వచ్చేసింది… నో…ప్లాబ్లమ్….!!
లోక్ సభ ఎన్నికల వేళ తమిళనాడులోని అధికార పార్టీ అన్నాడీఎంకే అగ్రనేతలకు ఆశలు చిగురించాయి. ఒకవైపు డీెఎంకే దూసుకుపోతుండటం, మరోవైపు దినకరన్ కొత్త పార్టీతో క్యాడర్ లో [more]
లోక్ సభ ఎన్నికల వేళ తమిళనాడులోని అధికార పార్టీ అన్నాడీఎంకే అగ్రనేతలకు ఆశలు చిగురించాయి. ఒకవైపు డీెఎంకే దూసుకుపోతుండటం, మరోవైపు దినకరన్ కొత్త పార్టీతో క్యాడర్ లో [more]
లోక్ సభ ఎన్నికల వేళ తమిళనాడులోని అధికార పార్టీ అన్నాడీఎంకే అగ్రనేతలకు ఆశలు చిగురించాయి. ఒకవైపు డీెఎంకే దూసుకుపోతుండటం, మరోవైపు దినకరన్ కొత్త పార్టీతో క్యాడర్ లో అయోమయానికి గురి చేస్తుండటంతో వచ్చే లోక్ సభ ఎన్నికలు, 21 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలుఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, ముఖ్యమంత్రి పళనిస్వామిలకు సవాల్ గా నిలిచాయి. ఈ ఎన్నికల ఫలితాలతో వారి రాజకీయ భవిష్యత్తు తేలిపోనుంది. ఓటమి ఎదురైతే ప్రభుత్వం కుప్ప కూలిపోవడమే కాకుండా పార్టీ కూడా తమ చేతుల్లో నుంచి చేజారి పోతుంది.
కూటమితో ఎన్నికలకు….
అందుకే లోక్ సభ ఎన్నికలు, ఉప ఎన్నికలను గట్టెక్కేందుకు అన్నాడీఎంకే కూటమిని కట్టింది. కేంద్రంలో అధికారంలో ఉండి,పక్కా వ్యూహాలను రచించగల భారతీయ జనతా పార్టీ, కొన్ని ప్రాంతాల్లో పట్టున్న పీఎంకేలను దరి చేర్చుకుంది. వారు కోరినన్ని సీట్లను కేటాయించింది. మరో వైపు డీఎంకే కూటమి కూడా బలంగా ఉంది. ఇప్పటికే లోక్ సభ ఎన్నికల సీట్ల పంపిణీని పూర్తి చేసుకుని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ కార్యక్షేత్రంలోకి దిగారు. దినకరన్ కూడా కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యమ్ తో జత కట్టాలని ప్లాన్ చేసుకుంటున్నారు.
గుర్తుకోసం……
ఈ పరిస్థితుల్లో అన్నాడీఎంకేకు బలమైనది……తమిళ ఓటర్లు మర్చిపోలేనిది రెండాకుల గుర్తు. ఈ గుర్తు కోసం పళనిస్వామి, దినకరన్ వర్గాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. గుర్తు తమేదనంటూ రెండు వర్గాలు గట్టిగా పట్టుబట్టాయి. ఎన్నికల కమిషన్ కు , న్యాయస్థానానికి అవసరమైన డాక్యమెంట్లనన్నింటినీ ఇరు వర్గాలు సమర్పించాయి. ఈ గుర్తు ఎవరికి వస్తే వారికే పట్టు ఉంటుందన్నది అందరికీ తెలిసిందే. గతంలో జరిగిన ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లోనూ ఈ గుర్తు కోసం పోరాడినా రెండాకుల గుర్తును ఎవరికీ ఎన్నికల కమిషన్ కేటాయించలేదు.
రెండాకులు దక్కడంతో……
అయితే తాజాగా రెండాకుల గుర్తును పళనిస్వామి వర్గానికే కేటాయిస్తూ ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పడంతో పళనిస్వామి, పన్నీర్ సెల్వం ఊపిరి పీల్చుకున్నారు. గుర్తు రావడంతో ఈ శిబిరంలో సంబరాలు మిన్నంటాయి. ఇప్పటి వరకూ ఎన్నికల వేళ ఎంతమంది అధికార అన్నాడీఎంకే నుంచి వెళ్లిపోతారోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. అయితే గుర్తు వీరికే ఖరారు కావడంతో ఇప్పుడు జంపింగ్ లు ఉండవని వీరు నమ్ముతున్నారు. జయలలిత వదిలిపోయిన బ్రహ్మాస్త్రం ఈ రెండాకులు. ప్రజల్లోకి ఈ గుర్తును జయలలిత బలంగా తీసుకెళ్లగలిగారు. ఇప్పుడు పళనిస్వామి, పన్నీర్ సెల్వం బ్యాచ్ కు అధికారికంగా రెండాకులు గుర్తు దక్కడంతో వచ్చే ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయం తమదేనన్న ధీమాతో ఉన్నారు. మరి దినకరన్, శశికళలు ఈ గుర్తు కోసం మరోసారి పైకోర్టును ఆశ్రయిస్తారో లేదో చూడాలి.
- Tags
- anna dmk
- dmk
- palani swamy
- panneer selvam
- sasikala
- stallin
- symbol
- tamilnadu
- ttv dinakaran
- à° à°¨à±à°¨à°¾à°¡à±à°à°à°à±
- à°à±à°°à±à°¤à±
- à°à±à°à±à°µà± దినà°à°°à°¨à±
- à°¡à±à°à°à°à±
- తమిళనాడà±
- పనà±à°¨à±à°°à± à°¸à±à°²à±à°µà°
- పళనిసà±à°µà°¾à°®à°¿
- శశిà°à°³
- à°¸à±à°à°¾à°²à°¿à°¨à±