ఈయనతో మా గొప్ప చిక్కొచ్చిపడిందిగా…?
ఆంధ్రా ఒడిషా బోర్డర్ ఎపుడూ వివాదమే. ఒడిషా వారు ఎపుడూ కూడా అవన్నీ తమ ప్రాంతాలే అని క్లెయిమ్ చేస్తూ ఉంటారు. మరో వైపు చూస్తే ఏపీ [more]
ఆంధ్రా ఒడిషా బోర్డర్ ఎపుడూ వివాదమే. ఒడిషా వారు ఎపుడూ కూడా అవన్నీ తమ ప్రాంతాలే అని క్లెయిమ్ చేస్తూ ఉంటారు. మరో వైపు చూస్తే ఏపీ [more]
ఆంధ్రా ఒడిషా బోర్డర్ ఎపుడూ వివాదమే. ఒడిషా వారు ఎపుడూ కూడా అవన్నీ తమ ప్రాంతాలే అని క్లెయిమ్ చేస్తూ ఉంటారు. మరో వైపు చూస్తే ఏపీ మావి అంటుంది. కానీ ఈ వివాదాలకు ఎపుడూ తెరపడదు, ఇక 1950లో శ్రీకాకుళం జిల్లా ఏర్పడింది. అప్పటికి కొన్ని ప్రాంతాలను ఒడిషాకు వదిలేసుకుంది. ఇక శ్రీకాకుళం నుంచి కొంత, విశాఖ నుంచి మరికొంత ప్రాంతాలతో విజయనగరం జిల్లా తరువాత కాలంలో ఏర్పడింది. ఇక చూస్తే ఒడిషాతో ఈ రెండు జిల్లాలకు సరిహద్దు సమస్యలు అలా వస్తూనే ఉన్నాయి.
రావద్దు అంటున్నారుగా…
ఆంధ్రా ఒడిషా సరిహద్దులలో కొటియా గ్రామాలు కొన్ని ఉన్నాయి. ఈ గ్రామాలు రెండు ప్రాంతాల మధ్య ఉన్నాయి. దాంతో ఈ ప్రాంతాలు మావి అంటే మావి అని రెండు రాష్ట్రాలు మధ్య తగవు అలా దశాబ్దాల తరబడి కొనసాగుతోంది. గట్టిగా చెప్పాలంటే స్వాతంత్రానికి ముందు కూడా ఈ గొడవ ఉంది. ఈ నేపధ్యంలో తాజాగా ఈ గ్రామాలకు వెళ్లిన వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే రాజన్న దొరకు అక్కడ పోలీసులు నో ఎంట్రీ బోర్డు చూపినారుట. మా వైపు రావద్దు అంటూ వెనక్కి పంపేశారుట. దీంతో మరో మారు ఈ వివాదం తెరపైకి వచ్చింది.
ఓటర్లుగా ఉన్నా …
చిత్రమేంటి అంటే ఈ కొటియా గ్రామాల వారు ఏపీకి ఓటర్లుగానే ఉన్నారు. తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ వారు ఏపీలో ఓట్లు వేశారు. ఇక ఈ గ్రామాలు ఎవరికి చెందుతాయి అన్న దాని మీద సుప్రీం కోర్టు దాకా ఒడిషా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు వెళ్ళినా వ్యవహరాం తేలలేదు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుని సమస్యను పరిష్కరించుకోవాలని కోర్టులు కూడా సూచించాయి. కానీ ఇప్పటికి అటూ ఇటూ ఎందరో సీఎంలు మారినా కూడా ఎవరూ చొరవ తీసుకోవడంలేదు. దాంతో వారి విషయంలో ఏపీ ఏమీ చేయలేకపోతోంది.
ఎమ్మెల్యేకి అవమానమే..?
వారు తెలుగు మాట్లాడుతారు, ఏపీకి దగ్గరగా ఉన్నారు. వారి ఓట్లు కూడా ఇటు ఉన్నాయి. దాంతో వారికి సంక్షేమ పధకాలు అమలు చేయాలని సాలూరు ఎమ్మెల్యే వెళ్తే మాత్రం అధికారులు అడ్డుకుంటున్నారు. ఇక ఒడిషాలో నవీన్ పట్నాయక్ జగన్ పట్ల సానుకూలంగానే ఉన్నారు. జగన్ సైతం వంశధార ప్రాజెక్ట్ వివాదాలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి తేల్చుకుంటానని అధికారులతో అప్పట్లో చెప్పారు. మరి ఈ సరిహద్దు గ్రామాల విషయాలను కూడా జగన్ చర్చించి వారిని ఏపీకి చెందేలా చేస్తే బాగుంటుందని అంటున్నారు. వారు తమ వారే అంటున్నా కూడా ఒడిషా వైపు నుంచి పెద్దగా అభివృద్ధి లేదని కొటియా గ్రామస్తులు మధనపడుతున్నారు. పాలానాపరంగా ఏపీకి దగ్గరగా ఉన్న ఈ ప్రాంతాలను ఈ వైపుగానే కలిపేందుకు జగన్ కృషి చేయాలని కోరుతున్నారు. ఇదే విషయం ముఖ్యమంత్రితో చర్చిస్తాను అని అంటున్నారు ఎమ్మెల్యే రాజన్న దొర.