అనిల్ టార్గెట్ అయ్యారే
రాజకీయ చైతన్యం ఉన్న నెల్లూరు జిల్లాలో అధికార పార్టీ పరిస్థితి ఎలా ఉంది? గత ఏడాది జరిగిన ఎన్నిక ల్లో జిల్లా మొత్తం క్లీన్ స్వీప్ చేసిన [more]
రాజకీయ చైతన్యం ఉన్న నెల్లూరు జిల్లాలో అధికార పార్టీ పరిస్థితి ఎలా ఉంది? గత ఏడాది జరిగిన ఎన్నిక ల్లో జిల్లా మొత్తం క్లీన్ స్వీప్ చేసిన [more]
రాజకీయ చైతన్యం ఉన్న నెల్లూరు జిల్లాలో అధికార పార్టీ పరిస్థితి ఎలా ఉంది? గత ఏడాది జరిగిన ఎన్నిక ల్లో జిల్లా మొత్తం క్లీన్ స్వీప్ చేసిన వైసీపీలో ఇప్పుడు ఎలాంటి వాతావరణం ఉంది ? అన్నది పరిశీలిస్తే ఎన్నికల్లో జిల్లాలో టోటల్‌గా క్లీన్‌స్వీప్ చేసేసి టీడీపీ అడ్రస్ గల్లంతు చేసిన వైసీపీలో ఇప్పుడు అంతే రేంజ్లో గ్రూపుల గోల కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఇక్కడ ఎవరికి వారు వర్గాలుగా ఏర్పడి తమ తమ రాజకీయాలు చేసుకుంటున్నారని అంటున్నారు. ముఖ్యంగా ఈ జిల్లా నుంచి ఇద్దరు కీలక నాయకులకు జగన్ తన కేబినెట్లో మంత్రి పదవులు ఇచ్చారు. వీరిలో ఒకరు మేకపాటి గౌతంరెడ్డికాగా, మరొకరు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్.
మంత్రికి వ్యతిరేకంగా….
ఈ ఇద్దరిలోనూ ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు అనిల్. దూకుడు విషయంలోనూ, గ్రూపుల విషయం లోనూ అనిల్ తన దారిలో తాను వెళ్తున్నారని అంటున్నారు. ఇక, గ్రూపుల విషయానికి వస్తే.. మంత్రి అనిల్, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలు ఒకే వర్గంగా ముందుకు సాగుతున్నారు. ఇక, ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌రెడ్డిలు ఒక వర్గంగా వ్యవహరిస్తున్నారు. కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సైతం కాస్త వ్యక్తిగతంగా ఉన్నట్టు ఉన్నా టైం వస్తే ఈ గ్రూపుతోనే ఉంటారన్న టాక్ ఉంది. వీరంతా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ టార్గెట్‌గానే రాజకీయం నడుపుతున్నారు. అనిల్ పేరు చెపితేనే వీళ్లంగా అగ్గిమీద గుగ్గిలమయ్యే పరిస్థితి నెలకొంది.
ఎప్పుడూ సపరేటే…..
మరోపక్క, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఆత్కూరు ఎమ్మెల్యే, మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి ఒకే కుటుంబం కావడంతో ఈ ఇద్దరూ కూడా ఒకే గ్రూపుగా వ్యవహరిస్తున్నారనే వాదన వినిపిస్తోంది. జిల్లా రాజకీయాల్లో మేకపాటి వర్గానికి ఎప్పుడూ సపరేట్ గ్రూపే. దీంతో జిల్లా వైసీపీలో మూడు గ్రూపుల రాజకీయం నడుస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఇవన్నీ ఇలా ఉంటే మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గురించి మరింతగా ప్రచారం జరుగుతోంది.
ఒకరిపై ఒకరు…..
ఈ రెండు వర్గాలు ఎవరికి వారు అధిష్టానానికి ఫిర్యాదులు చేసుకుంటున్నారు. ఇసుక మాఫియా పెరిగిపోవడం, దూకుడు రాజకీయాలతో పాటు అనిల్ ఓ వర్గానికి యాంటీ అన్న ముద్ర బయటకు రావడంతో వాటిపై జగన్ సీరియస్‌గా ఉన్నారని అంటున్నారు. అదే సమయంలో తనకంటూ ఒక వర్గం ఏర్పాటు చేసుకుని, మిగిలిన వారిని దూరం పెట్టడం, మిగిలిన నాయకులతో కయ్యం పెట్టుకోవడం వంటివికూడా అనిల్‌ను వివాదంగా మారుస్తున్నాయని అంటున్నారు. ప్రస్తుతం అనిల్‌ను విభేదించే వారి సంఖ్య పెరిగినా మంత్రిగా అనిల్ జిల్లాలో బలమైన రెడ్డి సామాజిక వర్గంపై పైచేయి సాధించి ఆధిపత్యం చలాయిస్తున్నారని, వారికి అంగుళం అంత అవకాశం కూడా ఇవ్వడం లేదని అంటున్నారు. సో మొత్తంగా నెల్లూరులో వైసీపీ పరిస్థితి మూడు గ్రూపులు. నాలుగు వివాదాలుగా నడుస్తోందనడంలో సందేహం లేదు.