మిమ్మల్లి…ఇలా అనుకోలేదు.. భయ్యా…?
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఐఆర్ఎస్ అధికారిగా పనిచేశారు. ఆయన దేశానికి సేవ చేయాలని రాజకీయల్లోకి వచ్చారు. కానీ ఢిల్లీకే పరిమితమయ్యారు. కానీ కేజ్రీవాల్ ఆలోచనలు కూడా [more]
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఐఆర్ఎస్ అధికారిగా పనిచేశారు. ఆయన దేశానికి సేవ చేయాలని రాజకీయల్లోకి వచ్చారు. కానీ ఢిల్లీకే పరిమితమయ్యారు. కానీ కేజ్రీవాల్ ఆలోచనలు కూడా [more]
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఐఆర్ఎస్ అధికారిగా పనిచేశారు. ఆయన దేశానికి సేవ చేయాలని రాజకీయల్లోకి వచ్చారు. కానీ ఢిల్లీకే పరిమితమయ్యారు. కానీ కేజ్రీవాల్ ఆలోచనలు కూడా ఢిల్లీ దాటి ముందుకు వెళ్లే పరిస్థితులు కన్పించడం లేదు. ఇందుకు కారణం ఆయన తీసుకున్న తాజా నిర్ణయమే అని చెప్పక తప్పదు. ఢిల్లీ వాసులకే కేవలం నగరంలోని ప్రయివేటు ఆసుపత్రుల్లో చికిత్స అందించాలని తీసుకున్న కేజ్రీవాల్ నిర్ణయం వివాదాస్పదమయింది.
కేసుల సంఖ్య పెరుగుతుండటంతో…
ఢిల్లీలో కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇక్కడి నుంచే దేశం మొత్తానికి కరోనా వైరస్ వ్యాప్తి చెందింది. ఢిల్లీ అంటే ఒక ప్రాంతం కాదు. అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఇక్కడ నివాసముంటారు. రోజూ వచ్చే పోయేవారి సంఖ్య కూడా లక్షల్లోనే ఉంటుంది. కానీ కేసుల సంఖ్య పెరుగుతుండటం, ఆసుపత్రుల్లో సరైన సౌకర్యాలు లేకపోవడంతో అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలోని ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రులు స్థానికులకే కరోనా పరీక్షలు, చికిత్స అందించాలని నిర్ణయం తీసుకున్నారు.
తప్పుడు నిర్ణయమంటూ….
కానీ కేజ్రీవాల్ నిర్ణయాన్ని అన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. కోవిడ్ బారిన పడిన వారు ఎవరైనా సరే చికిత్స అందించాలి తప్ప ఇలాంటి సంకుచిత మనస్తత్వం ఏంటని రాజకీయ పార్టీలు కేజ్రీవాల్ ను నిలదీశాయి. మాయావతి నుంచి కాంగ్రెస్, బీజేపీలు కేజ్రీవాల్ నిర్ణయాన్ని తప్పుపట్టాయి. దేశ ప్రజలకు కేజ్రీవాల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా కోవిడ్ బారిన పడితే ప్రాంతాలకు అతీతంగా వైద్య సేవలు అందించాలని అవి గుర్తు చేస్తున్నాయి.
బైజాల్ కొట్టిపారేశారు……
అయితే కేజ్రీవాల్ నిర్ణయాన్ని లెఫ్ట్ నెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ సయితం తప్పుపట్టారు. కేజ్రీవాల్ విడుదల చేసిన ఉత్తర్వులను అనిల్ బైజాల్ సవరించారు. కోవిడ్ విషయంలో స్థానికుడా? స్థానికేతరుడా? అన్న విషయం చూడవద్దని ఆయన తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కేజ్రీవాల్ మాత్రం భవిష్యత్ లో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముండటంతోనేతాను ఈ నిర్ణయం తీసుకున్నానని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. మొత్తం మీద కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయంపై స్వపక్షం నుంచి కూడా విమర్శలు విన్పిస్తుండటం విశేషం.