ఆనం డిసైడ్ అయిపోయారా?
సీనియర్ నేత ఆనం రామనారాయణరెడ్డి డిసైడ్ అయినట్లే కన్పిస్తుంది. తనలో పార్టీపై ఉన్న అసంతృప్తి జిల్లా పేరుతో బయటపడినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యలను జగన్ [more]
సీనియర్ నేత ఆనం రామనారాయణరెడ్డి డిసైడ్ అయినట్లే కన్పిస్తుంది. తనలో పార్టీపై ఉన్న అసంతృప్తి జిల్లా పేరుతో బయటపడినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యలను జగన్ [more]
సీనియర్ నేత ఆనం రామనారాయణరెడ్డి డిసైడ్ అయినట్లే కన్పిస్తుంది. తనలో పార్టీపై ఉన్న అసంతృప్తి జిల్లా పేరుతో బయటపడినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యలను జగన్ సీరియస్ గా తీసుకున్నా ప్రస్తుతానికి ఆయన వ్యాఖ్యలపై ఎలాంటి చర్యలు తీసుకునే వీలు లేదు. నిజానికి ఆనం రామనారాయణరెడ్డి సీనియర్ నేతగా ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సింది కాదు. తాను అనుకున్న విషయాన్ని అధినేతనోనైనా, సీనియర్లతోనైనా చర్చించి ఉంటే బాగుండేది.
ఎన్నికలకు ముందు మాత్రమే….
ఆనం రామనారాయణరెడ్డి 2019 ఎన్నికలకు ముందు మాత్రమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. అప్పటి వరకూ ఆనం రామనారాయణరెడ్డి టీడీపీలోనే ఉన్నారు. కాంగ్రెస్ లో దీర్ఘకాలం కొనసాగిన ఆనం రామనారాయణరెడ్డి 2914 ఎన్నికల తర్వాత అధికార పార్టీ వైపే చూశారు. టీడీపీలో కూడా ఆనం రామనారాయణరెడ్డి ఎమ్మెల్సీ పదవిని ఆశించారు. ఆయన సోదరుడు ఆనం వివేకానందరెడ్డి సయితం పదవిని ఆశించారు. కానీ నాలుగేళ్ల పాటు చంద్రబాబు ఆనం రామనారాయణరెడ్డి కుటుంబాన్ని పెద్దగా పట్టించుకోలేదు.
ఎన్ని వ్యాఖ్యలు చేసినా….
దీంతో ఎన్నికలకు ముందు ఆనం రామనారాయణరెడ్డి టీడీపీని వీడి వైసీపీలో చేరిపోయారు. ఆనం వివేకానందరెడ్డి బతికున్నప్పుడు జగన పైన హార్ష్ కామెంట్స్ చేసినప్పటికీ జగన్ వాటిని పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఆనం రామనారాయణరెడ్డి తనకు ఆత్మకూరు నియోజకవర్గం టిక్కెట్ కావాలని పట్టుబట్టినా జగన్ అంగీకరించలేదు. అంతేకాకుండా వెంకటగిరి నియోజకవర్గం టిక్కెట్ ఇచ్చారు. అక్కడ నేదురుమిల్లి జనార్థన్ రెడ్డి కుమారుడు ఉన్నప్పటికీ ఆయన టిక్కెట్ ఇవ్వకుండా ఆనం రామనారాయణరెడ్డికే ప్రాధాన్యత ఇచ్చారు.
అదే కారణమా?
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆనం రామనారాయణరెడ్డి మంత్రి పదవి పై ఆశలు పెంచుకున్నారు. అయితే జగన్ ప్రతి జిల్లాల్లో ఎంపిక చేసినట్లే నెల్లూరు జిల్లా విషయంలోనూ ఆనం రామనారాయణరెడ్డిని పక్కన పెట్టారు. బీసీ కోటాలో అనిల్ కుమార్ కు, పార్టీ కోసం త్యాగం చేసిన మేకపాటి రాజమోహన్ రెడ్డి కుమారుడు గౌతం రెడ్డికి మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. దీంతో ఆనం రామనారాయణరెడ్డిలో గత ఆరు నెలలుగా ఉన్న అసంతృప్తి ఒక్కసారిగా బయటపడిందంటున్నారు. మొత్తం మీద ఆనం రామనారాయణరెడ్డి ఎపిసోడ్ కు జగన్ షోకాజ్ నోటీసుతో సరిపెడతారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.