ఆనంకు రెండేళ్ల తర్వాత గాని అర్ధం కాలేదట
వైసీపీ సీనియర్ నేత ఆనం రామనారాయణరెడ్డి ఇక పూర్తిగా ఆశలు వదులుకున్నట్లే కన్పిస్తుంది. మంత్రి వర్గ విస్తరణలో తనకు ఛాన్స్ దక్కే అవకాశాలు లేవని ఆయనకు తెలిసిపోయింది. [more]
వైసీపీ సీనియర్ నేత ఆనం రామనారాయణరెడ్డి ఇక పూర్తిగా ఆశలు వదులుకున్నట్లే కన్పిస్తుంది. మంత్రి వర్గ విస్తరణలో తనకు ఛాన్స్ దక్కే అవకాశాలు లేవని ఆయనకు తెలిసిపోయింది. [more]
వైసీపీ సీనియర్ నేత ఆనం రామనారాయణరెడ్డి ఇక పూర్తిగా ఆశలు వదులుకున్నట్లే కన్పిస్తుంది. మంత్రి వర్గ విస్తరణలో తనకు ఛాన్స్ దక్కే అవకాశాలు లేవని ఆయనకు తెలిసిపోయింది. జరుగుతున్న పరిణామాలు, అధికారులు, మంత్రులు తనకు సహాయ నిరాకరణ చేయడం ఇందుకు సంకేతాలుగా ఆనం రామనారాయణరెడ్డి భావిస్తున్నారు. అందుకే ఆయన ఇక తన భవిష్యత్ కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
వైసీపీలో చేరికతో….
ఆనం రామనారాయణరెడ్డి సీనియర్ నేత. ఆయన ఎన్నికలకు ముందు వైసీపీలో చేరడంతో పార్టీకి హైప్ వచ్చిందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన కూడా వైసీపీ అధిష్టానం ఆదేశాలకు తలొగ్గి తనకు పట్టున్న ఆత్మకూరు నియోజకవర్గాన్ని వదిలిపెట్టి వెంకటగిరి వెళ్లి విజయం సాధించారు. అయితే గెలిచిన నాటి నుంచి ఆనం రామనారాయణరెడ్డికి ఏమాత్రం సంతృప్తి కరంగా లేదు. తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొనలేదని ఆనం రామనారాయణరెడ్డి చెబుతున్నారు.
అధికారంలో ఉన్నా…..
ఆనం రామనారాయణరెడ్డి అపోజిషన్ లో లేరు. అధికార పార్టీ ఎమ్మెల్యేనే. అయితే ఆయన వయసుకు, అనుభవానికి తగిన గౌరవం ఇవ్వడం లేదన్నది ఆయన బాధ. దీనికి కారణం 2014 నుంచి 2018 వరకూ ఆనం కుటుంబం వైఎస్ జగన్ పై చేసిన మాటల దాడిని పార్టీకి చెందిన మంత్రులు పరిగణనలోకి తీసుకుంటున్నారు. ముఖ్యంగా మరణించిన దివంగత ఆనం వివేకానందరెడ్డి జగన్ పై నిత్యం అనరాని మాటలతో సెటైరికల్ గా విరుచుకుపడేవారు. ఇవన్నీ వైసీపీ మంత్రులు పదే పదే పార్టీ హైకమాండ్ కు గుర్తు చేస్తుండటంతో ఆనం రామనారాయణరెడ్డిని దూరం పెడుతున్నారన్న టాక్ బలంగా ఉంది.
భవిష్యత్ లేదని…..
ఇక వైసీపీ లో తనకు విలువ ఉండదని ఆనం రామనారాయణరెడ్డి రెండేళ్ల తర్వాత గ్రహించినట్లుంది. అందుకే ఆయన ఇప్పుడిప్పుడే వెంకటగిరితో పాటు ఆనం కుటుంబానికి పట్టున్న నెల్లూరు టౌన్, ఆత్మకూరు నియోజకవర్గాల్లో సయితం తన గ్రూపును బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నారట. ఇందుకోసం నెల్లూరు టౌన్ ఆనం వివేకా కుమారుడు రంగమయూర్ రెడ్డి చేత కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. త్వరలోనే ఆత్మకూరు నియోజకవర్గంపై కూడా ఆనం రామనారాయణరెడ్డి దృష్టి పెడతారంటున్నారు. మొత్తం మీద రెండేళ్లకు గాని ఆనం రామనారాయణరెడ్డి అసలు విషయం తెలిసిరాలేదంటున్నారు.