అక్కడ గట్టి దెబ్బె తగిలేలా ఉందే …?
అమరావతి లోనే రాజధాని ఉండాలి అనేది టిడిపి తో సహా కొన్ని పక్షాల మద్దతు తో నడుస్తున్న ఉద్యమం. ఇక దీనికి కౌంటర్ గా ఇప్పుడు ఉత్తరాంధ్ర, [more]
అమరావతి లోనే రాజధాని ఉండాలి అనేది టిడిపి తో సహా కొన్ని పక్షాల మద్దతు తో నడుస్తున్న ఉద్యమం. ఇక దీనికి కౌంటర్ గా ఇప్పుడు ఉత్తరాంధ్ర, [more]
అమరావతి లోనే రాజధాని ఉండాలి అనేది టిడిపి తో సహా కొన్ని పక్షాల మద్దతు తో నడుస్తున్న ఉద్యమం. ఇక దీనికి కౌంటర్ గా ఇప్పుడు ఉత్తరాంధ్ర, రాయలసీమ ల నుంచి పోటీ ఉద్యమాలు రూపుదిద్దుకున్నాయి. అవి కూడా పోటా పోటీగా సాగుతున్నాయి. ఈ ఉద్యమాల వెనుక సహజంగానే అధికారపార్టీ హస్తం ఉంటుందన్నది అందరికి తెలిసిందే. మొత్తానికి ఈ ఉద్యమాల వెనుక అధికారపార్టీ ఉన్నా విపక్ష పార్టీలు నడిపిస్తున్నా నేతలకు మాత్రం తలపోట్లు తప్పడం లేదు. తమ తమ ప్రాంతాల ప్రజల గొంతుక వినిపించకపోతే ఎన్నికల సమయంలో చుక్కలు కనిపిస్తాయన్నది వారి ఆందోళన.
అడకత్తెరలో పోక చెక్కలా …
విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా వైసిపి సర్కార్ చేయాలని డిసైడ్ అయ్యింది. దీనికి ఎస్ అంటే అధిష్టానం తో నో అంటే స్థానికంగా ఇబ్బంది ఎదురౌతుందని ఆ ప్రాంత ఎమ్యెల్యే వాసుపల్లి గణేష్ మధ్యే మార్గాన్ని ఎంచుకున్నారు. ఆయన విశాఖ లో రాజధాని కి సమ్మతిస్తూనే అమరావతి లో రైతులు నష్టపోకూదంటూ స్టాండ్ తీసుకున్నారు. వాసుపల్లి డబుల్ స్టాండ్ గుంటూరు తమ్ముళ్ళకు కోపం తెప్పించడంతో ఆయన గతంలో మహానాడు లో అమరావతి లోనే రాజధాని ఉండాలంటూ మాట్లాడిన వీడియో బయటకు తీసి సోషల్ మీడియా లో వైరల్ చేశారు. దాంతో గణేష్ దీనిపై స్థానిక ప్రజలకు సమాధానం చెప్పుకోవాలిసి వచ్చింది. అది ఇప్పుడు మాట్లాడింది కాదని ఎప్పటిదో పాతది కావాలనే కొందరు ఇలా చేశారంటూ జనం ముందు వాపోతున్నారు వాసుపల్లి గణేష్. అయితే ఆయనకు ఈ విషయంలో జరగాలిసిన డ్యామేజ్ ఎలాగు జరిగిపోయింది. గణేష్ పరిస్థితినే ఇప్పుడు ఉత్తరాంధ్ర లో తమ్ముళ్లు ఫేస్ చేస్తున్నారు. వీరిని ఎలా ఊరడించాలో కూడా టిడిపి అధిష్టానానికి అర్ధం కాని సమస్యగా మారిందంటున్నారు.
దారి చూపాలంటున్న తమ్ముళ్ళు …
ఇప్పటికే విశాఖలో టిడిపి మాజీ ఎమ్యెల్యేలు ఇతర సీనియర్ నేతలు ఫ్యాన్ పార్టీ బాట పడుతున్నారు. విశాఖ ను జగన్ రాజధాని చేసి అభివృద్ధి చేస్తారనే కారణాన్ని అధిష్టానం ముందు పెడుతూ చంద్రబాబు కు చుక్కలు చూపించేస్తున్నారు. దాంతో ఇకపై మూడు కళ్ళ విధానంతో సరికొత్త వ్యూహాన్ని చంద్రబాబు తయారు చేసి తమ్ముళ్ళ చేతిలో పెట్టకపోతే మాత్రం టిడిపి గ్రౌండ్ మొత్తం ఖాళీ అయ్యే పరిస్థితి ఎదురౌతుందంటున్నారు వైసిపి వర్గాలు. ఎదో కారణంతో అధికారపార్టీ లోకి లాగాలి కనుక ఇంతకన్నా మంచి తరుణం ఏముందంటూ విపక్ష నేతలకు ఆహ్వానాలు పలుకుతున్నారు. ప్రస్తుతానికి కోర్టు లో వివాదం నానుతుంది కానీ అది లేకుండా క్యాపిటల్ షిఫ్ట్ అయితే మాత్రం టిడిపి రెండు ప్రాంతాల్లో తీవ్రస్థాయిలో నేతలను వదులుకోక తప్పదంటున్నారు విశ్లేషకులు.