Andhra : ఇంకో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు జంప్ కు రెడీ అట
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి హీటెక్కబోతున్నాయి. అధికార వైసీపీ తిరిగి ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపిందని సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ సాధించడంతో టీడీపీని మరిత [more]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి హీటెక్కబోతున్నాయి. అధికార వైసీపీ తిరిగి ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపిందని సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ సాధించడంతో టీడీపీని మరిత [more]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి హీటెక్కబోతున్నాయి. అధికార వైసీపీ తిరిగి ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపిందని సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ సాధించడంతో టీడీపీని మరిత బలహీనం చేయాలన్న లక్ష్యంతో అధికార వైసీపీ ఉంది. ఇందుకోసం కొందరు ఎమ్మెల్యేలతో సంప్రదింపులు ప్రారంభమయినట్లు సమాచారం. త్వరలోనే కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీకి మద్దతు తెలిపే అవకాశముంది.
ఇప్పటికే నలుగురు…
2019లో తెలుగుదేశం పార్టీ నుంచి 23 మంది శాసనసభ్యులు విజయం సాధించారు. ఇందులో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీకి మద్దతు తెలిపారు. కమ్మ సామాజికవర్గానికి చెందిన కరణం బలరాం, వల్లభనేని వంశీ పార్టీని వీవడం టీడీపీకి పెద్ద ఎదురుదెబ్బ. అలాగే మద్దాలి గిరి, వాసుపల్లి గణేష్ కుమార్ లు పార్టీని వీడి వైసీపీకి మద్దతుదారులుగా నిలిచారు. వీరి బాటలోనే మరో ఇద్దరు ఎమ్మెల్యేలు వైసీపీకి చేరువవుతారని సమాచారం.
స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల తర్వాత….
రాష్ట్రంలో వైసీపీ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలతో మరింత బలపడింది. దీంతో కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ వైపు చూస్తున్నారని తెలిసింది. వచ్చే ఎన్నికల్లోనూ తమకే ఈ నియోజకవర్గం టిక్కెట్ ఇవ్వడంతో పాటు మరికొన్ని షరతులు కూడా ఆ ఎమ్మెల్యేలు వైసీపీ నాయకత్వం ముందు ఉంచుతున్నట్లు తెలిసింది. అయితే బేషరతుగా చేరాలని, వైసీపీలో ఉంటే భవిష్యత్ ఉంటుందని సీనియర్ నేతలు చెబుతున్నారట.
ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు….
ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ఒక ఎమ్మెల్యే వైసీపీ లో చేరేందుకు సిద్ధమయ్యారని తెలిసింది. తన నియోజకవర్గంలో వైసీపీ మరింత బలపడటం దీనికి కారణం. అలాగే కోస్తా ప్రాంతానికి చెందిన మరో టీడీపీ ఎమ్మెల్యే కూడా వైసీపీకి మద్దతు పలికేందుకు సిద్ధమయ్యారని సమాచారం. ఇక వలసలు ఉండవులే అనుకుంటున్న చంద్రబాబుకు జగన్ త్వరలో షాక్ ఇవ్వనున్నారు. దసరాకు ముందే ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరతారంటున్నారు.