కేజ్రీవాల్ కు ముందు ముందు అన్నీ కష్టాలే
ఢిల్లీ ముఖ్యమంత్రిగా మూడోసారి ఎన్నికయిన అరవింద్ కేజ్రీవాల్ కు ముందు ముందు అనేక సమస్యలు తలెత్తనున్నాయి. లెఫ్గ్ నెంట్ గవర్నర్ రూపంలో ఆయన ప్రతి కదలికకూ అడ్డు [more]
ఢిల్లీ ముఖ్యమంత్రిగా మూడోసారి ఎన్నికయిన అరవింద్ కేజ్రీవాల్ కు ముందు ముందు అనేక సమస్యలు తలెత్తనున్నాయి. లెఫ్గ్ నెంట్ గవర్నర్ రూపంలో ఆయన ప్రతి కదలికకూ అడ్డు [more]
ఢిల్లీ ముఖ్యమంత్రిగా మూడోసారి ఎన్నికయిన అరవింద్ కేజ్రీవాల్ కు ముందు ముందు అనేక సమస్యలు తలెత్తనున్నాయి. లెఫ్గ్ నెంట్ గవర్నర్ రూపంలో ఆయన ప్రతి కదలికకూ అడ్డు పడే అవకాశముంది. ఇక అరవింద్ కేజ్రీవాల్ ఉత్సవ విగ్రహంలా మారిపోతున్నారు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా దానికి లెఫ్ట్ నెంట్ గవర్నర్ అనుమతి తప్పనిసరి అవుతుంది. ఢిల్లీ ప్రభుత్వ అధికారాలన్నీ ఇక లెఫ్ట్ నెంట్ గవర్నర్ చేతిలోనే ఉన్నాయి.
కొన్నింటికి మాత్రమే….?
ఇప్పటివరకూ దేశ రాజధాని ఢిల్లీ రాష్ట్రంలో శాంతిభద్రతలు, పోలీసు వ్యవస్థ, భూ వ్యవహారాలు కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉండేవి. వైద్యం, విద్యతో పాటు మిగిలిన అన్ని రంగాల్లో ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునేది. కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన నిర్ణయాలు అరవింద్ కేజ్రీవాల్ కు చెక్ పెట్టడానికేనన్నది వేరే చెప్పనవసరం లేదు. ఢిల్లీ పాలనాయంత్రాంగం కూడా ఇప్పటి నుంచి లెఫ్ట్ నెంట్ గవర్నర్ అధీనంలో ఉంటుంది.
ఎల్జీ అనుమతి…..
అరవింద్ కేజ్రీవాల్ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా లెఫ్ట్ నెంట్ గవర్నర్ అనుమతి తప్పనిసరి. అది సంక్షేమ పథకం కావచ్చు. తన ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుపర్చే విషయంలో కావచ్చు. ఒక నిర్ణయం తీసుకోవాలంటే అందుకు లెఫ్ట్ నెంట్ గవర్నర్ ఓకే చెప్పాలి. ఆయన ఓకే చెప్పిన తర్వాతనే అది ఉత్తర్వుల రూపంలో వెలువడనుంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో కేజ్రీవాల్ కు ముందు ముందు సమస్యలు తప్పవంటున్నారు.
సంక్షేమ పథకాలు కూడా…?
అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికి మూడు సార్లు విజయం సాధించారు. ప్రజలు ఆయన పక్షాన ఉన్నారని ఇట్టే అర్థమవుతుంది. కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయాలు, ఆయన అమలు పర్చిన సంక్షేమ పథకాలు ఆయనకు అండగా నిలిచాయి. అందుకే వరస ఎన్నికల్లో విజయం సాధించి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ పై పట్టు సాధించారు. కానీ తాజా నిర్ణయంతో ఆయన ఎటువంటి కీలక నిర్ణయం తీసుకోవాలన్నా లెఫ్గ్ నెంట్ గవర్నర్ ను సంతృప్తి పర్చాల్సి ఉంటుంది. ఒక రకంగా కేంద్రం కేజ్రీవాల్ చేతులు కట్టేసినట్లే చెప్పాలి.