ఢిల్లీలో ఉన్న వాళ్లు వైసీపీకి వేస్ట్ గానే మిగిలిపోతున్నారా?
ఏపీ ప్రభుత్వానికి రాష్ట్రంలోనే కాకుండా ఢిల్లీలోనూ అనేక మంది సలహాదారులు ఉన్నారు. లెక్కకు మిక్కిలి గా సలహాదారులను పెంచిపోషిస్తున్న ప్రభుత్వంగా కూడా వైసీపీ ఆరోపణలు ఎదుర్కొంటోంది. అయితే.. [more]
ఏపీ ప్రభుత్వానికి రాష్ట్రంలోనే కాకుండా ఢిల్లీలోనూ అనేక మంది సలహాదారులు ఉన్నారు. లెక్కకు మిక్కిలి గా సలహాదారులను పెంచిపోషిస్తున్న ప్రభుత్వంగా కూడా వైసీపీ ఆరోపణలు ఎదుర్కొంటోంది. అయితే.. [more]
ఏపీ ప్రభుత్వానికి రాష్ట్రంలోనే కాకుండా ఢిల్లీలోనూ అనేక మంది సలహాదారులు ఉన్నారు. లెక్కకు మిక్కిలి గా సలహాదారులను పెంచిపోషిస్తున్న ప్రభుత్వంగా కూడా వైసీపీ ఆరోపణలు ఎదుర్కొంటోంది. అయితే.. ఇంత మంది సలహాదారులను పెట్టుకుని కూడా ఇటు రాష్ట్రంలోను, అటు కేంద్రంలోను ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. నిజానికి ప్రస్తుతం కరోనా సమయంలో ప్రజలకు ఎలాంటిసేవలు అందించాలి? ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఎలాంటి సంబంధ బాంధవ్యాలు ఉండాలి ? అనే విషయాలపై సలహాదారులు దృష్టి పెడుతున్నట్టు కనిపించడం లేదని వైసీపీలోనే పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
పదవిలో ఉండి కూడా..?
ప్రధానంగా.. ఢిల్లీలో నలుగురు సలహాదారులు ఉన్నారు. దేవులపల్లి అమర్ సహా నలుగురు ఢిల్లీలో కార్యకలాపాలను చక్రదిద్దుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వంపై జాతీయ మీడియాలో వ్యతిరేక వార్తలు రాయకుండా చూడాల్సిన అమర్ కానీ, కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని కేంద్రం నుంచి అందాల్సిన సహాయం ఏపీకి సకాలంలో అందించే విషయంలోనూ ఈ సలహాదారులు ఎక్కడా చొరవ చూపించలేక పోతున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. ఈ విషయంలో వైసీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
వ్యాక్సిన్ల విషయంలోనూ..?
అంతేకాదు.. ప్రస్తుతం ఏపీకి రెమ్డిసివర్ ఇంజన్లు సహా.. వ్యాక్సిన్లను కేంద్రమే ఇవ్వాల్సి ఉందని.. తమ చేతుల్లో ఏమీ లేదని కూడా ప్రభుత్వం చెబుతోంది. మరి ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు కేంద్రంతో నిరంతరం టచ్లో ఉండాల్సిన సలహాదారులు ఢిల్లీలో తమకు కేటాయించిన రూంలకే పరిమితమవుతున్నారనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం. మరోవైపు ఒకరిద్దరే సలహాదారులు ఉన్న తెలంగాణకు కోరినన్న వ్యాక్సిన్లు లభిస్తుండగా.. ఏపీకి మాత్రం అలా లభించడం లేదు.
తాము సలహాలిచ్చినా?
మరి ఈ విషయంలోనూ సలహాదారులు ఎందుకు చొరవ తీసుకోవడం లేదనేది ప్రశ్న. నెలకు 4 లక్షల రూపాయల వేతనంతో సహా.. ఇతర అలవెన్సులు పొందుతున్నా.. పనిచేయడం లేదా? లేదా.. తాము సలహాలు ఇచ్చినా.. వైసీపీ సర్కారు తీసుకోదనే నిశ్చితాభిప్రాయంలో ఉన్నారా అనే సందేహాలు వ్యక్తమవుతుండడం గమనార్హం.