ఏపీకి మరో అన్యాయం.. తప్పు మోడీదా.. జగన్ దా.. ?
ఏపీకి మళ్లీ అన్యాయం జరిగింది. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి కూడా కేంద్ర మంత్రులను తీసుకున్న మోడీ ఏపీకి మాత్రం మొండి చేయి చూపించారు. సాటి తెలుగు [more]
ఏపీకి మళ్లీ అన్యాయం జరిగింది. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి కూడా కేంద్ర మంత్రులను తీసుకున్న మోడీ ఏపీకి మాత్రం మొండి చేయి చూపించారు. సాటి తెలుగు [more]
ఏపీకి మళ్లీ అన్యాయం జరిగింది. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి కూడా కేంద్ర మంత్రులను తీసుకున్న మోడీ ఏపీకి మాత్రం మొండి చేయి చూపించారు. సాటి తెలుగు రాష్ట్రం తెలంగాణాలో అయితే కిషన్ రెడ్డిని క్యాబినేట్ మంత్రిని చేసి ఆ రాష్ట్రం ప్రాధాన్యతను చాటి చెప్పారు. కానీ ఏపీ వరకూ చూసుకుంటే కనీసం సహాయ మంత్రి కూడా లేరు. ఆఖరుకు కేరళ నుంచి కూడా కేంద్ర మంత్రి ఉన్నారు. కేరళ కంటే కూడా బీజేపీకి ఏపీలో కొంత పొలిటికల్ యాక్టివిటీ ఉంది. పైగా ఇక్కడ అధికార వైసీపీతో కూడా గుడ్ రిలేషన్స్ ఉన్నాయని అంతా చెబుతారు. మరి అలాంటి చోట ఒక్క కేంద్ర మంత్రిని కూడా తీసుకోకపోవడం నిజంగా అవమానమే అంటున్నారు.
జగనే కారణం …
అయితే దీనికి కారణం జగన్ అని కేంద్ర పెద్దలు అంటున్నట్లుగా భోగట్టా. మోడీ చేతిలో ఉన్న కేంద్ర మంత్రుల ఎంపికకూ జగన్ కి ఏంటి సంబంధం అంటే అక్కడే అసలైన రాజకీయ కధ ఉందిట. లోక్ సభలో నాలుగవ పెద్ద పార్టీగా ఉన్న వైసీపీని కేంద్ర మంత్రి మండలిలో చేరమని ఇప్పటికి ఏడాది కాలంగా బీజేపీ పెద్దలు ఆహ్వానిస్తున్నారు. అయితే జగన్ వారి ముందు ఆలోచించి చెబుతాను అని ఏపీకి వచ్చిన తరువాత ముఖం చాటేస్తున్నారు. ఈ మధ్యన జగన్ ఢిల్లీ వెళ్ళినపుడు కూడా అమిత్ షా ఆయన్ని సమాదరించి మరీ కేంద్రంలో చేరాలని కోరారుట. రాజకీయంగానే కాదు అన్ని రకాలుగా రెండు పార్టీలకు మేలు జరుగుతుంది అని వివరించారుట. కానీ జగన్ దాన్ని పెడ చెవిన పెట్టారని కమలనాధులు గుస్సా అవుతున్నారుట.
జగన్ తప్పు చేశారా..?
నిజానికి చంద్రబాబు కూడా నాలుగేళ్ల పాటు కేంద్రంలోని బీజేపీతో స్నేహం చేశారు. అక్కడ తన వారికి మంత్రి పదవులు ఇప్పించుకున్నారు. ఆ మేరకు నిధులు కూడా తెప్పించుకున్నారు. కొంత అభివృద్ధి జరిగింది కూడా. జగన్ కూడా అలా చేసి చివరి ఏడాది విడిపోయినా ఏపీకి మేలు జరిగేది అన్న మాట ఉంది. ఇక్కడ జగన్ రాజకీయం కోసం ఏపీని బలి పెట్టారు అన్న చర్చ కూడా వస్తోంది. బీజేపీతో చేతులు కలిపితే తన మైనారిటీ ఓట్లకు గండం వస్తుంది అని ఆలోచించే జగన్ కేంద్రంలోని మంత్రి మండలిలో చేరలేదు అంటున్నారు. దాని వల్ల జగన్ కి రాజకీయంగా మేలు జరిగినా ఏపీ మాత్రం నష్టపోతోంది అంటున్నారు. ఈ విధంగా ఇప్పటికే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఏపీకి కేంద్ర సాయాన్ని జగన్ కోరి దూరం చేశారు అని మేధావులు అంటున్నారు. తమకు దగ్గర మిత్రుడు కానీ జగన్ విషయంలో కేంద్రం ఉదారంగా ఎందుకు సాయం చేస్తుంది అన్న మాట కూడా ఉంది. మొత్తానికి ఏపీకి అన్యాయం చేసింది ఎవరు అంటే మోడీతో పాటు జగన్ పేరు కూడా చెప్పాలని అంటున్నారు.
- Tags
- modi
- à°®à±à°¡à±