ఈసారి హైలెట్ అవేనట
2020-21 ఏపీ పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలు ఈ నెల ఆఖరులో కానీ, మార్చి తొలి వారంలో కానీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే బడ్జెట్‌పై ఆర్థిక శాఖ [more]
2020-21 ఏపీ పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలు ఈ నెల ఆఖరులో కానీ, మార్చి తొలి వారంలో కానీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే బడ్జెట్‌పై ఆర్థిక శాఖ [more]
2020-21 ఏపీ పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలు ఈ నెల ఆఖరులో కానీ, మార్చి తొలి వారంలో కానీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే బడ్జెట్‌పై ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి కసరత్తు ప్రారంభించారు. జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రవేశపెడుతున్న పూర్తిస్థాయి బడ్జెట్ కావడం, మేనిఫెస్టోలో పేర్కొన్న నవరత్నాలకు నిధుల కొరత వెంటాడుతున్న నేపథ్యంలో ఏపీ బడ్జెట్ ఎలా రూపొందుతుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అయితే, ఈ బడ్జెట్ సమావేశాలు కూడా మరింత హీటెక్కనున్నాయని అంటున్నారు పరిశీలకులు.
కేంద్ర బడ్జెట్ పై…
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ఏపీకి ఒక్క పైసా కూడా ప్రత్యేకంగా నిధులు ఇవ్వక పోవడంపై అసెంబ్లీ సమావేశాల్లో అధికార వైసీపీ, ప్రతిపక్షం టీడీపీల మధ్య మాటల యుద్ధం జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. 22 మంది ఎంపీలు ఉండి కూడా రాష్ట్రానికి రూపాయి కూడా తెచ్చుకోలేక పోయారని ఇప్పటికే టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. జగన్ పాలనా వైఖరిపై నిప్పులు చెరుగుతున్నా రు.
ఎదురుదాడితో వైసీపీ…..
అయితే, వైసీపీ కూడా ఇదే రేంజ్లో ప్రతివిమర్శలు చేస్తోంది. గతంలో మీరు తెచ్చారా? ప్రత్యేక హో దా విషయంలో మీ వల్లే రాష్ట్రం నష్టపోయిందని, ప్యాకేజీకి ఒప్పుకొని రాష్ట్రాన్ని నట్టేట ముంచారని ప్రతి విమర్శలు చేస్తోంది. ఇక, రాష్ట్ర బడ్జెట్ విషయానికి వస్తే.. నవరత్నాల పథకాలు రాష్ట్రానికి ప్రతిష్టాత్మకంగా మారాయి. వీటిని అమలు చేసేందుకు భారీ ఎత్తున నిధుల సమీకరణ చాలా ముఖ్యం. అదే సమయంలో పోలవరం ప్రాజెక్టును 2021నాటికి పూర్తి చేసి గ్రావిటీ ద్వారా నీటిని ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో దీనికి కేంద్రం నుంచి నిధులు తీసుకువస్తారా? లేక రాష్ట్ర బడ్జెట్లోనే కేటాయిస్తారా ? అనేది ప్రధాన ప్రశ్న. ఇక, రాజధానుల విషయంలోనూ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇక, వెనుక బడిన జిల్లాల్లో సాగు, తాగు నీటి కల్పన, కేంద్ర పన్నుల వాటాలో 1 శాతం తగ్గిపోయిన నేపథ్యంలో ఆదాయం పెంపు వంటివి కూడా రాష్ట్ర బడ్జెట్లో కీలకంగా మారనున్నాయి. ఏదేమైనా అసెంబ్లీ సమావేశాల్లో అధికార , ప్రతిపక్షాల మధ్య ఆర్థిక విషయాలు హైలెట్ కానున్నాయి.