చప్పగా ఉందే… జోష్ ఏదీ…?
ఒకప్పుడు ఎన్నికల ప్రచారం అంటే ఎలా ఉండేది…ముఖ్యంగా అన్నాడీఎంకేలో పార్టీ శ్రేణులు స్టిక్కర్ల కోసం, పోస్టర్ల కోసం కొట్టుకు చచ్చే వారు. పోస్టర్లు తీసుకుని వెళ్లి గ్రామాల్లో [more]
ఒకప్పుడు ఎన్నికల ప్రచారం అంటే ఎలా ఉండేది…ముఖ్యంగా అన్నాడీఎంకేలో పార్టీ శ్రేణులు స్టిక్కర్ల కోసం, పోస్టర్ల కోసం కొట్టుకు చచ్చే వారు. పోస్టర్లు తీసుకుని వెళ్లి గ్రామాల్లో [more]
ఒకప్పుడు ఎన్నికల ప్రచారం అంటే ఎలా ఉండేది…ముఖ్యంగా అన్నాడీఎంకేలో పార్టీ శ్రేణులు స్టిక్కర్ల కోసం, పోస్టర్ల కోసం కొట్టుకు చచ్చే వారు. పోస్టర్లు తీసుకుని వెళ్లి గ్రామాల్లో తామే స్వయంగా అంటించేవారు. ఎంజీ రామచంద్రన్ నుంచి జయలలిత వరకూ అదే ఒరవడి కొనసాగింది. అమ్మ బొమ్మ దొరికితే చాలు అది ప్లాస్టిక్ దా…? కాగితంతో చేసిందా? అన్నది సంబంధం లేదు. భద్రంగా జేబుల్లో దాచుకునే వారు. ఇక ఎంజీఆర్, జయలలితలు ప్రచారానికి వస్తున్నారంటే స్వచ్ఛందంగా తరలి వచ్చేవారు. వారు చెప్పే నాలుగు మాటలు విని వెళ్లిపోయేవారు.
అప్పటిలా లేదే…..
కానీ అన్నాడీఎంకేలో నేడు ఆ పరిస్థితి లేదు. జయలలిత ఉన్నప్పటి జోష్ లేదు. పార్టీ కార్యాలయంలో కూడా సందడి లేకుండా పోయింది. అమ్మ జయలలిత ఎన్నికలు వస్తే వరాలు కురిపించే వారు. టీవీలు, ఫ్రిజ్ లు, వాషింగ్ మిషన్లు ఇలా ఒకటేమిటి ల్యాప్ ట్యాప్ లతో సహా తమిళనాట ఎన్నికల వరాలు కనిపించేవి. కానీ ఈ లోక్ సభ ఎన్నికలు చప్పగా సాగుతున్నాయి. అన్నాడీఎంకేలోని కార్యకర్తలు సయితం ప్రచారం పట్ల పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదు.
అంతా ఒంటిచేత్తో…..
ప్రజల మనస్సుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న జయలలిత లేకుండా జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవి. గత లోక్ సభ ఎన్నికల్లో అతి పెద్ద మూడో పార్టీగా అన్నాడీఎంకే అవతరిచిందంటే అందుకు కారణం జయలలిత చరిష్మా అని చెప్పనక్కర లేదు. తమిళనాడు, పుదుచ్చేరి కలిపి మొత్తం 40 లోక్ సభ నియోజకవర్గాల్లో 37 స్థానాలను గెలుచుకుని దేశం దృష్టిని జయలలిత ఆకర్షించగలిగారు. అభ్యర్థుల ఎంపిక, ప్రచారం దగ్గర నుంచి అన్నీ తానే అయి జయలలిత చూసుకోవడం వల్లనే ఈ విజయం సాధ్యమయిందన్నది కాదనలేని వాస్తవం. కరుణానిధి వంటి సీనియర్ నేతలున్న డీఎంకేకు ఒక్క సీటు దక్కకుండా చేయగలిగారంటే ఆమె చరిష్మా గురించి మాట్లాడుకోవాల్సిన అవసరమూ లేదు.
ఇతరుల వైపు…..
కాని ఇప్పుడు అన్నాడీఎంకేకు పెద్దదిక్కు ఎవరూ లేరు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, ముఖ్యమంత్రి పళనిస్వామిలే ప్రధాన ప్రచారకర్తలుగా ఉన్నారు. వారిద్దరూ కొన్ని ప్రాంతాలకే పరిమితమైన నేతలు కావడంతో జనాలపై పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు. అందుకే పొత్తులు పెట్టుకున్నారు. మోదీ వైపు ఆశగా చూస్తున్నారు. పార్టీలో బలమైన నేతలుగా వీరిద్దరూ కన్పిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పట్టులేని లీడర్లుగానే చెప్పుకోవాలి. మొత్తం మీద జయలలిత ఉన్నప్పుడు జరిగిన ఎన్నికల జోష్ ఇప్పుడు అన్నాడీఎంకేలో లేకపోవడం విశేషం.
- Tags
- anna dmk
- dmk
- jayalalitha
- palani swamy
- panneer selvam
- stallin
- tamilnadu
- ttv dinakaran
- à° à°¨à±à°¨à°¾à°¡à±à°à°à°à±
- à°à°¯à°²à°²à°¿à°¤
- à°à±à°à±à°µà± దినà°à°°à°¨à±
- à°¡à±à°à°à°à±
- తమిళనాడà±
- పనà±à°¨à±à°°à± à°¸à±à°²à±à°µà°
- పళనిసà±à°µà°¾à°®à°¿
- à°¸à±à°à°¾à°²à°¿à°¨à±