జగన్ వీరభక్తుడు అందుకే అయ్యాడా?
భక్తులు పలు రకాలుగా ఉంటారు. కనబడని దేవుడికి భక్తులు ఎందరో ఉంటారు. కనిపించే అవదూతలకు భక్తులూ కోకొల్లలుగా ఉంటారు. ఇక ప్రముఖులకు భక్తులు ఒకరా ఇద్దరా వేలల్లో, [more]
భక్తులు పలు రకాలుగా ఉంటారు. కనబడని దేవుడికి భక్తులు ఎందరో ఉంటారు. కనిపించే అవదూతలకు భక్తులూ కోకొల్లలుగా ఉంటారు. ఇక ప్రముఖులకు భక్తులు ఒకరా ఇద్దరా వేలల్లో, [more]
భక్తులు పలు రకాలుగా ఉంటారు. కనబడని దేవుడికి భక్తులు ఎందరో ఉంటారు. కనిపించే అవదూతలకు భక్తులూ కోకొల్లలుగా ఉంటారు. ఇక ప్రముఖులకు భక్తులు ఒకరా ఇద్దరా వేలల్లో, లక్షల్లోనూ ఉంటారు. సినీ, రాజకీయ రంగాల వారికి క్రికెటర్లకూ భక్తుల కొదవా ఏంటి. తండ్రి వైఎస్సార్ కంటే కూడా జనాదరణ విషయంలో రెండింతలు సంపాదించుకున్న జగన్ కి కార్యకర్తలే పెద్ద భక్తులు. మరి మంత్రుల్లో కూడా వీరభక్తులు ఉన్నారు. అందులో అతి ముఖ్యుడు జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. ఈయన డాక్టర్ చదివారు. యాక్టర్ గా ఉన్న పవన్ ని అభిమానించారు. ఇపుడు లీడర్ గా జగన్ని ఆరాధిస్తున్నారు.
అపర హనుమనే…..
భక్తి విషయంలో అనిల్ కుమార్ ది హనుమంతుడి పోలికే అని చెప్పాలి. ఆయన సినిమా రంగంలో పవన్ కి గొప్ప అభిమాని. అదే రాజకీయాల్లోకి వచ్చేసరికి మాత్రం జగన్ అంటే మోజు ఎక్కువ. అందుకే జగన్ ని విమర్శించినందుకు తన దేవుడు, రాముడు అయినా పవన్ కల్యాణ్ మీదనే రామబాణం వేశారు. సినిమాల్లోనే మీ అభిమానిని రాజకీయాల్లో అసలైన హీరో జగన్ మాత్రమే. ఆయన మీద కువిమర్శలు చేశారో ఏమీ లెక్కచేయనంటూ ఘాటుగానే పవన్ ని తగులుకున్న గట్స్ ఉన్న మినిస్టర్ అనిల్ కుమార్ యాదవ్ అని పేరు తెచ్చుకున్నారు. ఇంకాస్తా ముందుకు వెళ్ళి రాజకీయాల్లో జగన్ హీరో. మీరు సినిమాల్లోనే హీరో అంతే. రాజకీయాల్లో జీరో అంటూ పవన్ ని ఏకిపారేశారు కూడా.
ఎంత పెద్దవారైనా…?
దీనికి కొనసాగింపుగా తాజాగా అనిల్ కుమార్ యాదవ్ భారీ స్టేట్ మెంట్ ఇచ్చేశారు. నన్ను ఏమైనా అనండి భరిస్తాను, కానీ జగన్ ని ఒక్క మాట అన్నా ఊరుకోను, జగన్ మీద లేని పోని విమర్శలు చేస్తే ఎంతటి వాడైనా, వారెంతటి పెద్ద వారైనా కూడా వెనకాడనని, దాడి చేస్తానంటూ అనిల్ కుమార్ రెచ్చిపోయి చేసిన తాజా కామెంట్స్ ఇపుడు పెద్ద ఎత్తున చర్చకు వస్తున్నాయి. జగన్ ని ఆయన పాలనను విమర్శించేవారు ఒకటికి పదిమార్లు ఆలోచించుకోవాలాని కూడా అనిల్ కుమార్ యాదవ్ హెచ్చరిస్తున్నారు. నన్ను ఏమైనా అంటే భరించే శక్తి ఉందేమో కానీ జగన్ ని అంటే అసలు తట్టుకోను, ఆ మీదట మీ ఇష్టమంటూ విపక్షాలకు హెచ్చరికలాంటి సందేశాన్ని అనిల్ కుమార్ యాదవ్ వినిపించేశారు.
అదా సంగతి…..
ఇదిలా ఉండగా ఈ మధ్య జగన్ తో అనిల్ కుమార్ యాదవ్ కి కొంత దూరం పెరిగిందని వార్తలు వస్తున్నాయి. ఆయన ఇంచార్జి మంత్రిగా ఉన్న కర్నూలు జిల్లాలో ఎస్సీ ఎమ్మెల్యే ఆర్డర్ తన పట్ల వివక్ష చూపుతున్నారంటూ మంత్రి మీద నేరుగా జగన్ కి ఫిర్యాదు చేయడం, జగన్ కూడా సీరియస్ గా తీసుకుని డైరెక్ట్ గానే అనిల్ కుమార్ కి క్లాస్ తీసుకోవడం జరిగాయని అంటారు. దాంతో అనిల్ కుమార్ ఇప్పటికిపుడు శీల పరీక్ష పెట్టుకుని మరీ జగన్ ని ఎత్తేస్తున్నారని పార్టీలో వినిపిస్తున్న మాట. మరో వైపు చూసుకుంటే తాను అనుకున్నట్లుగా కొందరు యువ మంత్రులు పనిచేయడంలేదని జగన్ అసంతృప్తిగా ఉన్నారట. అందులో అనిల్ పేరు కూడా ఉందిట. అందుకే పోలవరం ప్రాజెక్ట్ పనులను జగన్ నేరుగా పర్యవేక్షించాలనుకుంటున్నారని కూడా వినికిడి. మొత్తానికి కారణాలు ఏవైనా అనిల్ లోని వీర భక్తుడు ఇపుడు జగన్ ని ఆకాశానికి ఎత్తేస్తున్నాడు అంతవరకూ ఒకే కానీ మంత్రి హోదాలో ఉండి దాడి చేస్తాను అంటూ పరుష పదాలు వాడడం మాత్రం మంచిది కాదని అంటున్నారు.