ఆనం ఆధిపత్యానికి…?
విషయం ఏదైతేనేం.. రాజకీయాలు చోటు చేసుకుంటే.. వేడెక్కకుండా ఉంటుందా? ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. నెల్లూరులోనే అతి పెద్ద, పురాతన విద్యాసంస్థగా పేరు తెచ్చుకుంది వీఆర్ (వెంకటగిరి [more]
విషయం ఏదైతేనేం.. రాజకీయాలు చోటు చేసుకుంటే.. వేడెక్కకుండా ఉంటుందా? ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. నెల్లూరులోనే అతి పెద్ద, పురాతన విద్యాసంస్థగా పేరు తెచ్చుకుంది వీఆర్ (వెంకటగిరి [more]
విషయం ఏదైతేనేం.. రాజకీయాలు చోటు చేసుకుంటే.. వేడెక్కకుండా ఉంటుందా? ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. నెల్లూరులోనే అతి పెద్ద, పురాతన విద్యాసంస్థగా పేరు తెచ్చుకుంది వీఆర్ (వెంకటగిరి రాజా) విద్యాసంస్థ. దాదాపు 144 ఏళ్ల ఘన చరిత్రను సొంతం చేసుకుంది. వెంకటగిరి రాజులు ఏర్పాటు చేసిన సంస్థ కావడంతో ఇప్పటికీ వారి పేరుతోనే ఈ విద్యాసంస్థ కార్యకలాపాలు సాగుతున్నాయి. అయితే, దీనికి, సీనియర్ రాజకీయ కుటుంబం ఆనం ఫ్యామిలీకి మంచి అవినాభావ సంబంధాలు ఉన్నాయి. దివంగత ఆనం వివేకానందరెడ్డి.. ఈ విద్యాసంస్థలకు చైర్మన్‌గా చాలా ఏళ్లు వ్యవహరించారు.
ఆనం ఫ్యామిలీదే…..
ఒక రకంగా ఈ విద్యాసంస్థను ఆనం ఫ్యామిలీ ప్రెస్టేజ్ ఇష్యూగాను, ఆర్థిక వనరుగాను మార్చుకున్న విషయం నిజం. అయితే, చంద్రబాబు హయాంలో ఇక్కడ నుంచి మంత్రిగా ఎంపికైన నారాయణ విద్యాసంస్థల అధి నేత నారాయణ ఈ విద్యాసంస్థల విషయాన్ని తెరమీదికి తెచ్చారు. ఆనం వర్గాన్ని బలహీన పరిచేందుకు అప్పట్లో ఆయన అనేక ప్రయోగాలు చేశారు. దీంతో ఈ విద్యాసంస్థ వ్యవహారాలపై తీవ్ర దుమారం రేగింది. ఇక్కడ చదివిన కొందరు ఈ విద్యాసంస్థ పాలక వర్గంపై కోర్టుకు వెళ్లారు. పూర్వ విద్యార్థులు ఆనం పెత్తనంపై అత్యున్నత ధర్మాసనం వరకు వెళ్ళి విజయం సాధించారు. వి.ఆర్.విద్యాసంస్థలకు పాత పాలక వర్గాన్ని రద్దు చేసింది కోర్టు. జాయింట్ కలెక్టర్‌ను ప్రత్యేక అధికారిగా నియమించింది.
పూర్వ విద్యార్థులు కూడా….
వి.ఆర్. విద్యా సంస్థల నూతన యాజమాన్యం కోసం ఎన్నికలు జరపాలని గత ఏడాది క్రితం సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చిన నేపథ్యంలో కసరత్తు మొదలైంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికలకు ముందు వి.ఆర్.కళాశాల నూతన పాలకవర్గం కోసం జిల్లా యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. పూర్వ విద్యార్థులు ఓటర్లుగా సభ్యత్వాలకు ఆదేశాలిచ్చింది. ఈ క్రమంలోనే సార్వత్రిక ఎన్నికలు రావడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. ఇదే సమయంలో జిల్లా అధికారులు పదేపదే మారడంతో ఎన్నికల క్రతువు మధ్యలోనే ఆగిపోయింది. దీంతో వి.ఆర్. విద్యాసంస్థల ఆర్థిక వ్యవహారాలు, కళాశాల పురోభివృద్ధికి అవాంతరాలు మొదలయ్యాయి.
ఆనం పెత్తనంపై…..
ఈ నేపథ్యంలో ఆ కళాశాల కోసం ఆది నుంచి ఆనం కుటుంబానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రస్తుత రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి రంగంలోకి దిగారు.అంతేకాదు, మరో మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మె ల్యే అనిల్ కుమార్ కూడా దీనిపై దృష్టి పెట్టారు. ఆనం ఆధిపత్యానికి తెరదించాలని ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఈ ఇద్దరు నాయకులు కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యా సంస్థలకు పూర్వవైభవం తెస్తాం. ఇందులో ఎవరి ప్రమేయాలు ఉండబోవు. ఎవరికి భయపడాల్సిన పనిలేదు అంటూ పరోక్షంగా మాజీ పాలక వర్గాన్ని ఉద్దేశిస్తూ కామెంట్లు చేశారు.
ఎమ్మెల్యే… మంత్రి కలసి…..
మరోవైపు వి.ఆర్.విద్యాసంస్థలపై ఇప్పటి వరకు ఉన్న పెత్తనాలను సహించం. కొత్త యాజమాన్యంతో కళాశాలను అభివృద్ధి చేస్తాం. ఈ కళాశాల పూర్వ విద్యార్థిగా తమ వంతు సహకారాన్ని అందిస్తానంటూ పాత పాలక వర్గంపై ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పరోక్ష విమర్శలు చేశారు. అదేవిధంగా మంత్రి అనిల్ కూడా రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ప్రక్షాళనకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారని, ఈ క్రమంలో వీఆర్ విద్యాసంస్థను కూడా రాజకీయాలకు అతీతంగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఇక్కడ ఎలాంటి రాజకీయ కార్యకలాపాలకు తావివ్వబోమని అన్నారు. దీంతో ఇప్పుడు ఆనం రామనారాయణరెడ్డి ఒకరకంగా ఒంటరి అయ్యారనే వ్యాఖ్యలకు బలం చేకూరుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇక జిల్లా వైసీపీలో ఉన్న రాజకీయ ఆధిపత్య పోరులో భాగంగా జూనియర్‌గా ఉన్న అనిల్‌కు మంత్రి పదవి రావడంతో ఆనంతో పాటు కొందరు సీనియర్ ఎమ్మెల్యేలకు రుచించడం లేదు. వీరు అనిల్‌ను పట్టించుకోకుండా టార్గెట్ చేసేలా వ్యవహరిస్తుండడంతో ఇటు అనిల్ సైతం తన సత్తా ఏంటో చూపిస్తూ ఆనంకు చెక్ పెట్టే ఏ విషయాన్ని వదులుకోవడం లేదు.