ఏపీ ఉద్యోగుల్లో అసహనం.. బాబును మించిన ఆ మంత్రి
ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి, గతంలో నవ్యాంధ్రకు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు.. ప్రజల్లో ఆదరాభిమానాలు ఎలా సంపాదించుకున్నారో.. ఎంత సంపాదించుకున్నారో.. తెలియదు కానీ.. అధికారులు, ప్రభుత్వ ఉద్యోగుల నుంచి [more]
ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి, గతంలో నవ్యాంధ్రకు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు.. ప్రజల్లో ఆదరాభిమానాలు ఎలా సంపాదించుకున్నారో.. ఎంత సంపాదించుకున్నారో.. తెలియదు కానీ.. అధికారులు, ప్రభుత్వ ఉద్యోగుల నుంచి [more]
ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి, గతంలో నవ్యాంధ్రకు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు.. ప్రజల్లో ఆదరాభిమానాలు ఎలా సంపాదించుకున్నారో.. ఎంత సంపాదించుకున్నారో.. తెలియదు కానీ.. అధికారులు, ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ఒకింత వ్యతిరేకత అయితే.. మూటగట్టుకున్నారు. 'నేను నిద్రపోను.. మిమ్మల్ని నిద్రపోనివ్వను' అంటూ.. అప్పట్లో చంద్రబాబు.. అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించిన విషయం తెలిసిందే. దీంతో ఉద్యోగుల్లో చంద్రబాబుపై వ్యతిరేకత పెరిగింది. ఇది అధికారం కోల్పోవడానికి కూడా దారితీసింది. దీంతో గత పాలనలో ఉద్యోగుల విషయంలో చంద్రబాబు ఆచితూచి వ్యవహరించారు.
స్పందన కార్యక్రమంలో….
ఇక, ఇప్పుడు జగన్ పాలనలో ఉద్యోగుల విషయంలో స్వయంగా ముఖ్యమంత్రి ఏమీ అనకపోయినా.. పనివిషయంలో మాత్రం ఒత్తిడి ఎక్కువగానే ఉందనేది వాస్తవం. పైగా స్పందన కార్యక్రమంలో ఉద్యోగులపై వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందిస్తున్నారు. చర్యలు తీసుకుంటున్నారు. ఏసీబీని బలోపేతం చేసి.. అవినీతిపై చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ఉద్యోగులు ఒకింత ఆందోళనతోనే ఉన్నారు. కానీ.. పైకి మాత్రం చెప్పలేక పోతున్నారు. ఇదిలావుంటే, తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన కీలక వ్యాఖ్యలు ఉద్యోగ వర్గాల్లో మరింత అలజడి పెంచాయి. ఇప్పటికే పనిభారంతో ఒత్తిడికి ఫీల్ అవుతున్న ఉద్యోగులు.. ఇప్పుడు మంత్రి చేసిన వ్యాఖ్యలతో మరింత ఇరకాటంలో పడ్డారు.
రాష్ట్ర వ్యాప్త పర్యటనతో…..
త్వరలోనే తాను రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తానని.. ఉద్యోగుల పనితీరు పరిశీలిస్తానని.. మార్కులు కూడా వేస్తానని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. అంతేకాదు.. కొన్ని జిల్లాలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని కూడా వ్యాఖ్యానించారు. పనిచేయని వారిని ఏరేస్తామని.. ఎట్టి పరిస్థితిలోనూ ఉపేక్షించేది లేదని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఇక, మంత్రి ఇలా అన్నాడో లేదో.. వెంటనే ఉన్నతాధికారులు అధికారులపై ఎక్కిదిగుతున్నారు. మంత్రి స్వయంగా హెచ్చరించిన విషయాన్ని ఈ సందర్భంగా వారు ఉద్యోగులకు చెబుతున్నారు.
కరోనా సమయంలో…
దీంతో కరోనా సమయంలోనూ ఉద్యోగులు హడలిపోవాల్సి వస్తోందని వాపోతున్నారు. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా తాము ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వహిస్తుంటే తమపై ఎక్కి తొక్కాలనుకుంటే చూస్తూ ఊరుకోమని ఉద్యోగ సంఘాలు అప్పుడే ఫైర్ అవుతున్నాయి. ఉద్యోగులను అనవసరంగా కెలికితే జరిగే ప్రమాదం ఏంటో ఇప్పటికే టీడీపీ వాళ్లకు బాగా అర్థం కావడంతోనే వాళ్లు సైలెంట్ అయ్యారు. మళ్లీ ఇప్పుడు అదే పరిస్థితి కొనసాగితే.. ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు ఇబ్బంది లేకున్నా.. వచ్చే రోజుల్లో పార్టీకి నష్టం కలిగే అవకాశం ఎక్కువని అంటున్నారు పరిశీలకులు.