నెల్లూరుపై ఈ మంత్రి కొత్త స్కెచ్.. ఇలా చేస్తే.. ?
నెల్లూరుపై పట్టు బిగించేందుకు ఆ మంత్రి ప్రయత్నిస్తున్నారా ? రెడ్డి సామాజిక వర్గం రాజకీయ దూకుడు ఎక్కువగా ఉన్న ఈ జిల్లాలో తనకంటూ.. ప్రత్యేక స్థానం సంపాదించుకున్న [more]
నెల్లూరుపై పట్టు బిగించేందుకు ఆ మంత్రి ప్రయత్నిస్తున్నారా ? రెడ్డి సామాజిక వర్గం రాజకీయ దూకుడు ఎక్కువగా ఉన్న ఈ జిల్లాలో తనకంటూ.. ప్రత్యేక స్థానం సంపాదించుకున్న [more]
నెల్లూరుపై పట్టు బిగించేందుకు ఆ మంత్రి ప్రయత్నిస్తున్నారా ? రెడ్డి సామాజిక వర్గం రాజకీయ దూకుడు ఎక్కువగా ఉన్న ఈ జిల్లాలో తనకంటూ.. ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఆ మంత్రి.. మరింతగా దూకుడుగా ముందుకు వెళ్లాలని భావిస్తున్నారా ? అంటే.. తాజా పరిణామాలను బట్టి ఔననే అంటున్నారు పరిశీలకులు. నెల్లూరు రూపు రేఖలు మారుస్తానంటూ.. తాజాగా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేసిన ప్రకటనలు ఈ వాదనలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. విషయంలోకి వెళ్తే.. నెల్లూరు సిటీ నుంచి వరుస విజయాలు సాధిస్తున్న అనిల్‌కుమార్ యాదవ్.. ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆయన జిల్లాపై పట్టుకోసం ప్రయత్నిస్తున్నారు.
అధికారులంతా….?
ఇప్పటికే జిల్లాలో అధికారులను ఆయన తన గుప్పిట్లో పెట్టుకున్నారని.. మంత్రి కనుసన్నల్లోనే కలెక్టర్ నుంచి అధికారుల వరకు అందరూ పనిచేస్తున్నారని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అయినా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ దూకుడు ముందు ఈ విమర్శలు ఏమీ పనిచేయడం లేదు. ఇక, వచ్చే ఎన్నికల నాటికి తన వర్గానికి రెండు మూడు టికెట్లు కూడా ఇప్పించుకునేందుకు మంత్రి ప్రయత్నిస్తున్నారని కొన్నాళ్లుగా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు తన నియోజకవర్గంపై హవా చెలాయిస్తూ వస్తోన్న అనిల్ ఇప్పుడు జిల్లాలో మరో రెండు నియోజకవర్గాల్లో తన వర్గం నేతలను ఎంకరేజ్ చేస్తోన్న పరిస్థితి ఉంది.
ఆ వర్గం నేతలకు హెచ్చరిక….
నెల్లూరును రెండు మూడు సంవత్సరాల్లో మార్చేస్తానని… అందుకు అనుగుణంగానే తాను పనిచేస్తున్నాను అని మంత్రి అనిల్ కుమార్ తాజాగా చెప్పారు. ఐదారు వందల కోట్లు గ్రాంట్ రూపంలో తీసుకొచ్చానని, 100 కోట్లతో పెన్నా నది పై ఇంకో బ్రిడ్జి వస్తుంది ట్రాఫిక్ సమస్య మొత్తం తీరిపోతుందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే అనిల్ కుమార్ యాదవ్ తాను మంత్రిని అని.. ఎక్కడ ఎవ్వరూ తనపై పెత్తనం చెలాయించాలని చూస్తే .. తాను చూస్తూ ఊరుకోనని హెచ్చరిక స్వరంతో పదే పదే మాట్లాడుతున్నారు. కరెక్టుగా ఈ డైలాగులో జిల్లాలో ఓ వర్గం నేతలకు సూటిగా తగులుతున్నాయనే అంటున్నారు.
తన వర్గం నేతలను…..
దీనికి తోడు ఒకటి రెండు నియోజకవర్గాల్లో తన వర్గం నేతలను ఎంకరేజ్ చేస్తోన్న తీరు కూడా ఆ వర్గం ప్రజా ప్రతినిధులకు నచ్చడం లేదు. జిల్లా మొత్తం మీద అనిల్ కుమార్ యాదవ్ తో సన్నిహితంగా ఉండే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మినహా ఎంపీ, మిగిలిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవ్వరూ కూడా ఇదేం దూకుడ్రా బాబు అని డిఫెన్స్ ఆలోచనల్లో ఉన్నారు. ఈ వ్యాఖ్యలు.. జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న వారు.. నెల్లూరుపై మరింత పట్టు బిగించేందుకే మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. మరి వైసీపీ రెడ్డి నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. జిల్లాలో ఇంత మంది రెడ్డి నేతలు ఉన్నా..అనిల్ కుమార్ యాదవ్ రేంజ్లో ఒక్కరు కూడా దూకుడుగా వెళుతోన్న పరిస్థితి అయితే లేదు.