ఆ తప్పు మాత్రం చేయరట
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రణాళికబద్ధంగా ముందుకు వెళుతున్నారు. చంద్రబాబు చేసిన తప్పు తాను చేయకూడదని వైఎస్ జగన్ భావించినట్లుంది. అందుకే అధికారంలోకి వచ్చిన ఆయన వివిధ [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రణాళికబద్ధంగా ముందుకు వెళుతున్నారు. చంద్రబాబు చేసిన తప్పు తాను చేయకూడదని వైఎస్ జగన్ భావించినట్లుంది. అందుకే అధికారంలోకి వచ్చిన ఆయన వివిధ [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రణాళికబద్ధంగా ముందుకు వెళుతున్నారు. చంద్రబాబు చేసిన తప్పు తాను చేయకూడదని వైఎస్ జగన్ భావించినట్లుంది. అందుకే అధికారంలోకి వచ్చిన ఆయన వివిధ కార్యక్రమాలతో బిజీగా ఉన్నప్పటికీ పార్టీ కార్యక్రమాలపై కూడా దృష్టిపెట్టాలని నిర్ణయించారు. గత ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ఓటమికి ప్రధాన కారణం ఆయన గడచిన ఐదేళ్లూ క్యాడర్ ను, పార్టీని పట్టించుకోకపోవడమే. అయితే జగన్ ఆ తప్పు చేయదలచుకోలేదట.
పార్టీ కార్యక్రమాలపై…..
పార్టీ కార్యక్రమాలు వేగవంతం చేయాలని వైఎస్ జగన్ నిర్ణయించారు. ఇప్పటికే తాడేపల్లి లోని వైఎస్ జగన్ నివాసం పక్కనే వైఎస్సార్ కాంగ్రెస పార్టీ సెంట్రల్ కార్యాలయం సిద్ధంగా ఉంది. ఈ కార్యాలయంలో జిల్లాల వారీగా పార్టీ సమావేశాలను నిర్వహించాలని వైఎస్ జగన్ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని ఆదేశించారు. జగన్ అమెరికా పర్యటన తర్వాత జిల్లాల వారీగా పార్టీ సమావేశాలు ఉంటాయని పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం
విజయసాయికి బాధ్యతలు….
వైఎస్ జగన్ స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీ నేతలతో సమావేశాలను ఏర్పాటు చేయనున్నారు. అనేక జిల్లాల్లో నాయకత్వ మార్పును కూడా వైఎస్ జగన్ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. కొన్ని చోట్ల పార్టీ ఇప్పటికే బలహీనంగా ఉంది. రాయలసీమ మినహాయించి మిగిలిన అన్ని ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ కూడా బలంగా ఉంది. ఈ నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లో వైసీపీ బలపడాలంటే నాయకత్వ మార్పు అవసరమని వైఎస్ జగన్ భావిస్తున్నారు. ఇందుకు ముందుగా బలహీనమైన ప్రాంతాలను గుర్తించాలని విజయసాయిరెడ్డిని వైఎస్ జగన్ ఆదేశించారు.
నాయకత్వ మార్పునకు….
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు ఖచ్చితంగా చేరాలన్నా, ప్రజల నుంచి తమకు సరైన ఫీడ్ బ్యాక్ అందాలన్నా నమ్మకమైన కార్యకర్తలు అవసరం. అందుకోసం గ్రామస్థాయి నుంచి మండల, జిల్లా స్థాయి వరకూ పార్టీ నేతలను మార్చేయాలన్నది జగన్ ఆలోచనగా కన్పిస్తుందంటున్నారు. ఏళ్ల తరబడి ఉన్నవారు పనిచేయడానికి ఉత్సాహం చూపరని, కొత్తవారిని నియమిస్తేనే పార్టీ పటిష్టమవుతుందని వైఎస్ జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద జగన్ ఇటు పాలనపైన మాత్రమే కాకుండా పార్టీపైన కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు. అన్ని మున్సిపాలిటీలను, పంచాయతీలను కైవసం చేసుకునే లక్ష్యంగానే పార్టీ సమావేశాలు జరగనున్నాయి.