షా మాట తప్పారట
తెలంగాణలో పార్టీని బలోపేతం చేస్తామని, అన్ని విధాలుగా కేంద్ర పార్టీ మద్దతిస్తుందని అప్పట్లో పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షా మాట ఇచ్చారు. అయితే ఆ [more]
తెలంగాణలో పార్టీని బలోపేతం చేస్తామని, అన్ని విధాలుగా కేంద్ర పార్టీ మద్దతిస్తుందని అప్పట్లో పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షా మాట ఇచ్చారు. అయితే ఆ [more]
తెలంగాణలో పార్టీని బలోపేతం చేస్తామని, అన్ని విధాలుగా కేంద్ర పార్టీ మద్దతిస్తుందని అప్పట్లో పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షా మాట ఇచ్చారు. అయితే ఆ పదవి నుంచి దిగిపోయినా అమిత్ షా మాత్రం మాట నిలబెట్టుకోలేదంటున్నారు బీజేపీ నేతలు. కేంద్ర మంత్రులు పదిహేను రోజులకొకసారి రాష్ట్రానికి వచ్చి పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారని అమిత్ షా చెప్పారు. కానీ రాష్ట్రానికి వస్తున్న కేంద్ర మంత్రులు పార్టీ కార్యాలయం వైపు కూడా చూడకపోతుండటంతో రాష్ట్ర నేతలు కేంద్ర నాయకత్వానికి మంత్రులపై ఫిర్యాదు చేయాలన్న యోచనలో ఉన్నారు.
దిశానిర్దేశం చేసి…..
తెలంగాణలో బీజేపీ బలపడేందుకు అవకాశాలున్నాయి. అధికారంలోకి వచ్చేందుకు కూడా కొద్దోగోప్పో పరిస్థితులున్నాయి. అది గమనించే అమిత్ షా తెలంగాణ పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఓట్ షేర్ టార్గెట్ గా పనిచేేయాలని బీజేపీ రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలను కూడా తీసుకోవాలని సూచించారు. ఇందుకు కేంద్ర నాయకత్వం పూర్తి మద్దతు ఇస్తుందని భరోసా ఇచ్చారు.
నాలుగు స్థానాలిచ్చినా….
అందుకే అమిత్ షా తెలంగాణలో తొలి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని నేతల్లోనూ, క్యాడర్ లోనూ ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంతో పాటు తెలంగాణలో అధికార పార్టీ తప్పువు వెతికిపట్టుకుని తమకు తెలియజేయాలని కూడా సూచించారు. ఈమేరకు తెలంగాణ బీజేపీ నేతలు కొద్దో గొప్పో కష్టపడ్డారు. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో నాలుగు సీట్లు సాధించి పెట్టారు.
కేంద్ర మంత్రులు మాత్రం…..
అయితే తెలంగాణకు వివిధ కార్యక్రమాల కోసం వస్తున్న కేంద్ర మంత్రులు మాత్రం పార్టీ కార్యాలయం వైపు చూడటం లేదట. కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, గజేంద్ర షెకావత్, ధర్మేంద్ర ప్రదాన్, ముక్తార్ అబ్సాస్ నఖ్వీ వంటి నేతలు తెలంగాణకు వచ్చినా పార్టీ కార్యాలయం వైపు రావడం లేదు. దీంతో మరోసారి అమిత్ షాతో పాటు జాతీయ అధ్యక్షుడు నడ్డాకు ఫిర్యాదు చేయాలని రాష్ట్ర నేతలు నిర్ణయించారట. అమిత్ షా చెప్పినా కేంద్ర మంత్రులు పార్టీ కార్యాలయానికి రాకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.