పొత్తే ప్రమాదంలో పడేసిందా….?
తమిళనాడులో అన్నాడీఎంకేలో అసమ్మతి బయలుదేరుతుందా? లోక్ సభ ఎన్నికల సందర్భంగానే చిచ్చు రాజుకుంటుందా? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. తమిళనాడులో భారతీయ జనతా పార్టీ, పీఎంకేతో పొత్తు [more]
తమిళనాడులో అన్నాడీఎంకేలో అసమ్మతి బయలుదేరుతుందా? లోక్ సభ ఎన్నికల సందర్భంగానే చిచ్చు రాజుకుంటుందా? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. తమిళనాడులో భారతీయ జనతా పార్టీ, పీఎంకేతో పొత్తు [more]
తమిళనాడులో అన్నాడీఎంకేలో అసమ్మతి బయలుదేరుతుందా? లోక్ సభ ఎన్నికల సందర్భంగానే చిచ్చు రాజుకుంటుందా? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. తమిళనాడులో భారతీయ జనతా పార్టీ, పీఎంకేతో పొత్తు పెట్టుకుని అన్నాడీఎంకే ఎన్నికలకు వెళ్లనుంది. డీఎండీకేను కూడా కలుపుకోవాలని చూస్తోంది. దీంతో అన్నాడీఎంకే గత ఎన్నికల కంటే భిన్నంగా తక్కువ స్థానాల్లో పోటీ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే పన్నీర్ సెల్వం, పళనిస్వామిల మధ్య గ్రూపు విభేదాలున్నాయి. వీటిని పరిష్కరించుకుంటూనే లోక్ సభ ఎన్నికలకు వెళదామనుకుంటే పొత్తు రూపంలో పార్టీకి ప్రమాదం వచ్చేటట్లు కనపడుతోంది.
సీట్లు సర్దుబాటు కావడంతో….
అన్నాడీఎంకే, భారతీయ జనతా పార్టీ అధికారికంగా పొత్తు కుదిరింది. అన్నాడీఎంకే 22 స్థానాల్లోనూ, పీఎంకే కు ఏడుస్థానాలు, ఒక రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలని నిర్ణయించారు. భారతీయ జనతా పార్టీ తొలుత కాంగ్రెస్ పోటీ చేసిన స్థానాల్లో తాము కూడా పోటీ చేయాలని, తమకు పది స్థానాలు కావాలని కోరినా పొత్తు ధర్మంలో భాగంగా వెనక్కు తగ్గి ఐదింటిని మాత్రమే తీసుకుంది. మిగిలిన నాలుగు సీట్లను డీఎండీకే కు ఇవ్వాలని భావిస్తున్నారు. కానీ డీఎండీకే అధినేత విజయ్ కాంత్ మాత్రం పీఎంకే తో సమానంగా తమకూ సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. డీఎండీకే ను మెగా కూటమిలోకి రప్పించాలని ఇటు బీజేపీ, అటు అన్నాడీఎంకే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఏ సమయంలోనైనా విజయకాంత్ నిర్ణయం తీసుకునే అవకాశముంది.
సిట్టింగ్ లకు నో ఛాన్స్….
అయితే గత లోక్ సభ ఎన్నికల్లో జయలలిత భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోకుండానే మొత్తం 39 స్థానాల్లో 37 లోక్ సభ స్థానాలను గెలిపించుకుని వచ్చారు. తమిళనాడులోని 37 చోట్ల అన్నాడీఎంకే సిట్టింగ్ పార్లమెంటు సభ్యులే ఉన్నారు. ఈ నేపథ్యంలో పొత్తుల్లో భాగంగా 22 సీట్లలో మాత్రమే అన్నాడీఎంకే పోటీ చేయాలని నిర్ణయం తీసుకోవడం వివాదంగా మారింది. దాదాపు పదిహేను మంది సిట్టింగ్ లు సీట్లు కోల్పోతున్నారు. వీరిలో కొందరు అన్నాడీఎంకే పొత్తును వ్యతిరేకిస్తున్నారు. భారతీయజనతా పార్టీకి వ్యతిరేకంగా అమ్మ జయలలిత పోరాడితే, ఆ పార్టీతో ఎలా పొత్తు పెట్టుకుంటారని ప్రశ్నిస్తున్నారు.
ఎంపీలు తిరుగుబాటు చేస్తారా…?
సీట్లు కోల్పోతున్న సిట్టింగ్ ఎంపీల విషయంలో పన్నీర్ సెల్వం, పళనిస్వామి ఏం చేయనున్నారన్నది చర్చనీయాంశంగా మారింది. లోక్ సభ ఎన్నికలతో పాటుగా 21 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులోదాదాపు 18 మంది ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేస్తేనే ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ ఉప ఎన్నికలు జరిగే స్థానాల్లో సీట్లు రాని ఎంపీలను పోటీ చేయించాలన్న యోచనలో పళని, పన్నీర్ లు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కొందరు పోటీ చేసేందుకు విముఖత చూపుతున్నారు. మరోవైపు టీటీవీ దినకరన్ అసంతృప్త ఎంపీలను మచ్చిక చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. సీట్లు రాకుంటే సిట్టింగ్ ఎంపీలు తిరుగుబాటు బావుటా ఎగురవేసే అవకాశాలున్నాయి. మొత్తం మీద అన్నాడీఎంకేకుపొత్తు ప్రమాదం పొంచి ఉందనే చెప్పాలి.
- Tags
- amma makkal munnetra kajagam
- anna dmk
- bharathiya janatha party
- by elections
- mannar gudi mafia
- palani swamy
- panneer selvam
- pmk
- sasikala
- tamilnadu
- ttv dinakaran
- à° à°¨à±à°¨à°¾à°¡à±à°à°à°à±
- à° à°®à±à°® à°®à°à±à°à°²à± à°®à±à°¨à±à°¨à±à°à±à°° à°à°à°à°
- à°à°ª à°à°¨à±à°¨à°¿à°à°²à±
- à°à±à°à±à°µà± దినà°à°°à°¨à±
- తమిళనాడà±
- పనà±à°¨à±à°°à± à°¸à±à°²à±à°µà°
- పళనిసà±à°µà°¾à°®à°¿
- à°ªà±à°à°à°à±
- à°à°¾à°°à°¤à±à°¯ à°à°¨à°¤à°¾ పారà±à°à±
- శశిà°à°³