుకుంటూ వచ్చారు. కేంద్రంలోని మోడీ ఏపీ అభివృద్ధికి అన్ని ఇస్తుంటే చంద్రబాబు మాత్రం ప్రజలకు ఇచ్చింది లోకేష్ ను మాత్రమేనంటూ ఎద్దేవా చేశారు షా. టిడిపి సర్కార్ అవినీతిలో కూరుకుపోయిందని అందుకే బిజెపి పై బురదజల్లే కార్యక్రమం మొదలు పెట్టిందని ఆరోపించారు. బిజెపి కార్యకర్తలు కేంద్రం చేసిన సాయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు షా. ఏపీలో షా పర్యటనతో కాషాయదళంలో జోష్ మొదలైంది. మరి బిజెపి అధినేత పర్యటన ఏ మేరకు పార్టీకి మేలు చేస్తుందో చూడాలి.