మంత్రిగా ఓకేనా? అందుకే ఆయన ఫెయిలయ్యారా?
అంజాద్ బాషా. రాష్ట్ర మైనారిటీ శాఖ మంత్రిగా ఆయన కీలక పదవిలో ఉన్నారు. కడప జిల్లా కడప నియోజకవర్గం నుంచి విజయం సాధించిన అంజాద్ భాషాకు వైసీపీ [more]
అంజాద్ బాషా. రాష్ట్ర మైనారిటీ శాఖ మంత్రిగా ఆయన కీలక పదవిలో ఉన్నారు. కడప జిల్లా కడప నియోజకవర్గం నుంచి విజయం సాధించిన అంజాద్ భాషాకు వైసీపీ [more]
అంజాద్ బాషా. రాష్ట్ర మైనారిటీ శాఖ మంత్రిగా ఆయన కీలక పదవిలో ఉన్నారు. కడప జిల్లా కడప నియోజకవర్గం నుంచి విజయం సాధించిన అంజాద్ భాషాకు వైసీపీ అధినేత జగన్ మంచి ప్రాధాన్యం ఇచ్చారు. గడచిన ఐదేళ్ల కాలంలో మైనార్టీ శాఖ లేకుండానే అప్పటి సీఎం చంద్రబాబు గడిపేశారు. అయితే, జగన్ మా త్రం.. తాను అధికారంలోకి వస్తూనే.. మైనార్టీ శాఖను ఏర్పాటుచేయడంతోపాటు..మంత్రిగా తన సొంత జిల్లాకు చెంది న అంజాద్ భాషా నే నియమించారు. అంతేకాదు.. డిప్యూటీ సీఎంగా కూడా ఆయనకు మంచి ప్రమోషన్ ఇచ్చారు. ఇప్పుడు ఏడాది పూర్తయింది. మరి అంజాద్ బాషా ప్రోగ్రెస్ ఎలా ఉంది ? ఆయన ఏ మేరకు అంచనాలు అందుకున్నారో ? చూద్దాం.
జగన్ సొంత జిల్లాకావడంతో…
మంత్రిగా అంజాద్ భాషా విజయం సాధించారు. మైనార్టీ వర్గాన్ని ప్రభుత్వం వైపు తిప్పడంలో అంజాద్ భాషా పూర్తిగా సక్సెస్ అయ్యారు. అయితే ఈ సక్సెస్ అంతా కేవలం కడప జిల్లాకు మాత్రమే పరిమితం. అయితే మంత్రిగా వ్యూహాత్మకంగా వ్యవహరించడంలో మాత్రం ఆయన ముందుకు వెళ్లలేక పోయారనేది కీలక విమర్శ. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను మైనార్టీ వర్గాల్లోకి తీసుకు వెళ్లడంలోనూ సక్సెస్ అయ్యారు. అయితే, సొంత జిల్లాలో మాత్రం ఆయనకు పార్టీపై పట్టు లభించ లేదనేది విమర్శ. చివరకు ఆయన ఎమ్మెల్యేగా కడపలోనూ ఆయన మాట నెగ్గే పరిస్థితి లేదని జిల్లా రాజకీయ వర్గాల్లో వినిపించే టాక్.. ? సీఎం జగన్కు కూడా సొంత జిల్లా కావడంతో మంత్రి తన పనేదో తాను చేసుకునిపోవాల్సిన పరిస్థితి ఉంది.
వివాద రహితంగా…..
అభివృద్ధి విషయంలో మైనార్టీ వర్గానికి ప్రాధాన్యం ఇస్తూనే.. వివాద రహితంగా ముందుకు సాగుతున్నారు. ప్రతి ఒక్కరికీ చేరువ అయ్యేలా.. మైనార్టీ వర్గ అసంతృప్తులను పరిష్కరించేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అయితే, ఈ క్రమంలో సొంత పార్టీ నేతలను కలుపుకొని పోవడం లేదని తెలుస్తోంది. పార్టీలో మంత్రిపై అసంతృప్తి ఎక్కువే ఉంది. పైగా కడప జిల్లాలో కీలకమైన నాయకులు ఉండడం.. వారిని దాటి తన ఆధిపత్యం ప్రదర్శించే లక్షణం లేకపోవడం.. వంటివి అంజాద్ భాషాకు మైనస్ అయినా.. పార్టీలో ఆయనకు ఇవే బలమనే వర్గం కూడా ఉంది. అయితే మంత్రిగా రాష్ట్ర స్థాయిలోనూ, జిల్లా స్థాయిలోనూ ఆయన అంజాద్ భాషా, పార్టీ తరపున బలమైన వాయిస్ అయితే మాత్రం వినిపించడం లేదు. మొత్తంగా చూస్తే.. ఈ ఏడాది కాలంలో మైనార్టీ వర్గాల తరఫున ప్రభుత్వానికి, ప్రభుత్వం నుంచి మైనార్టీ వర్గానికి కూడా వారధిలా ఉంటూ ఆయన తన పని తాను చేసుకు వెళుతున్నారు. అదే టైంలో ఆయన నుంచి ఎలాంటి సంచలనాలు కూడా లేవు.